Tuesday, November 30, 2010

అందాలరాముడు--1973

సంగీతం::K.V.మహాదేవన్
రచన::ఆరుద్ర
గానం::V.రామకృష్ణ,J.V.రాఘవులు
తారాగణం::అక్కినేని, లత,రాజబాబు,అల్లు రామలింగయ్య,నాగభూషణం,ధూళిపాళ, 
నూతన్ ప్రసాద్, సూర్యకాంతం

భద్రాచల క్షేత్రమహిమ::-హరికథ

పల్లవి::

మాతల్లి గోదారి చూపంగ దారి
పడవెక్కి భద్రాద్రి పోదామా
భద్రాద్రి రాముణ్ణి చూదామా
భద్రగిరి మహిమలే విందామా
భద్రగిరి మహిమలే విందామా

ఏవిటోయ్ ఆ మహిమలు  
శ్రీమద్రమారమణ గోవిందో హరి 
భక్తులారా సుజనులారా
సీతాలక్ష్మణ సమేతుడైన శ్రీరామచంద్రుడు
అరణ్యవాస సమయంబున పావన గోదావరీ తీరంబున
ఒకానొక గిరిని పరికించి 
దానిపై సుంత విశ్రమించినంత ఆ కంధరమ్మొక 
సుందరపురుషాకృతి దాల్చి..ఏమనినాడనదా

ధన్యుడనైతిని  ఓ రామా
నా పుణ్యము పండెనుశ్రీరామా
ధన్యుడనైతిని  ఓ రామా
నా పుణ్యము పండెనుశ్రీరామా
మేరుగిరీంద్రుని పుత్రుడను
నీ రాకకు చూచే భద్రుడనూ
నారీశిరోమణి సీతమ్మతో మీరు
నా శిరమున నెలకొన వేడెదనూ
కారుణ్యాలయ కామిత మీడేర్చ
కలకాలము నిను కొలిచెదనూ
ధన్యుడ ధన్యుడ ధన్యుడనైతిని ఓ రామా
నా పుణ్యము పండెనుశ్రీరామా
అని భద్రుడుప్రార్థించిన స్వామివారేమన్నరనగా  
వత్సా..నీ ముద్దు చెల్లించుటకు ముందు 
మా తండ్రిమాట చెల్లించవలయును
తదా ఉత్తరోత్తర కాలంబున పునర్దర్శనంబు ఇచ్చువాడను
అని వెడలిపోయిరి...అంతట
వెడలిన రాముడు వెలదిని బాసి ఇడుములలో బడెనూ
కడలికి వారధి గట్టి కఠినాత్ముడు దనుజుని గొట్టి
కలికి చెరను పోగొట్టి కనువిందుగ పట్టము గట్టి
బంధుమిత్రుల తలచుట బట్టి భక్తుని మాట మరిచాడు
రాముడు పరమావతారమ్ము విడిచాడు 
వైకుంఠవాసమ్ము చేరాడు
శ్రీమద్రమారమణ గోవిందో హరి  

కాని భూలోకమున భద్రుడు 
ఎన్నియుగము లైనా ఎదురుచూస్తూ
ఏ విధిముగా శోకించినాడనగా
వచ్చెదనంటివి రామయ్యా
వరమిచ్చెదనంటివి రామయ్యా
వచ్చెదనని శలవిచిన పిమ్మట
మోసపుచ్చుట ఇచ్చట తగదయ్యా
వచ్చెనుకద నీ మాటకు మచ్చా
అది రానిచ్చెదనా నిను పోనిచ్చెదనా
హెచ్చరింతు నువు మెచ్చెడి తపమున
నిచ్చలు జపించి ఖచ్చితముగా
ఓ సచ్చరిత్రనిన్నిచ్చటకీడ్చెద వచ్చెదనంటివి రామయ్యా
వరమిచ్చెదనంటివి రామయ్యా

అని శపథంబు చేసి మహోగ్ర తపస్సు నాచరించగా   
సకల సురాసుర యక్ష గంధర్వ కిన్నెర కింపురుషాదులు     
సంక్షోభమ్మునొందిరి అపుడు కదలెను
శ్రీ మహావిష్ణువు కదలెను భక్తసహిషువు
సుదతి శ్రేదేవికి సుంతయినా తెలుపక
శుభ శంఖచక్రాల కరముల దాల్చక
సుదూరమౌ భూలోకమునకు
సుపర్ణుని భుజమైన ఏక్కకా
వడివడి కదలెను శ్రీమహావిష్ణువు కదలెను
భక్తసహిషువు శ్రీమద్రమారమణ గోవిందో హారి

గజేంద్రమోక్ష సన్నివేశంబుకై వడి
స్వామి వారు ఆ విధమ్ముగాకదలగా
తనవెంటన్ సిరిలచ్చివెంట నవరోధవ్రాతమున్
దానివెనుకను పక్షీంద్రుడు వానిపొంతను 
ధను:కౌబోదదీ సంఖ చక్ర నికాయంబునూ 
హుటాహుటిని రాగా తొందరయందు అపసవ్యంబుగా 
ఆయుధములు ధరించి..స్వామి
వారు భద్రునకు దర్శనంబీయ 
ఆ భక్త శిఖామణి ఏమన్నాడు

ఏవరివయ్య స్వామి ఏను నిన్నెరుగను
హరిని నేనటంచు అనగనేల
నాడు నన్నుబ్రోచు నారాముడవునావు
నాటి రూపుచూప నమ్మగలను
అని భద్రుడుకోరగా శ్రీమహావిష్ణువు
తొలినాటి రామావతారమ్ము ప్రదర్శించెను   
అపసవ్యమ్ములైన ఆయుధమ్ములు ఆతీరుగనే చేతుల
నెల్చెను భద్రుడు మహదానందబరితుడై
ఈ తీరుగనె ఇచ్చట వెలయుము
ఇనకులసోమా రామా
భూతలమున ఇది సీతారాముల
పుణ్యక్షేత్ర లలామా శభాష్ 
అని విన్నవించగా స్వామివారు ఆ తీరు గనే వెలసిర్ 
ఆ భద్రుడే భద్రాద్రి అయ్యెను 
భద్రగిరి వాసుడైన శ్రీరామచంద్రుడు
ఎండకు ఎండి వానకు తడిసి నీడకు తపించినవాడై  
ఒకనాడు శబరి అంశమునజన్మించినదైన 
పోకల దమ్మక్క అను భక్తురాలి 
స్వప్నమున సాక్షాత్కరించి ఆవైనమ్ము తెలుపగా  
ఆయన భద్రగిరినంతయుగాలించగా
స్వామివారి దివ్యసుందరమూర్తికనిపించెను
కోరి కనిపించావా కోదండరామయ్యా
గుడికట్టలేని ఈ బడుగుపేదకు నీవు
కోరి కనిపించావా కోదండరామయ్యా
గుడికట్టలేని ఈ బడుగుపేదకు నీవు 
చక్రవర్తి కుమారుడా ఇంకో చక్రవర్తికి అల్లుడా
భూచక్రమేలిన సార్వభౌమా
విధివక్రించి నీకే వాసమ్ముకరువా
తాటాకు పందిరే తాటకాంతక నీకు భవనమయ్యా
తాటిపండ్లే ఓ మేటి రాజకుమార
విందులయ్యా నీకు విందులయ్యా

అని పోకల దమ్మక్క నిత్యము సేవించుకొనెను 
తదుత్తర కాలంబున రామదాసుగా 
ప్రఖ్యాతుడైన కంచెర్ల గోపన్న 
ఏవిధముగా ఆలయనిర్మాణము గావించెననగా 
ఏవిధముగానా అప్పుజేసి
తప్పు నాయనా గోపన్న చరితము లోకవిఖ్యాతము 
తదీయసంస్మరణము మంగళదాయకము
రామచంద్ర్రయ జనక రాజజామనోహరాయ
మామకాభీష్టదాయ మహిత మంగళం
సీతా రామచంద్ర్రయ జనక రాజజామనోహరాయ
మామకాభీష్టదాయ మహిత మంగళం
మహిత మంగళం  మహిత మంగళం
మహిత మంగళం  మహిత మంగళం
జై శ్రీమద్రమారమణ గోవిందో  హరి: 

కొడుకు కోడలు--1972


సంగీత::K.V.మహదేవన్
రచన::ఆత్రేయ
గానం::ఘంటసాల
తారాగణం::అక్కినేని, వాణీశ్రీ, S.V.రంగారావు, శాంతకుమారి, లక్ష్మి 
పల్లవి::
నేలకు ఆశలు చూపిందెవరో..నింగికి చేరువ చేసిందెవరో 
నేనెవరో నువ్వెవరో..నిన్ను నన్నూ కలిపిందెవరో  
నేనెవరో నువ్వెవరో నిన్ను నన్నూ కలిపిందెవరో
నేనెవరో నువ్వెవరో
చరణం::1
ఈ రోజు నువ్వు..ఎదురు చూచిందే  
యీ పాట నాకు..నువ్వు నేర్పిందే
యీ సిగ్గెందుకు...నా ఎదుట
యీ సిగ్గెందుకు...నా ఎదుట 
ఆచిరు చెమటెందుకు..నీ నుదుట  
నేనెవరో నువ్వెవరో నిన్ను నన్నూ కలిపిందెవరో
నేనెవరో నువ్వెవరో
చరణం::2
నేనడగకె నువ్వు...మనసిచ్చావు 
నీ అనుమతిలేకె...నేనొచ్చాను 
మనసుకు తెలుసు ఎవ్వరిదో..తానెవ్వరిదో
మనసుకు తెలుసు ఎవ్వరిదో..తానెవ్వరిదో 
అది ఋజువయ్యింది వొద్దికలో..మన ఒద్దికలో
నేనెవరో నువ్వెవరో...నేనెవరో నువ్వెవరో 
నిన్ను నన్నూ...కలిపిందెవరో

