Tuesday, December 09, 2008

వాడేవీడు--1973



















సంగీతం::సత్యం
రచన::దేవులపల్లికృష్ణశాస్రీ
గానం::P.సుశీ
తారాగణం::N.T.R.,మంజుళ,నాగభూషణం,పద్మనాభం,కృష్ణంరాజు,పండరీబాయ్,లీలారాణి.

పల్లవి::

ఎదుటనుంచి కదలను..పదములింక వదలను 
ఎదుటనుంచి కదలను..పదములింక వదలను
కళ్ళకు నా చిన్నతండ్రి..కనిపించే తీరాలి
ఎదుటనుంచి కదలను..పదములింక వదలను

చరణం ::1

కల్లగాదు నా కల..కలకానెకాదు నీ దయ 
అల్లదిగో వాని పిలుపు..అమ్మా అమ్మా అంటూ..ఊ 
అల్లదిగో వాని పిలుపు..అమ్మా అమ్మా అంటూ 
ఇల్లిదిగో కన్నకడుపు..రా తండ్రీ రా అంటూ 
ఎదుటనుంచి కదలను..పదములింక వదలను 
కళ్ళకు నా చిన్నతండ్రి..కనిపించే తీరాలి 
ఎదుటనుంచి కదలను..పదములింక వదలను

చరణం::2

ఎండా వానల తిరిగి..ఎంత బెదిరి పోయాడో 
తిండీ తిప్పలు లేక..ఎంత నలిగి పోయాడో
ఎండా వానల తిరిగి..ఎంత బెదిరి పోయాడో 
తిండీ తిప్పలు లేక..ఎంత నలిగి పోయాడో
అదుముకొని నా గుండెకు..పదిలంగా దాచుకొని..ఈ 
అదుముకొని నా గుండెకు..పదిలంగా దాచుకొని 
కదలనీను నా బిడ్డను..ఇహ నా చేతులనుండి
ఎదుటనుంచి కదలను..పదములింక వదలను 
కళ్ళకు నా చిన్నతండ్రి..కనిపించే తీరాలిబ్ 
ఎదుటనుంచి కదలను..పదములింక వదలను

చరణం::3

తల్లి మనసు...నీకు తెలియదా
తల్లుల తల్లివి..నా పాలి పాలవెల్లివి గాదా
తల్లి మనసు...నీకు తెలియదా 
తల్లుల తల్లివి..నా పాలి...పాలవెల్లివి గాదా
అదుగో అవునంటూ...ఆ చల్లని చూపు 
అదుగో నన్నాదుకునే..అభయహస్తము..మూఊఊఊఊ  
ఎదుటనుంచి కదలను..పదములింక వదలను 
కళ్ళకు నా చిన్నతండ్రి..కనిపించే తీరాలి 
ఎదుటనుంచి కదలను..పదములింక వదలను