చరణం::3

ఏ జన్మ మమత..మిగిలి పోయిందో 
ఈ జన్మ మనువుగా..మనకు కుదిరిందీ
ఈ అనురాగానికి...తనివి లేదు 
ఈ అనురాగానికి...తనివి లేదు 
ఈ అనుబంధానికి...తుది లేదు 
నేనెవరో నువ్వెవరో..నిన్ను నన్నూ కలిపిందెవరో
నేనెవరో నువ్వెవరో..నేనెవరో నువ్వెవరో

Monday, November 29, 2010

కొడుకు కోడలు--1972


సంగీత::K.V.మహదేవన్
రచన::ఆత్రేయ
గానం::P.సుశీల,S.జానకి
తారాగణం::అక్కినేని, వాణీశ్రీ, S.V. రంగారావు, శాంతకుమారి, లక్ష్మి 
పల్లవి::

ఇదేనన్నమాట..ఇది అదేనన్న మాట 
మతి మతిలోలేకుంది..మనసేదో లాగుంది..అంటే
ఇదేనన్నమాట..ఇది అదేనన్న మాట 
మతి మతిలోలేకుంది..మనసేదో లాగుంది..అంటే 
ఇదేనన్నమాట..ఇది అదేనన్న మాట

చరణం::1

ప్రేమంటే అదోరకం..పిచ్చన్నమాట 
ఆ పిచ్చిలోనె వెచ్చదనం..వున్నదన్నమాట
ప్రేమంటే అదోరకం..పిచ్చన్నమాట 
ఆ పిచ్చిలోనె వెచ్చదనం..వున్నదన్నమాట
మనసిస్తే మతి..పొయిందన్నమాట 
మనసిస్తే మతి..పొయిందన్నమాట
మతిపోయే మత్తేదో..కమ్మునన్నమాట
ఇదేనన్నమాట..ఇది అదేనన్న మాట

చరణం::2

కొత్త కొత్త సొగసులు..మొగ్గ తొడుగుతున్నవి 
అవి గుండెలో వుండుండి..గుబులు రేపుతున్నవి
కొత్త కొత్త సొగసులు..మొగ్గ తొడుగుతున్నవి 
అవి గుండెలో వుండుండి..గుబులు రేపుతున్నవి
కుర్రతనం చేష్టలు..ముద్దులొలుకుతున్నవి 
కుర్రతనం చేష్టలు..ముద్దులొలుకుతున్నవి 
అవి కునుకురాని కళ్ళకు..హ్హ..కలలుగా వచ్చినవి
ఇదేనన్నమాట..ఇది అదేనన్న మాట

చరణం::3

ఆడదాని జీవితమే..అరిటాకు అన్నారు 
అన్నవాళ్ళందరూ..అనురాగం కోరారు
ఆడదాని జీవితమే..అరిటాకు అన్నారు 
అన్నవాళ్ళందరూ..అనురాగం కోరారు
తేటి ఎగిరిపోతుంది..పువ్వు మిగిలిపోతుంది 
తేటి ఎగిరిపోతుంది..పువ్వు మిగిలిపోతుంది 
తేనె వున్నసంగతే..తేటిగుర్తు చేస్తుంది
ఇదేనన్నమాట..ఇది అదేనన్న మాట

చరణం::4

వలపే ఒక వేదనా..ఆ..అది గెలిచిందా తీయనా..ఆ
వలపే ఒక వేదనా..ఆ..అది గెలిచిందా తీయనా..ఆ 
కన్నెబ్రతుకే ఒక శోధనా..ఆ..కలలు పండిస్తే సాధనా..ఆ 
ఆఆఆ..మనసు మెత్తపడుతుంది కన్నీటిలోనా
ఆఆఆ..మమతల పంటకదే..తొలకరి వాన 
ఇదేనన్నమాట..ఇది అదేనన్న మాట 
మతి మతిలోలేకుంది..మనసేదో లాగుంది..అంటే…
ఇదేనన్నమాట..ఇది అదేనన్న మాట

చిట్టితల్లి--1972
సంగీత::విజయాకృష్ణమూర్తి
రచన::G.K.మూర్తి
గానం::P.సుశీల
తారాగణం::హరనాధ్,భారతి, బేబి రాణీ,రాజబాబు, రమాప్రభ,త్యాగరాజు,సాక్షి రంగారావు  

పల్లవి::

వెచ్చనీ..ఈ..వెన్నెలనోయీ..వెచ్చనీ..ఈ..వెన్నెలనోయీ 
విచ్చిన మల్లియనోయీ..ఈ..
వచ్చినా..ఆ..నీకయీ..ఈ..వచ్చినా..ఆ..నీకయీ

చరణం::1

కనుపాపల్లో దీపము నీవే..కలలోపల రూపము నీవే 
కనుపాపల్లో దీపము నీవే..కలలోపల రూపము నీవే
నా మధురాల భావము నీవే..నా మదిలోని దైవము నీవే
వచ్చినా..ఆ..నీకయీ..ఈ..వచ్చినా..ఆ..నీకయీ
వెచ్చనీ..ఈ..వెన్నెలనోయీ..విచ్చిన మల్లియనోయీ
వచ్చినా..ఆ..నీకయీ..ఈ..వచ్చినా..ఆ..నీకయీ
ఆహా హా ఆహా హా ఆహా హా ఆ ఆ హా..

చరణం::2

పిల్లగాలుల అల్లరిసాగే..వల్లెచాటున వలపులు దాగే
పిల్లగాలుల అల్లరిసాగే..వల్లెచాటున వలపులు దాగే
కాలి మువ్వల్లో పిలుపులు మ్రోగే..కొంటె కోరికలూ చెలరేగే
వచ్చినా..ఆ..నీకయీ..ఈ..వచ్చినా..ఆ..నీకయీ
వెచ్చనీ..ఈ..వెన్నెలనోయీ..విచ్చిన మల్లియనోయీ..ఈ
వచ్చినా..ఆ..నీకయీ..ఈ..వచ్చినా..ఆ..నీకయీ

చిట్టితల్లి--1972సంగీత::విజయాకృష్ణమూర్తి
రచన::G.K.మూర్తి
గానం::S.P.బాలు,జిక్కి 
తారాగణం::హరనాధ్,భారతి, బేబి రాణీ,రాజబాబు, రమాప్రభ,త్యాగరాజు,సాక్షి రంగారావు  

పల్లవి::

ఈ..ఈ..తీయనిరేయి తెలవారుటె మాని..ఈ
యిలా..ఆఆఆ..నిలచి కవ్వించనీ..ఈ
ఈ..ఈ..తీయనిరేయి తెలవారుటె మాని..ఈ
యిలా..ఆఆఆ..నిలచి కవ్వించనీ..ఈ

చరణం::1

నీ లేడి కన్నులలోనా..నీ లెత వన్నెలలోనా
నీ లేడి కన్నులలోనా..నీ లెత వన్నెలలోనా
తీరైన లోకాలన్నీ..తిలకించనీ..ఈ..తిలకించనీ
మరుమల్లె మాలికనోయీ..మరులున్న బాలికనోయీ
మురిపించు మురళిని నేనై వినిపించనీ..ఈ..వినిపించనీ..మ్మ్
ఈ..ఈ..తీయనిరేయి తెలవారుటె మాని..ఈ
యిలా..ఆఆఆ..నిలచి కవ్వించనీ..ఈ

చరణం::2

నీ నడక సొంపులలోనా..లే నడుము ఒంపులలోనా
నీ నడక సొంపులలోనా..లే నడుము ఒంపులలోనా
యెనలేని వయ్యారాలు..కనిపించనీ..ఈ..కనిపించనీ
నీ హృదయ సీమను చేరి..నీ పెదవి నవ్వుగ మారి..మ్మ్
అందాల ఆనందాలు అందించనీ..ఈ..అందించనీ..ఆహా  

ఈ..ఈ..తీయనిరేయి తెలవారుటె మాని..ఈ
యిలా..ఆఆఆ..నిలచి కవ్వించనీ..ఈChittiTalli--1972
Music::Vijayakrishnamoorti
Lyrics::G.Krishnamurthy
Singers::S. P.Balu,Jikki
Cast::Harinath,Bharati,BabyRani,Rajababu,Ramaprabha,Tyagayya,Saakshi Rangarao

:::

Ee..ii..theeyaniraeyi thelavaaruthe maani..ii
yilaa..aaaaaa..nilachi kavvinchanee..ii

Ee..ii..theeyaniraeyi thelavaaruthe maani..ii
yilaa..aaaaaa..nilachi kavvinchanee..ii

::::1

nee ledi kannulalonaa..nee lEta vannelalonaa
nee ledi kannulalonaa..nee lEta vannelalonaa
teeraina lokaalannee tilakinchanee..ii..thilakinchanee
marumalle maalikanoyee..marulunna baalikanoyee
muripinchu muralini nenai vinipinchanee..ii..vinipinchanee..mm

Ee..ii..theeyaniraeyi thelavaaruthe maani..ii
yilaa..aaaaaa..nilachi kavvinchanee..iie

::::2

nee nadaka sompulalonaa..le nadumu ompulalonaa
nee nadaka sompulalonaa..le nadumu ompulalonaa
yenaleni vayyaaraalu kanipinchanee..ii..kanipinchanee
nee hridaya seemanu cheri..nee pedavi navvuga maari..mm
andaala aanandaalu andinchanee..iiandinchanee..aahaa  

Ee..ii..theeyaniraeyi thelavaaruthe maani..ii
yilaa..aaaaaa..nilachi kavvinchanee..ii

Sunday, November 28, 2010

భార్యాబిడ్డలు--1972


సంగీత::K.V..మహదేవన్
రచన::ఆత్రేయ
గానం::P.సుశీల  
తారాగణం::అక్కినేని, కృష్ణకుమారి , జగ్గయ్య, జయలలిత, గుమ్మడి, రాజబాబు

పల్లవి::

భలే భలే నచ్చారు..అబ్బాయిగారు 
ముందు ముందు మెచ్చాలీ..అమ్మాయిగారు
భలే భలే నచ్చారు..అబ్బాయిగారు 
ముందు ముందు మెచ్చాలీ..అమ్మాయిగారు
అబ్బాయి గారు...ఏమంటారూ 
భలే భలే నచ్చారు..అబ్బాయిగారు 
ముందు ముందు మెచ్చాలీ..అమ్మాయిగారు

చరణం::1

ఏ మత్తు చల్లారో...తొలిచూపులో 
ఏ మంత్రం వేశారో...తొలిపాటలో
ఏ మత్తు చల్లారో...తొలిచూపులో 
ఏ మంత్రం వేశారో...తొలిపాటలో
కాళ్ళతో నడిపించి..కళ్ళు దోచుకున్నారు 
నడవలేని నన్నిలా..పరుగులు తీయించారు  
భలే భలే నచ్చారు..అబ్బాయిగారు 
ముందు ముందు మెచ్చాలీ..అమ్మాయిగారు

చరణం::2

కొంటిచూపు..గుచ్చుకున్నదెక్కడో 
చిలిపి నవ్వు..తొలిచినది ఎక్కడో
కొంటిచూపు..గుచ్చుకున్నదెక్కడో 
చిలిపి నవ్వు తొలిచినది...ఎక్కడో
వొంటరిగా ఒక్క క్షణం..వుండలేకున్నాను 
చెలరేగే వయసుపోరు..చెప్పలేకున్నాను   
భలే భలే నచ్చారు..అబ్బాయిగారు 
ముందు ముందు మెచ్చాలీ..అమ్మాయిగారు 
అబ్బాయిగారు...ఏమంటారూ 
భలే భలే నచ్చారు..అబ్బాయిగారు 
ముందు ముందు మెచ్చాలీ..అమ్మాయిగారు

చరణం::3

తోడొచ్చి దోబూచు...లెందుకండి 
దొరగారి దొంగాటలు...చాలులెండి
తోడొచ్చి దోబూచు...లెందుకండి 
దొరగారి దొంగాటలు...చాలులెండి
చెలిమిలో ఈమోడు..చిగిరించి వున్నది 
అదనులో దానికొక్క..అంటు కట్టమన్నది   
భలే భలే నచ్చారు..అబ్బాయిగారు 
ముందు ముందు..మెచ్చాలీ అమ్మాయిగారు 
అబ్బాయిగారు...ఏమంటారూ 
భలే భలే నచ్చారు..అబ్బాయిగారు 
ముందు ముందు మెచ్చాలీ..అమ్మాయిగారు

Saturday, November 27, 2010

సుఖదుఖాలు--1968


సంగీతం::S.P.కోదండపాణి
రచన::ఆరుద్ర
గానం::S.P.బాలు,P.సుశీల 

ఓ...ఓ..పదారు నా వయసూ..పండింది నా సొగసు
పడుచుగుండే తెలుసుకోలేవా..ఒహో..బావా..ఇలా రావా దోచుకోవా

ఓ...ఓ..పదారు నా వయసూ..పండింది నా సొగసు
ఓహో..ఓహో..ఓహో..ఓహో..ఓహో..ఓహో..ఓహో..

ఓహో..ఓ...ఓ...ఓహో....ఓ..ఓ...

చరణం::1

చిలిపిగా..ఆ..నవ్వకూ..వలపులే పొంగునూ..
కొంటే కొటే చూపులన్ని..గొడవచేసేనూ..హోయ్..
గులాబి బుగ్గలపై..పలాన గురుతులతో..
సరాగ మాడినచో..చల్లని మైకం..

ఓ...ఓ..పదారు నా వయసూ..పండింది నా సొగసు
ఓహో..ఓహో..ఓహో..ఓహో..ఓహో..ఓహో..ఓహో..

చరణం::2

నడకలో..హంసలూ..నవ్వులో..చిలకలూ..
గొంతులోన వంతపాడు కోయిలున్నదీ..
చలాకి నా పరువం..జిలేబి తీపిసుమా..
అందాల నా హొయలూ..ఆరగించుమా..

ఓ...పదారు నా వయసూ..ఊ..ఊ..ఊ..ఊ..
పండింది నా సొగసు..ఊ..ఊ..ఊ..ఊ..

పదారు నా వయసూ..పండింది నా సొగసు
పడుచుగుండే తెలుసుకోలేవా..ఒహో..బావా..ఇలా రావా దోచుకోవా

ఓ...పదారు నా వయసూ..పండింది నా సొగసు
ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ.. 

జగత్ కిలాడీలు--1969


సంగీతం::S.P.కోదండపాణి
రచన::దేవులపల్లి
గానం::S.P.బాలు ,P.సుశీల 
నటీ,నటులు::కృష్ణ,వాణిశ్రీ, S.V.రంగారావ్ 

పల్లవి::

వేళ చూస్తే సందె వేళా..గాలి విస్తే పైరగాలి
వేళ చూస్తే సందె వేళా..గాలి విస్తే పైరగాలి
ఏల ఒంటరి తోటకడకు ఎందుకొరకు..
ఎందుకొరకూ..ఊ..ఎందుకొరకూ..

కళ్ళు కప్పే రాత్రివేళ..ఒళ్ళునిమిరే పిల్లగాలి
మెల్ల మెల్లన తోటపిలిచే అందుకొరకే..అందుకొరకే..

చరణం::1

అచ్చంగా వసంత మాసం..వచ్చేదాకా
వెచ్చన్ని పూదేనియలు..తెచ్చేదాకా
అచ్చంగా వసంత మాసం..వచ్చేదాకా
వెచ్చన్ని పూదేనియలు..తెచ్చేదాకా
పెదవి పెదవి..ఎదురై ఎదురై..
పెదవి పెదవి..ఎదురై ఎదురై..
మధువులు వెదికే వేళా..మగువా అదియే వసంత వేళా

వేళ చూస్తే సందె వేళా..గా వీస్తే పైరగాలి
ఏల ఒంటరి తోటకడకు..ఎందుకొరకూ..ఊ..ఎందుకొరకూ

చరణం::2

రెప్పల్లో దాగిన..చూపులు చెప్పేదేమిటో
గుండెల్లో గుస గుస లాడే..కోరిక లేమిటో
రెప్పల్లో దాగిన..చూపులు చెప్పేదేమిటో
గుండెల్లో గుస గుస లాడే..కోరిక లేమిటో
రారా..వెంటనే..రారా వెంటనే పొదరింటికి
ఇక రాదురా నిదుర..నా కంటికి..

కళ్ళు కప్పే రాత్రివేళ..ఒళ్ళునిమిరే పిల్లగాలి
మెల్ల మెల్లన తోటపిలిచే అందుకొరకే..అందుకొరకే..

వేళ చూస్తే సందె వేళా..గా వీస్తే పైరగాలి
ఏల ఒంటరి తోటకడకు..ఎందుకొరకూ..ఊ..ఎందుకొరకూ

జగత్ కిలాడీలు--1969


సంగీతం::S.P.కోదండపాణి
రచన::కోసరాజు
గానం::S.P.బాలు , విజ్యలక్ష్మి కన్నారావు 

పల్లవి::

ఎక్కడన్న బావా అంటే ఒప్పుకొంటాను పిల్లా ఒప్పుకొంటాను
వంగతోటకాడన్నావంటే తప్పుకొంటాను బుల్లే తప్పుకొంటాను

హోయ్..తోట పెంచను అంతో ఇంతో తోడుగ ఉన్నాను నీకు తోడుగ ఉన్నాన్నూ
వంకచేయ్ నివు చూపావంటే కారం కొడతాను కంట్లో కారం కొడతాను

చరణం::1

కడుపు కష్టమున సంపాయించిన డబ్బులు ఊరక వస్తాయా
కడుపు కష్టమున సంపాయించిన డబ్బులు ఊరక వస్తాయా
తళుక్కుమంటూ..చమక్కుచేస్తే.. వళ్ళో ఊడిపడతాయా

ఎక్కడన్నా..ఎక్కడన్నా బావా అంటే ఒప్పుకొంటాను పిల్లా ఒప్పుకొంటాను
వంగతోటకాడన్నావంటే తప్పుకొంటాను..బుల్లే తప్పుకొంటాను

చరణం::2

దారినపోయే దానయల్ల..ప్రేమంటే సరిపోతుందా..ఓ బుల్లోడా..ఆ..
దారినపోయే దానయల్ల..ప్రేమంటే సరిపోతుందా
వట్టిమాటలకు వాలుచూపులకు..వలపు వచ్చి పై పడుతుందా
హోయ్..పిల్లోయ్..ప్రాణం ఇమ్మని అడిగావంటే..పస్తాయించక ఇస్తాను
అహా..ప్రాణం ఇమ్మని అడిగావంటే..పస్తాయించక ఇస్తాను
బైసా ఇమ్మని గొణిగావంటే..తోకముడిచి పరుగేస్తానూ..

ఎక్కడన్నా..ఎక్కడన్నా బావా అంటే ఒప్పుకొంటాను పిల్లా ఒప్పుకొంటాను
వంగతోటకాడన్నావంటే తప్పుకొంటాను..బుల్లే తప్పుకొంటాను

డబ్బువదలనిది ఎవరికి ప్రేమ డబ్బులేమికాదూ..జోగే డబ్బులేమికాదూ
హా..హ్హ..హ్హ..హ్హ..ఆహా..
...?చూస్తూ ఉంటే మోజు తీరిపోదూ..నీకు మోజు తీరిపోదూ 

అహా..ఎక్కడన్నా..ఓ..ఎక్కడన్నా బావా అంటే ఒప్పుకొంటాను పిల్లా ఒప్పుకొంటాను
వంకచేయ్ నివు చూపావంటే కారం కొడతాను..అబ్బా.. కంట్లో కారం కొడతాను

Friday, November 26, 2010

వెలుగు నీడలు--1961::రాగమాలిక


సంగీతం::పెండ్యాల నాగేశ్వర్ రావు
రచన::శ్రీ శ్రీ , కోసరాజు  
గానం:: జిక్కి , P.సుశీల ,P.G.కృష్ణవేణి 

{ వకుళాభరణం::రాగం  
చక్రవాకం::రాగం 
మాయామాళవ గౌళ::రాగం }

రాగమాలిక  

పల్లవి::

వకుళాభరణం::రాగం  

సావిత్రి:: 
చల్లని వెన్నెల సోనలు  
తెల్లని మల్లెల మాలలు
మా పాపాయి బోసినవ్వులే
మంచి ముత్యముల వానలు 

గిరిజ::
చల్లని వెన్నెల సోనలు  
తెల్లని మల్లెల మాలలు
మా పాపాయి బోసినవ్వులే
మంచి ముత్యముల వానలు

చరణం::1

గిరిజ:: 
పిడికిలి మూసిన చేతులు  
లేత గులాబీ రేకులు 
పిడికిలి మూసిన చేతులు
లేత గులాబీ రేకులు 
చెంపకు చారెడు సోగకన్నులే
సంపదలీనెడు జ్యోతులు
మా పాపాయి బోసినవ్వులే మంచి ముత్యముల వానలు 

చల్లని వెన్నెల సోనలు  
తెల్లని మల్లెల మాలలు
మా పాపాయి బోసినవ్వులే
మంచి ముత్యముల వానలు 

చక్రవాకం::రాగం 

సుగుణ::
ఇంటను వెలసిన దైవము 
కంటను మెరిసిన దీపం
మా హృదయాలకు హాయి నొసంగే
పాపాయే మా ప్రాణము 

ఇంటను వెలసిన దైవము 
కంటను మెరిసిన దీపం
మా హృదయాలకు హాయి నొసంగే
పాపాయే మా ప్రాణము

చల్లని వెన్నెల సోనలు 
తెల్లని మల్లెల మాలలు
మా పాపాయి నవ్వు పువ్వులె
మంచి ముత్యముల వానలు

చరణం::3

మాయామాళవ గౌళ::రాగం 

సుగుణ::
నోచిన నోముల పంటగ
అందరి కళ్ళకు విందుగా
నోచిన నోముల పంటగ
అందరి కళ్ళకు విందుగా
పేరు ప్రతిష్టలె నీ పెన్నిథిగా
నీరేళ్ళాయువు పొందుమా
మా పాపాయి నవ్వు పువ్వులె
మంచి ముత్యముల వానలు

చల్లని వెన్నెల సోనలు 
తెల్లని మల్లెల మాలలు
మా పాపాయి నవ్వు పువ్వులె
మంచి ముత్యముల వానలు
చల్లని వెన్నెల సోనలు 
తెల్లని మల్లెల మాలలు

ధర్మదాత--1966
సంగీతం::T.చలపతిరావు
రచన::C.నారాయణ రెడ్డి
గానం::ఘంటసాల

పల్లవి::

ఓ ధర్మదాతా ఓ ధర్మదాతా
ఎవరూ నీవారు కారు
ఎవరూ నీతోడు రారు
అడిగిన వారికి కాదనక
అర్పించిన ఓ ధర్మదాతా

చరణం::1

సగము దేహమై నిలిచిన నీ దేవి
రగిలే చితిలో రాలింది
పుట్టెడు మమతలు పండించు యిల్లాలు
పిడికెడు బుదిడగా మారింది
ముత్తైదువుగా ముగిసిన సతిమేను
కృష్ణ వేణిగా మిగిలింది
కృష్ణ వేణిగా మిగిలింది
ఎవరూ నీవారు కారు
ఎవరూ నీతోడు రారు

చరణం::2

కల్ప తరువగా వెలసిన భవనం
కడకు మెడుగా మారేనా
కోటి దివ్వెలు నిలిపిన నీకే
నిలువ నీడయే కరువాయెన
పూవు లమ్ముకొని బ్రతికే చోట
పూవు లమ్ముకొని బ్రతికే చోట
కట్టేలమ్ముకోను గతి పట్టేనా
ఓ ధర్మదాతా ఓ ధర్మదాతా

విచిత్ర దాంపత్యం--1971సంగీత::అశ్వద్థామ
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::P.సుశీల
తారాగణం::శోభన్ బాబు,గుమ్మడి,రాజబాబు,సావిత్రి,విజయనిర్మల,విజయలలిత,మీనాకుమారి 

పల్లవి::

పండిత నెహ్రూ...పుట్టినరోజూ
పాపలందరికి...పుట్టినరోజూ
మమతా సమతా..పుట్టినరోజూ
మంచికి కోవెల కట్టిన..రోజూ
పండిత నెహ్రూ..పుట్టినరోజూ
పాపలందరికి...పుట్టినరోజూ

చరణం::1

ముత్యంలాంటి మొతీలాలుకు..రత్నంలా జన్మించాడూ
జాతిరత్నమై వెలిగీ..ఇంకొక జాతి రత్నమును కన్నాడూ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ 
అతడే జవహర్ లాలూ..అతనికి మన జేజేలూ
అతడే జవహర్ లాలూ..అతనికి మన జేజేలూ
పండిత నెహ్రూ పుట్టినరోజూ..పాపలందరికి పుట్టినరోజూ 

చరణం::2

తలపై తెల్లని టోపీ..ఎదపై ఎర్ర గులాబీ
తలపై తెల్లని టోపీ..ఎదపై ఎర్ర గులాబీ
పెదవులపై చిరునవ్వూ..మదిలో పున్నవి పువ్వూ
చేతిలో పావురం..మన జాతికి అతడే గొపురం
చేతిలో పావురం..మన జాతికి అతడే గొపురం
పండిత నెహ్రూ...పుట్టినరోజూ
పాపలందరికి...పుట్టినరోజూ 

చరణం::3

మహాత్మ గాంధీ...అడుగుజాడలో 
స్వరాజ్య సమరం...నడిపాడూ
రణ దాహంతో...రగిలే జగతిని 
శాంతి సుధలు...కురిపించాడూ
కన్ను మూసినా..జవహర్ లాల్కం
కంటి పాపగా...ఉన్నాడూ 
ఇంటింట జ్యోతిగా...ఉన్నాడూ
చాచా నెహ్రూ...అమర్ రహే
చాచా నెహ్రూ అమర్ రహే..అమర్ రహే

విచిత్ర దాంపత్యం--1971
సంగీత::అశ్వద్థామ
రచన::ఉషః శ్రీ
గానం::L.R.ఈశ్వరి
తారాగణం::శోభన్ బాబు,గుమ్మడి,రాజబాబు,సావిత్రి,విజయనిర్మల,విజయలలిత,మీనాకుమారి 

పల్లవి::

నీలాలా నింగిపై...చందమామా 
నువు రేయంతా తిరిగావూ చందమామా
నీలాలా నింగిపై...చందమామా 
నువు రేయంతా తిరిగావూ చందమామా 

చరణం::1

మబ్బులో మాయమై..మనసులో లీనమై
మబ్బులో మాయమై..మనసులో లీనమై
చీకట్లూ చీల్చుతూ..చిరుకాంతి చల్లుతూ
చెంగలువ చెలియతో..చెలియపై ప్రేమతో  
వనమంతా తిరిగావూ..వన్నెలే కూర్చావూ

నీలాలా..నీలాలా..నింగిపై చందమామా 
నువు రేయంతా..తిరిగావూ చందమామా
నువు రేయంతా..తిరిగావూ చందమామా

చరణం::2

నింగిలోంచి నిలిచి చూస్తూ..చల్లనీ వెన్నెలనూ
నింగిలోంచి నిలిచి చూస్తూ..చల్లనీ వెన్నెలనూ  
ఇంపుగా చిలుకుతూ..వింతకాంతులొలుకుతూ
ఒళ్ళంతా పులిమావూ..వలపు వేడి రేపావూ
ఒంటరైన నన్ను చూచి..వంకరగా నవ్వావూ

నీలాలా..ఊయ్ యహా..నీలాలా..నింగిపై చందమామా   
నువు రేయంతా తిరిగావూ చందమామా
నువు రేయంతా తిరిగావూ చందమామా

చరణం::3

మనసులో మమత నింపి..వయసులో వలపు జల్లి
మనసులో మమత నింపి..వయసులో వలపు జల్లి
చుక్కల్లో చిక్కావూ...పక్కకైన రాలేవూ
చెలియపై చెలిమితో...చెలిమిలోని చనువుతో
చల్లనైన వెన్నెలనూ...మెల్లగా కురిసావూ

నీలాలా..అహాహా..నీలాలా నింగిపై చందమామా నువు 
రేయంతా తిరిగావూ చందమామా
నువు రేయంతా తిరిగావూ చందమామా

విచిత్ర దాంపత్యం--1971
సంగీత::అశ్వద్థామ
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::P.సుశీ
తారాగణం::శోభన్ బాబు,గుమ్మడి,రాజబాబు,సావిత్రి,విజయనిర్మల,విజయలలిత,మీనాకుమారి 

పల్లవి::

నా మనసే..ఏ..వీణియగా..ఆఆ..పాడనీ
నా మనసే వేణియగా..పాడనీ
నీ వలపే వేణువుగా..మ్రోగనీ
ఈఈఈఈఈఈ 
నా మనసే వేణియగా..పాడనీ

చరణం::1

కాదని ఎంతగా..కరిసినా
కడ కన్నుల..కెంపులు కురిసినా..ఆ
కాదని ఎంతగా...కరిసినా
కడ కన్నుల...కెంపులు కురిసినా  
ఏనాటికైన...నీ రాధను రా
ఒకనాటికి తీరని...గాధనురా
నీ...రాధనురా
నా మనసే వీణియగా..పాడనీ
నీ వలపే వేణువుగా మ్రోగనీ
ఈఈఈఈఈఈ  
నా మనసే వేణియగా..పాడనీ

చరణం::2

వెదురు పొదలలో..దాగినా
నీవే వనిల్లో..తిరుగాడినా
వెదురు పొదలలో..దాగినా
నీవే వనిల్లో..తిరుగాడినా
నీ పదములు..నాలో మెదలునురా
నా హృదయము నిన్నే వెదకునురా
ఆ ఆ ఆ ఆ ఆ ఆ..
నా మనసే వీణియగా పాడనీ
నీ వలపే వేణువుగా మ్రోగనీ
ఈఈఈఈఈఈ 
నా మనసే వేణియగా పాడనీ

చరణం::3

సిరులు కోరి నిన్ను..కొలిచితినా
మరులు పొంగి నిన్ను..వలచితినా
ఆ ఆ ఆ ఆ ఆ..
సిరులు కోరి నిన్ను..కొలిచితినా
మరులు పొంగి నిన్ను..వలచితినా
ఎన్నో జన్మల...అనుభందం
ఇరువురినీ...కలిపిన బంధం
నా మనసే వీణియగా..పాడనీ
నీ వలపే వేణువుగా..మ్రోగనీ
ఈఈఈఈఈఈ 
నా మనసే వేణియగా పాడనీ

Thursday, November 25, 2010

మోసగాళ్లకు మోసగాడు--1971
సంగీతం::P.ఆదినారాయణరావు
రచన::ఆరుద్ర
గానం::P.సుశీల,S.P.బాలు
తారాగణం::కృష్ణ,నాగభూషణం,సత్యనారాయణ,ప్రభాకర రెడ్డి,విజయనిర్మల,జ్యోతిలక్ష్మి,త్యాగరాజుక్ష్మి

పల్లవి::

కోరినది నెరవేరినది.. ఒహో..కలలు నిజమాయే 
కోరినది దరిచేరినది..ఆహా..ఎదలు ఒకటాయే
కోరినది నెరవేరినది..ఒహో..కలలు నిజమాయే 
కోరినది దరిచేరినది..ఆహా..ఎదలు ఒకటాయే
తొలివలపే మధురసము..మనబతుకే పరవశము 
కోరినది నెరవేరినది..ఒహో..కలలు నిజమాయే
కోరినది దరిచేరినది..ఆహా..ఎదలు ఒకటాయే

చరణం::1
       
పూలతోటలై నా అందాలు పూచేనులే 
తనివితీరగా మకరందాలు గ్రోలేనులే
పూలతోటలై నా అందాలు పూచేనులే 
తనివితీరగా మకరందాలు గ్రోలేనులే
దోచుకున్న వలపు దాచుకున్ననాడే 
సుఖం సుఖం సుఖం తోడుగా నీడగా సాగిపో
కోరినది నెరవేరినది ఒహో కలలు నిజమాయే 
కోరినది దరిచేరినది ఆహా ఎదలు ఒకటాయే

చరణం::2

రాగబంధమై పెనవేసుకున్నానులే 
మూగకోరిక నే తెలుసుకున్నానులే
రాగబంధమై పెనవేసుకున్నానులే 
మూగకోరిక నే తెలుసుకున్నానులే
ఊసులాడు వేళ బాసచేయు వేళ 
ఇదే ఇదే ఇదే ఆడుకో ఆశలే తీర్చుకో
కోరినది నెరవేరినది ఒహో కలలు నిజమాయే 
కోరినది దరిచేరినది..ఆహా..ఎదలు ఒకటాయే
తొలివలపే మధురసము..మన బతుకే పరవశము 
ఆహా..హా..హా..ఓహో..హో..హో..  

Wednesday, November 24, 2010

లక్ష్మీ కటాక్షం--1970సంగీతం::S.P.కోదండపాణి
రచన::సినారె
గానం::ఘంటసాల,P.సుశీల

అహా..హ.అహా..హ..
అహా..హ..ఓహో..ఓ..ఓ..
అహా..హా..హా..

రా..వెన్నెల దొరా..కన్నియను చేరా
రా..కన్ను చెదరా..వేచితిని..రా..రా..ఆ..ఆ..ఆ..

రా..వెన్నెల దొరా..కన్నియను చేరా
రా..కన్ను చెదరా..వేచితిని..రా..రా..ఆ..ఆ..ఆ..

చరణం::1

ఈ పాల వెన్నెలలోన..నీ నీలికన్నులలోనా..
ఈ పాల వెన్నెలలోన..నీ నీలికన్నులలోనా..
ఉన్నానులేవే..ప్రియతమా..ఆ..ఆ

నీ మగసిరి నగవులు..చానులునే..
నీ సొగసరి నటనలు చాలునులే..
నీ మనసైన తారను నే కానులే..

రా..వెన్నెల దొరా..కన్నియను చేరా
రా..కన్ను చెదరా..వేచితిని..రా..రా..ఆ..ఆ..ఆ..

చరణం::2

ఈ మబ్బు తెరచాటేలా..ఈ నింగి పయణాలేలా..
ఈ మబ్బు తెరచాటేలా..ఈ నింగి పయణాలేలా..
ఎద నిండిపోరా చందమా..ఆ.ఆ..

ఈ పఘడపు పెదవుల..జిగి..నేనే..
నీ చెదరిని కౌగిలి..బిగి నేనే..
నా ఎద నిండ నీవే నిలిచేవులే..

రా..వెన్నెల దొరా..కన్నియను చేరా
రా..కన్ను చెదరా..వేచితిని..రా..రా..ఆ..ఆ..ఆ..

రా..వెన్నెల దొరా..వింత కనవేరా..
రా..చిలకవౌరా..అలిగినదిలేరా..ఆ..ఆ..ఆ..

లక్ష్మీ కటాక్షం--1970

సంగీతం::S.P.కోదండపాణి 
రచన::సినారె
గానం::ఘంటసాల,P.సుశీల 

అమ్మమ్మమ్మమ్మొ తెలిసిందిలే..గుట్టు తెలిసిందిలే
నీ రూపులోన..నీ చూపులోన 
ఏ రాచకళలో మెరిసేననీ   

అమ్మమ్మమ్మమ్మొ తెలిసిందిలే..గుట్టు తెలిసిందిలే
ఏ కొంటే మరుడో..గందర్వ వరుడో నా కళ్ళలోన నవ్వేననీ

అమ్మమ్మమ్మమ్మొ తెలిసిందిలే..గుట్టు తెలిసిందిలే

చరణం::1

కులికే వయసే పులకించిపోగా
పోంగు ఆగుతుందా..ఎదలో కదిలే పొంగు ఆగుతుందా

కులికే వయసే పులకించిపోగా
పోంగు ఆగుతుందా..ఎదలో కదిలే పొంగు ఆగుతుందా

పువ్వల్లే మారిపోయి..ముద్దుల్లే తేలిపోయి
పువ్వల్లే మారిపోయి..ముద్దుల్లే తేలిపోయి
కవ్విస్తే కన్నె మనసు ఆగుతుందా

అమ్మమ్మమ్మమ్మొ తెలిసిందిలే..గుట్టు తెలిసిందిలే
నీ రూపులోన..నీ చూపులోన 
ఏ రాచకళలో మెరిసేననీ

చరణం::2

వలచే జాబిలి ఇలపైన రాగా
కలువ దాగుతుందా..విరిసే మురిసే  తలుపు దాగుతుందా

వలచే జాబిలి ఇలపైన రాగా
కలువ దాగుతుందా..విరిసే మురిసే  తలుపు దాగుతుందా

తీగల్లే అల్లుకొంటే..ఆహా..
గుండెల్లో జల్లూమంటే..ఓహో..
తీగల్లే అల్లుకొంటే..ఆహా..
గుండెల్లో జల్లూమంటే..ఓహో..
దాచిన దోరవలపు దాగుతుందా 

అమ్మమ్మమ్మమ్మొ తెలిసిందిలే..గుట్టు తెలిసిందిలే
ఏ కొంటే మరుడో..గందర్వ వరుడో నా కళ్ళలోన నవ్వేననీ

Sunday, November 21, 2010

మాయదారి మల్లిగాడు--1973
సంగీత::K.V.మహదేవన్
రచన::ఆత్రేయ
గానం::P.సుశీల
Film Directed By::Addoori SubbaRao
తారాగణం::కృష్ణ,మంజుల,నాగభూషణం,పద్మనాభం,అంజలిదేవి,జయంతి,ప్రసన్నరాణి    

పల్లవి::

అహా..హా హా హా హా ఆహా..తుర్
తుర్రుపిట్ట..త్రురుపిట్ట తోటచూస్తావా
నా తోడు...వుంటావా 
తుర్రుపిట్ట..త్రురుపిట్ట తోటచూస్తావా
నా తోడు...వుంటావా 
దోరపండు...రంగుచూసి 
కాటు వేస్తావా..నా ఏటు చూస్తావూ  
దోరపండు రంగుచూసి కాటు వేస్తావా  
నా ఏటు చూస్తావూ..తుర్..ర్ ర్ ర్ ర్ 
తుర్రుపిట్ట..త్రురుపిట్ట తోటచూస్తావా
నా తోడు..వుంటావా

చరణం::1

ఎన్నుకొచ్చి పంటచేను..ఏపుగున్నాదీ  
వయసువచ్చీ కన్నెపిల్ల..ఒంటిగున్నాది 
ఎన్నుకొచ్చి పంటచేను..ఏపుగున్నాదీ  
వయసువచ్చీ కన్నెపిల్ల..ఒంటిగున్నాది 
కన్నెకైనా సేనుకైనా..కంచె వుండాలీ
ఓ కాపు వుండాలీ..తుర్..ర్ ర్ ర్ ర్
తుర్రుపిట్ట..త్రురుపిట్ట తోటచూస్తావా
నా తోడు...వుంటావా 

చరణం::2

ముంజెలాటి మనసున్నాది 
ఆ మనసుతోటి నంజుకోను సొగసున్నాదీ..ఆ..ఆ
ముంజెలాటి మనసున్నాది 
ఆ మనసుతోటి నంజుకోను సొగసున్నాదీ
సొగసుమాత్రం జుర్రుకోను వీలుకాదు  
దాన్ని పొగరన్న ముసుగేసి దాచినాను తుర్..ర్ ర్ ర్ ర్
తుర్రుపిట్ట..త్రురుపిట్ట తోటచూస్తావా నా తోడు వుంటావా

చరణం::3

కొమ్మకున్న పళ్ళగుత్తి..కులుకుతున్నాదీ 
గడుసుపిల్లా చేతిలోన..వడిసేలున్నాదీ
కొమ్మకున్న పళ్ళగుత్తి..కులుకుతున్నాదీ 
గడుసుపిల్లా చేతిలోన..వడిసేలున్నాదీ
దమ్ములుంటే కొమ్మవంచి..అందుకోవాలీ  
నీ అంతు తేలాలీ..తుర్..ర్ ర్ ర్ ర్
తుర్రుపిట్ట..త్రురుపిట్ట తోటచూస్తావా
నా తోడు...వుంటావా
దోరపండు రంగుచూసి కాటు వేస్తావా  
నా ఏటు...చూస్తావూ
ఆహా..ఆఆఆ..ఆహా..ఆఆఆ..ఆహా 

Mayadari Malligadu--1973
Music::K.V.Mahadevan
Lyricist::Kosaraju
Singer's:P.Suseela
Film Directed By::Addoori SubbaRao
Cast::Krishna,Manjula,Jayanti,Nagabhushanam,Padmanaabham,Anjalidevi,Prasannaraani.

::::::::::::::::::::::::::::::

ahaa..haa haa haa haa aahaa..tur
turrupiTTa..trurupiTTa tOTachoostaavaa
naa tODu...vunTaavaa 
turrupiTTa..trurupiTTa tOTachoostaavaa
naa tODu...vunTaavaa 
dOrapanDu...ranguchoosi 
kaaTu vEstaavaa..naa ETu choostaavoo  
dOrapaNDu raNguchoosi kaaTu vEstaavaa  
naa ETu choostaavoo..tur..r r r r 
turrupiTTa..trurupiTTa tOTachoostaavaa
naa tODu..vunTaavaa

::::1

ennukochchi panTachEnu..Epugunnaadii  
vayasuvachchii kannepilla..onTigunnaadi 
ennukochchi panTachEnu..Epugunnaadii  
vayasuvachchii kannepilla..onTigunnaadi 
kannekainaa sEnukainaa..kanche vunDaalii
O kaapu vunDaalii..tur..r r r r
turrupiTTa..trurupiTTa tOTachoostaavaa
naa tODu...vunTaavaa 

::::2

munjelaanTi manasunnaadi 
aa manasutOTi nanjukOnu sogasunnaadii..aa..aa
munjelaanTi manasunnaadi 
aa manasutOTi nanjukOnu sogasunnaadii
sogasumaatram jurrukOnu veelukaadu  
daanni pogaranna musugEsi daachinaanu tur..r r r r
turrupiTTa..trurupiTTa tOTachoostaavaa naa tODu vunTaavaa

::::3

kommakunna paLLagutti..kulukutunnaadii 
gaDusupillaa chEtilOna..vaDisElunnaadii
kommakunna paLLagutti..kulukutunnaadii 
gaDusupillaa chEtilOna..vaDisElunnaadii
dammulunTE kommavanchi..andukOvaalii  
nee antu tElaalee..tur..r r r r
turrupiTTa..trurupiTTa tOTachoostaavaa
naa tODu...vunTaavaa
dOrapanDu ranguchoosi kaaTu vEstaavaa  
naa ETu...choostaavoo

aahaa..aaaaaa..aahaa..aaaaaa..aahaa 

బంగారు మనసులు--1973


సంగీత::సత్యం
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::P.సుశీల
తారాగణం::చంద్రమోహన్,జమున,సత్యనారాయణ,రాజసులోచన, ఛాయాదేవి,అల్లు రామలింగయ్య

పల్లవి::

నవ్వుతు...నువ్వుండాలి 
మీ నాన్న..మది నిండాలి 
నినుగన్నతల్లి..ఆశలే పండగా  

నవ్వుతు...నువ్వుండాలి 
మీ నాన్న..మది నిండాలి 
నినుగన్నతల్లి..ఆశలే పండగా 
నినుగన్నతల్లి..ఆశలే పండగా                     

చరణం::1

నెలవంక దీపం..నింగికే వెలుగు
కనుపాప దీపం..కంటికే వెలుగు
నెలవంక దీపం..నింగికే వెలుగు
కనుపాప దీపం..కంటికే వెలుగు
ఆకలిలోనైనా...చీకటిలోనైనా
పాపాయి చిరునవ్వు..ప్రతియింటి వెలుగు 
నవ్వుతు...నువ్వుండాలి 
మీ నాన్న..మది నిండాలి 
నినుగన్నతల్లి..ఆశలే పండగా  
నినుగన్నతల్లి..ఆశలే పండగా

చరణం::2

మనసైన దేదీ..మమకారమొకటే
కొనలేని దేదీ..కారుణ్యమొకటే
మనసైన దేదీ..మమకారమొకటే
కొనలేని దేదీ..కారుణ్యమొకటే
ఎవ్వరు ఏమన్నా..ఏ విధి ఎదురైనా
మనిషికి మిగిలేది..అనుబంధమొకటే  
నవ్వుతు...నువ్వుండాలి 
మీ నాన్న..మది నిండాలి 
నినుగన్నతల్లి..ఆశలే పండగా  
నినుగన్నతల్లి..ఆశలే పండగా 

బంగారు మనసులు--1973

సంగీత::సత్యం
రచన::రాజశ్రీ
గానం::S,P,బాలు,S.జానకి 
తారాగణం::చంద్రమోహన్,జమున,సత్యనారాయణ,రాజసులోచన, ఛాయాదేవి,అల్లు రామలింగయ్య

పల్లవి::

నను మొదటిసారి నువు చూడగానే..ఏమనుకున్నావూ 
నను మొదటిసారి నువు చూడగానే..ఏమనుకున్నావూ..ఊ  
ఇంత గడుసువాడివని..నేఅనుకోలేదునే..అనుకోలేదు 

నను మెదటిసారి నువు చూడగానే..ఏమనుకున్నావూ 
నను మెదటిసారి నువు చూడగానే..ఏమనుకున్నావూ..ఊ
ఇంత చిలిపిదానివని..నే అనుకోలేదు..నే అనుకోలేదు..హా                

చరణం::1

నీ బుగ్గలపై నా పెదవులు చేరి..ముగ్గులేయనీ 
నీ గుండెలపై నా గుండెలు వాలి..ఊసులాడనీ..ఈ 
అ ఊసులలో నా కన్నెమనను..పులకరించనీ పులకరించనీ   
అ పులకరింతలో..పూలజల్లు చిలకరించని..ఈ 
అ పులకరింతలో..పూలజల్లు చిలకరించని..ఈ
నీ వలవులోన తేలి సోలి..పరవశించనీ పరవశించనీ

నను మెదటిసారి నువు చూడగానే..ఏమనుకున్నావూ
అబ్భా..ఇంత చిలిపిదానివని..నే అనుకోలేదునే అనుకోలేదు..హా

చరణం::2

చిగురాకులలో చిన్నారి చిలక..కొసరి పలికెనే..ఏ
ఆ పలుకులువిని చిరుగాలి ఏదో..సైగ చేసేనే
ఆ సైగలలో సన్నాయిమ్రోగి..నన్ను పిలిచెనే..ఏ..నన్ను పిలిచెనే
ఆ పిలుపులోన శుభతోరణాలు..వెల్లివిరిసెనే 
ఆ పిలుపులోన శుభతోరణాలు..వెల్లివిరిసెనే..ఏఏఏ
మనసు మనసు చేరి ఒకటై..బ్రతుకు పండెనే..నా..బ్రతుకుపండెనే

నను మొదటిసారి నువు చూడగానే..ఏమనుకున్నావూ..ఆ 
ఇంత గడుసువాడివని..నే అనుకోలేదునే..అనుకోలేదు  
     

బంగారు మనసులు--1973

సంగీత::సత్యం
రచన::రాజశ్రీ
గానం::P.సుశీల
తారాగణం::చంద్రమోహన్,జమున,సత్యనారాయణ,రాజసులోచన, ఛాయాదేవి,అల్లు రామలింగయ్య

పల్లవి::

ఆడించేదీ...పాడించేదీ
అంతా నీవేనురా..దేవా
చిత్రము...నీ లీలరా   
ఆడించేదీ...పాడించేదీ
అంతా నీవేనురా..దేవా
చిత్రము...నీ లీలరా       

చరణం::1

నా మాట నీవు..మన్నించావూ
మనసార నన్ను..కరుణించావూ
కుమిలే మనసును..ఓదార్చావూ దేవా 
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ 
కుమిలే మనసును..ఓదార్చావూ
మళ్ళీ మనిషిగ...చేశావూ  
      
ఆడించేదీ...పాడించేదీ
అంతా నీవేనురా..దేవా
చిత్రము నీ లీలరా..ఆఆఆఆ            

చరణం::::2

చీకటి వెనుక..వెలుగును దాచి
వేదన వెనుక..వేడుక దాచి
చీకటి వెనుక..వెలుగును దాచి
వేదన వెనుక..వేడుక దాచి
బ్రతుకు బాటలే..మార్చేవు 
బ్రతుకు బాటలే..మార్చేవు  
బంగారు మనసులు..కాపాడేవూ  
ఆడించేదీ...పాడించేదీ
అంతా నీవేనురా..దేవా
చిత్రము...నీ లీలరా        

చరణం::3

పరుల సుఖాలు...కోరేవారు
మంచీ మమత...పెంచేవారు
నీ రూపాలై...వెలిశారు
దివినే భువికి...అందించారు
ఆడించేదీ...పాడించేదీ
అంతా నీవేనురా..దేవా
చిత్రము నీ లీలరా..దేవా
చిత్రము...నీ లీలరా

Saturday, November 20, 2010

కొడుకు కోడలు--1972

సంగీతం::K.V.మహాదేవన్
రచన::ఆత్రేయ
గానం::P.సుశీల,S.జానకి,L.R.ఈశ్వరీ

:::: 

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ

నీవు నేనూ..ఏకమైనామూ
నీవు నేనూ..ఏకమైనామూ
ఇద్దరము మనమిద్దరము..ఒక లోకమైనామూ
ఈ లోకమంతా ఏకమైనా..వేరుకాలేమూ..
వేరుకాబోమూ..వేరుకాబోమూ..వేరుకాబోమూ

వేరు కాలేరా..నా పేరు విన్నారా?
ఎవరు నువ్వూ..?
ఎవరు నువ్వూ..?
మనుషులు చేసే సంఘం నేనూ..
మతాన్ని నేనూ..కులాన్ని నేనూ..తరాన్ని నేనూ

అనార్కలీని ఆహుతి కొన్నామూ 
మజునూ ప్రేమను బలిచేసామూ
అనార్కలీని ఆహుతి కొన్నామూ 
మజునూ ప్రేమను బలిచేసామూ
అహా అహా అహా అహా..

ప్రియా..ప్రియా..
ఈ నీడలునూ..పీడలనూ జయించి వస్తాను
నీకోసం మరలి వస్తాను..నీకోసం బ్రతికి ఉంటాను
ప్రాణం నిలిపికొంటానూ..

వెడలిపోయే వసంతమా..వెదకీ ప్రియునికి చెప్పుమా
ఎండకాలం ముందు ఉన్నది..మండిపోతూ మనసు ఉన్నదీ 
వెడలిపోయే వసంతమా..వెదకీ ప్రియునికి చెప్పుమా

నల్ల నల్లని మబ్బులారా..ఆ ఆ ఆ ఆ ఆ
నా కళ్ళకు తోబుట్టులారా..గుండె పగిలీ కురిసినారా
గుండె పగిలీ కురిసినారా..ఘోల్లునా ఆ కన్నీటిధారా
ఘోల్లునా కన్నీటిధారా

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఆకులు రాలినవీ..ఆశలు కూలినవీ
అలసిపోని కన్నులు మాత్రం..అతని రాకకై వేచినవీ
అతని రాకకై వేచినవీ..

మనసిచ్చిన నేనే నిన్ను
మరచి విడిచి పోతున్నాను
ప్రేమకన్నా త్యాగం మిన్నా
అది మిగిలిపోని నా జీవితాన 
నన్ను రగిలిపోనీ..రగిలిపోనీ
నీ ప్రేమలోనా..


Koduku Kodalu--1972
MusicK.V.mahaadEvan
Lyrics::Atreya
Singer's::P.Suseela,S.Jaanaki,L.R.ISwarii

:::: 

aa aa aa aa aa aa aa aa

neevu nEnU..Ekamainaamuu
neevu nEnU..Ekamainaamuu
iddaramu manamiddaramu..oka lOkamainaamuu
ii lOkamantaa Ekamainaa..vErukaalEmU..
vErukaabOmU..vErukaabOmU..vErukaabOmU

vEru kaalEraa..naa pEru vinnaaraa?
evaru nuvvuu..?
evaru nuvvuu..?
manushulu chEsE sangham nEnU..
mataanni nEnU..kulaanni nEnU..taraanni nEnU

anaarkaliini Ahuti konnaamuu 
majunuu prEmanu balichEsaamuu
anaarkaliini Ahuti konnaamuu 
majunuu prEmanu balichEsaamuu
ahaa ahaa ahaa ahaa..

priyaa..priyaa..
ii neeDalunuu..peeDalanuu jayinchi vastaanu
neekOsam marali vastaanu..neekOsam bratiki unTaanu
praaNam nilipikonTaanuu..

veDalipOyE vasantamaa..vedakii priyuniki cheppumaa
enDakaalam mundu unnadi..manDipOtU manasu unnadii 
veDalipOyE vasantamaa..vedakii priyuniki cheppumaa

nalla nallani mabbulaaraa..aa aa aa aa aa
naa kaLLaku tObuTTulaaraa..gunDe pagilii kurisinaaraa
gunDe pagilii kurisinaaraa..ghOllunaa aa kanniiTidhaaraa
ghOllunaa kanniiTidhaaraa

aa aa aa aa aa aa aa aa
aa aa aa aa aa aa aa aa
Akulu raalinavii..ASalu koolinavii
alasipOni kannulu maatram..atani raakakai vEchinavii
atani raakakai vEchinavii..

manasichchina nEnE ninnu
marachi viDichi pOtunnaanu
prEmakannaa tyaagam minnaa
adi migilipOni naa jeevitaana 
nannu ragilipOnii..ragilipOnii
nee prEmalOnaa..

Friday, November 19, 2010

కొడుకు కోడలు--1972

సంగీతం::K.V.మహాదేవన్
రచన::ఆత్రేయ
గానం::ఘంటసాల,P.సుశీల

పల్లవి::

నీకేం తెలుసూ?
నిమ్మకాయ పులుసూ..
నీకేం తెలుసూ?..నిమ్మకాయ పులుసూ
నేనంటే నీకెందుకింత అలసు

నీకేం తెలుసూ?..నిమ్మకాయ పులుసూ.. 
నా వద్ద సాగదు నీ దురుసూ..నీకేం తెలుసూ  

చరణం::1

చేయాలి కోడలూ..మామగారి సేవలూ
అబ్బాయి మనసు మరమత్తులూ

చేయాలి కోడలూ..మామగారి సేవలూ
అబ్బాయి మనసు మరమత్తులూ
భలే భలే గమ్మత్తులూ

వద్దు నీసేవలూ..వద్దు మరమత్తులూ
చాలమ్మ చాలు నీ అల్లరులూ

వద్దు నీసేవలూ..వద్దు మరమత్తులూ
చాలమ్మ చాలు నీ అల్లరులూ..చాలునీ అల్లరులూ

అల్లర్లు ఎన్నాళ్ళు వేసేయ్ మూడుముళ్ళు..ఆహా
అల్లర్లు ఎన్నాళ్ళు వేసేయ్ మూడుముళ్ళు
ఆపైన ఆడాళ్ళు బుద్ధిమంతులు..ఎంతో బుధిమంతులు  

నీకేం తెలుసూ?
నీకేం తెలుసూ..నిమ్మకాయ పులుసూ 
నావద్ద సాగదు..నీ దురుసూ
హా..నీకేం తెలుసూ

చరణం::2

మగువకు సిగ్గే సింగారము..మమతున్న మనసే బంగారము
మగువకు సిగ్గే సింగారము..మమతున్న మనసే బంగారము 

ఆ బంగారమొకరికె ఇచ్చేడి..ఆ సంగతి తెలిసే అడిగేది..నేనడిగేది

నీకేం తెలుసూ?
నీకేం తెలుసూ..నిమ్మకాయ పులుసూ 
నావద్ద సాగదు..నీ దురుసూ
హా..నీకేం తెలుసూ

చరణం::3

వయసుంది సొగసుంది..వరసైనబావా
నచ్చింది తీసుకోలేవా..

వయసుంది సొగసుంది..వరసైనబావా
నచ్చింది తీసుకోలేవా..

వయసుంటే చాలునా..సొగసుంటే తీరునా..హ్హా
అవి చెట్టు..చేమకు లేవా..

చెట్టైన తీగను..చేపట్టి ఏలదా?
చెట్టైన తీగను..చేపట్టి ఏలదా?
ఆ పాటి మనసైన లేదా..నీకాపాటి మనసైన లేదా

నీకేం తెలుసూ..?
నీకేం తెలుసూ ఆడదాని మనసు 
నేనంటే నీకెందుకింత అలుసూ  
నీకేం తెలుసు..అసలైన మనసు
నావద్ద సాగదు..నీ దురుసూ

నీకేం తెలుసూ..?
నీకేం తెలుసూ..?
నీకేం తెలుసూ..? 
నీకూ..ఆ....

Koduku Kodalu--1972
Music::K.V.Mahaadevan
Lyrics::Atreya
Singer's::Ghantasala,P.Suseela

::::

neekEm telusoo?
nimmakaaya pulusoo..
neekEm telusoo?..nimmakaaya pulusoo
nEnanTE neekendukinta alasu

neekEm telusoo?..nimmakaaya pulusoo.. 
naa vadda saagadu nee durusuu..neekEm telusoo  

::::1

chEyaali kODaluu..maamagaari sEvaluu
abbaayi manasu maramattuluu

chEyaali kODaluu..maamagaari sEvaluu
abbaayi manasu maramattuluu
bhalE bhalE gammattuluu

vaddu neesEvaluu..vaddu maramattuluu
chaalamma chaalu nee allaruluu

vaddu neesEvaluu..vaddu maramattuluu
chaalamma chaalu nee allaruluu..chaalunee allaruluu

allarlu ennaaLLu vEsEy mooDumuLLu..aahaa
allarlu ennaaLLu vEsEy mooDumuLLu
aapaina ADaaLLu buddhimantulu..entO budhimantulu  

neekEm telusoo?
neekEm telusoo..nimmakaaya pulusoo 
naavadda saagadu..nee durusuu
haa..neekEm telusoo

::::2

maguvaku siggE singaaramu..mamatunna manasE bangaaramu
maguvaku siggE singaaramu..mamatunna manasE bangaaramu 

aa bangaaramokarike ichchEDi..aa sangati telisE aDigEdi..nEnaDigEdi

neekEm telusoo?
neekEm telusoo..nimmakaaya pulusoo 
naavadda saagadu..nee durusuu
haa..neekEm telusoo

::::3

vayasundi sogasundi..varasainabaavaa
nachchindi teesukOlEvaa..

vayasundi sogasundi..varasainabaavaa
nachchindi teesukOlEvaa..

vayasunTE chaalunaa..sogasunTE teerunaa..hhaa
avi cheTTu..chEmaku lEvaa..

cheTTaina teeganu..chEpaTTi Eladaa?
cheTTaina teeganu..chEpaTTi Eladaa?
aa paaTi manasaina lEdaa..neekaapaaTi manasaina lEdaa

neekEm telusoo..?
neekEm telusoo ADadaani manasu 
nEnanTE neekendukinta alusoo  
neekEm telusu..asalaina manasu
naavadda saagadu..nee durusoo

neekEm telusoo..?
neekEm telusoo..?
neekEm telusoo..? 

neekoo..aa....

Thursday, November 18, 2010

చీకటి వెలుగులు--1975
సంగీతం::చక్రవర్తి
రచన::సినారె
గానం::S.P.బాలు,P.సుశీల
తారాగణం::కృష్ణ,వాణిశ్రీ,పద్మప్రియ,సత్యనారాయణ,అల్లు రామలింగయ్య,సూర్యకాంతం.

పల్లవి::

ఊరు పేరు లేని వాణ్ణి ..ప్రేమించానమ్మా..తక్ధీం 
ఓనమాలు దగ్గరుండి..నేర్పించాలమ్మా..తకధీం

ఊరు పేరు లేని వాణ్ణి ..ప్రేమించానమ్మా..తక్ధీం 
ఓనమాలు దగ్గరుండి..నేర్పించాలమ్మా..తకధీం 

ఓనా మహః ఓనా మహః..
శివాయహః అబ్భా..శివాయహః

నేర్చుకో కళ్ళతో..దాచుకో గుండెలో
చూడనీ కళ్ళలో..చేరనీ గుండెలో

ఊరు పేరు లేని వాణ్ణి ..ప్రేమించానమ్మా
ఓనమాలు దగ్గరుండి..నేర్పించాలమ్మా

చరణం::1

మంచు కప్పిన..కొండపైన
మనసు తెలిసిన..మనిషితోటి కలిసి ఉంటే..
ఏ ఏ ఏ...

ఉన్నదేమిటి...?
ఊ..చలీ..
ఆ..లేనిదేమిటి...?
ఊ..గిలీ....

ఉండి కూడ..లేనిదేమిటి..?
ఉండి కూడ..లేనిదేమిటి..?
ఆ..ఆ..కౌగిలీ...

ఊరు పేరు లేని వాణ్ణి ..ప్రేమించానమ్మా
ఓనమాలు దగ్గరుండి..నేర్పించాలమ్మా

చరణం::2

ఉరకలెత్తే పడుచుపిల్లను..ఒడుపు తెలిసి
చేయి వేసి..పట్టుకుంటే..ఏ..ఏ..ఏ..ఏ..ఏ..ఏ

ఉన్నదేమిటి..?
ఏయ్..పొగరు

హ..హ..హ..లేనిదేమిటి..?
ఆ..బెదురు

ఉండి కూడా..లేనిదేమిటి..?
ఉండి కూడా..లేనిదేమిటి..?
ఆ..ఆ..ఆ..కుదురూ..

ఊరు పేరు లేని వాణ్ణి ..ప్రేమించానమ్మా
ఓనమాలు దగ్గరుండి..నేర్పించాలమ్మా

చరణం::3

బెదురులేని కుర్రదప్పుడు
చిగురుపెదవుల..అదురుపాటును
ఆపమంటే..ఏ..ఏ..ఏ..ఏ..ఏ

ఆగమన్నది..?
హద్దు..
ఆగనన్నదీ..?
ఊ..ఊ..పొద్దు..

ఆగమన్నా..ఆగనన్నదీ
ఆగమన్నా..ఆగనన్నదీ
ఆ..ఆ..హా..ముద్దూ..ఊ..ఊ..ఊ..

ఊరు పేరు లేని వాణ్ణి..ప్రేమించానమ్మా..తక్ధీం..
ఓనమాలు దగ్గరుండి..నేర్పించాలమ్మా..తకధీం..

నేర్చుకో కళ్ళతో..దాచుకో గుండెలో..
చూడనీ కళ్ళలో..చేరనీ గుండెలో.. 

ఇల్లు-ఇల్లాలు--1972


సంగీత::K.V.మహదేవన్
రచన::కొసరాజు రాఘవయ్య
గానం::S.P.బాలు,P.సుశీల
తారాగణం::కృష్ణ, కృష్ణంరాజు,రాజబాబు,రమాప్రభ,వాణిశ్రీ,సూర్యకాంతం

పల్లవి::

పల్లెటూరు మన..భాగ్యసీమరా 
పాడి పంటలకు..లోటు లేదురా
పల్లెటూరు మన..భాగ్యసీమరా 
పాడి పంటలకు..లోటు లేదురా
మంచితనం..మమకారం 
మనిషి మనిషిలో..కనబడురా                    
పల్లెటూరు మన..భాగ్యసీమరా 
పాడి పంటలకు..లోటు లేదురా
మంచితనం..మమకారం 
మనిషి మనిషిలో..కనబడురా            
పల్లెటూరు మన..భాగ్యసీమరా 
పాడి పంటలకు..లోటు లేదురా

చరణం::1

కొత్తకొత్త వ్యవసాయ పద్దతులు 
కొల్లగ ప్రవేశ పెడదాము
కొల్లగ ప్రవేశపెడదాము
బీటినేలలను పాటుకుతెచ్చి 
సుక్షేత్రాలను చేద్దాము
సుక్షేత్రాలను చేద్దాము
కొత్తకొత్త వ్యవసాయ పద్దతులు 
కొల్లగ ప్రవేశపెడదాము 
బీటినేలలను పాటుకుతెచ్చి 
సుక్షేత్రాలను చేద్దాము 
చదివినామనే బింకం వదిలి 
ఆడామగ చేదోడుగ కదిలి 
బంగారము పండిద్దాము
ఓహోహోయ్ ఓహోహోయ్ 
ఓహోహోయ్ప పదిమందిని పోషిద్దాము
ఓహోహోయ్ ఓహోహోయ్ ఓహోహోయ్   
పల్లెటూరు మన భాగ్యసీమరా 
పాడి పంటలకు లోటు లేదురా

చరణం::2

జీవనదులు కృష్ణా గోదావరి తుంగభద్రలే వున్నవి
జీవనదులు కృష్ణా గోదావరి తుంగభద్రలే వున్నవి
పంటనిచ్చు హంసా మసూరి వరివంగడాలు వస్తున్నవి
పంటనిచ్చు హంసా మసూరి వరివంగడాలు వస్తున్నవి
జీవనదులు కృష్ణా గోదావరి తుంగభద్రలే వున్నవి
పంటనిచ్చు హంసా మసూరి వరివంగడాలు వస్తున్నవి
కరువుని దూరం చేద్దాము జాతికి ప్రాణం పోద్దాము
ఆంధ్రదేశమే అన్నపూర్ణయను పేరుకీర్తులను నిలబెడదాము
ఆంధ్రదేశమే అన్నపూర్ణయను పేరుకీర్తులను నిలబెడదాము     
పల్లెటూరు మన భాగ్యసీమరా పాడి పంటలకు లోటు లేదురా
   
చరణం::3

సోమరితనముగ తిరిగేవాళ్లే 
సంఘానికి విద్రోహులురా 
సంఘానికి విద్రోహులురా
ఐకమత్యముగ యువకులందరూ 
ఒళ్లువంచి పనిచెయ్యాలిరా 
ఒళ్లువంచి పనిచెయ్యాలిరా
సోమరితనముగ తిరిగేవాళ్లే 
సంఘానికి విద్రోహులురా 
ఐకమత్యముగ యువకులందరూ 
ఒళ్లువంచి పనిచెయ్యాలిరా
ఉద్యోగంలో వ్యాపారంలో 
తృప్తియన్నదే వుండదురా
స్వతంత్రమగు మన రైతు వృత్తిలో 
గౌరవమున్నదిరా ఎంతో గౌరవమున్నదిరా                    
పల్లెటూరు మన భాగ్యసీమరా 
పాడి పంటలకు లోటు లేదురా
మంచితనం మమకారం 
మనిషి మనిషిలో కనబడురా            
పల్లెటూరు మన భాగ్యసీమరా 
పాడి పంటలకు లోటు లేదురా
మంచితనం మమకారం 
మనిషి మనిషిలో కనబడురా            
పల్లెటూరు మన భాగ్యసీమరా 
పాడి పంటలకు లోటు లేదురా

చీకటివెలుగులు--1975


సంగీతం::చక్రవర్తి
రచన::సినారె
గానం::P.సుశీల

పల్లవి::

మీటి చూడు నీ హృదయాన్నీ..పలుకుతుంది ఒక రాగం
మీటి చూడు నీ హృదయాన్నీ..పలుకుతుంది ఒక రాగం
తరచి చూడు నీ గతాన్నీ మెదులుతుంది ఒక రూపం
రూపం ఎవ్వరిదో.. రాగం ఎక్కడిదో
తెలుసుకొంటే చాలును..నీ కలత తీరి పోవును

చరణం::1

పూడిపోయిన గొంతులా..ఓడిపోయిన గుండెలా
పూడిపోయిన గొంతులా..ఓడిపోయిన గుండెలా
నీలో..ఊపిరాడక ఉన్నదీ...
హృదయమే అర్పించుకొన్నదీ..హృదయమే అర్పించుకొన్నదీ

రూపం ఎవ్వరిదో.. రాగం ఎక్కడిదో
తెలుసుకొంటే చాలును..నీ కలత తీరి పోవును

చరణం::2

పూవులోని పిందెలా..పిందలోని తీపిలా
పూవులోని పిందెలా..పిందలోని తీపిలా
నీలో..లీనమైనది..కానరానిదీ
నీ పదము తానై మూగపోయినదీ..మూగపోయినదీ

రూపం ఎవ్వరిదో.. రాగం ఎక్కడిదో
తెలుసుకొంటే చాలును..నీ కలత తీరి పోవును

చరణం::3

మనసు మూలలు వెతికి చూడూ..మరుగు పొరలను తీసి చూడు
మనసు మూలలు వెతికి చూడూ..మరుగు పొరలను తీసి చూడు
ఏదో ..మబ్బుమూసి..మసక కమ్మి..
మమత మాయక ఉన్నది..నీ మమత మాయక ఉన్నదీ

 
మీటి చూడు నీ హృదయాన్నీ..పలుకుతుంది ఒక రాగం
మీటి చూడు నీ హృదయాన్నీ..పలుకుతుంది ఒక రాగం
తరచి చూడు నీ గతాన్నీ మెదులుతుంది ఒక రూపం
రూపం ఎవ్వరిదో.. రాగం ఎక్కడిదో
తెలుసుకొంటే చాలును..నీ కలత తీరి పోవును