Thursday, September 19, 2013

చెంచులక్ష్మి--1958




సంగీతం::S. రాజేశ్వరరావు
రచన::ఆరుద్ర
గానం::ఘంటసాల,జిక్కి

పల్లవి::

కానగరావా ఓ శ్రీహరి రావా
కానగరావా ఓ శ్రీహరి రావా
ప్రాణసఖా నను చేరగరావా
జాలిగొని బేలనని ఏలగరావా నన్నేలగరావా
కానగరావా ఓ శ్రీహరి రావా

చరణం::1

బాస చేసి మరిచావా ఓ చెంచితా
బాస చేసి మరిచావా ఓ చెంచితా
వేచి వేచి కనులేమో కాయలుకాచె
వేచి వేచి కనులేమో కాయలుకాచె
నీవులేక క్షణమైనా నిలువ జాలనే 
ఏ..ఏ..ఏ.ఏ..ఏ..ఏ.
నీవులేక క్షణమైనా నిలువ జాలనే
జాలమాయె తాళలేను ఏలగరావే..నన్నేలగరావే
కానగరావా ఓ చెంచిత రావా

చరణం::2

కంటినీరు చెరువాయే కథలే మారే
కంటినీరు చెరువాయే కథలే మారే
శాంతమొంది నరసింహా..చెంతకు రావా
శాంతమొంది నరసింహా..చెంతకు రావా
జీవితాన అంతులేని చీకటులాయె
జీవితాన అంతులేని చీకటులాయె
దేవదేవ ఈ వియోగ మెన్ని దినాలో..ఇంకెన్ని దినాలో

కానగరావా ఓ శ్రీహరి రావా
ప్రాణసఖా నను చేరగరావా
జాలిగొని బేలనని ఏలగరావా నన్నేలగరావా
కానగరావా ఓ శ్రీహరి రావా

మాయాబజార్--1957::దేశ్::రాగ



సంగీతం::ఘంటసాల
రచన::పింగళి నాగేంద్ర రావ్
గానం::M.L.వసంతకుమారి  బృందం 
తారాగణం::N.T. రామారావు,అక్కినేని, S.V. రంగారావు,రేలంగి, R. నాగేశ్వరరావు, 

C. S. R. ఆంజనేయులు,గుమ్మడి,సావిత్రి,ఛాయాదేవి,ఋష్యేంద్రమణి

దేశ్::రాగం
{దేశ దేశి} 
{కేదారగౌళ కర్ణాటకకు చేరువ}  

శ్రీకరులు..దేవతలు శ్రీరస్తులనగా
చిన్నారి..శశి రేఖ..వర్ధిల్లవమ్మా
వర్ధిల్లు..మా తల్లి..వర్ధిల్లవమ్మా
చిన్నారి..శశి రేఖ..వర్ధిల్లవమ్మా

సకల సౌభాగ్యవతి రేవతీ దేవి
తల్లియై దయలెల్ల వెల్లువిరియగనూ
సకల సౌభాగ్యవతి రేవతీ దేవి
తల్లియై దయలెల్ల వెల్లువిరియగనూ
అడుగకే వరములిడు బలరామ దేవులె
జనకులై కోరినా వరములీయగనూ
వర్ధిల్లు..మా తల్లి వర్ధిల్లవమ్మా
చిన్నారి..శశి రేఖ..వర్ధిల్లవమ్మా

శ్రీకళల విలసిల్లు రుక్మిణీ దేవి
పినతల్లియై నిన్ను గారాము శాయ
శ్రీకళల విలసిల్లు రుక్మిణీ దేవి
పినతల్లియై నిన్ను గారాము శాయ
అఖిల మహిమలు గలుగు కృష్ణ పరమాత్ములే 
పినతండ్రియై సకల రక్షణలు శాయ
వర్ధిల్లు..మా తల్లి వర్ధిల్లవమ్మా
చిన్నారి శశి రేఖ..వర్ధిల్లవమ్మా

ఘన వీర మాతయగు శ్రీ సుభద్రా దేవి
మేనత్తయై నిన్ను ముద్దు శాయగనూ
ఘన వీర మాతయగు శ్రీ సుభద్రా దేవి 
మేనత్తయై నిన్ను ముద్దు శాయగనూ
పాండవా యువరాజు బాలుడభిమన్యుడే 
బావయై నీ రతన లోకమని మురియా
వర్ధిల్లు..మా తల్లి..వర్ధిల్లవమ్మా
చిన్నారి శశి రేఖ..వర్ధిల్లవమ్మా
చిన్నారి శశి రేఖ వర్ధిల్లవమ్మా

చెంచులక్ష్మి--1958::మారుబిహాగ్::రాగం





సంగీతం::S రాజేశ్వరరావు 
రచన::ఆరుద్ర 
గానం::ఘంటసాల

మారుబిహాగ్::రాగం
(హిందుస్తాని కర్నాటక )

పల్లవి::

నీలగగనఘనశ్యామా..ఘనశ్యామా దేవ
నీలగగనఘనశ్యామా..నీలగగనఘనశ్యామా
దేవ నీలగగన...ఘనశ్యామా
హాని కలిగితే అవతారాలను
హాని కలిగితే అవతారాలను..పూని బ్రోచునది నీవే కావా

నీలగగనఘనశ్యామా..నీలగగనఘనశ్యామా
ఘనశ్యామా దేవ..నీలగగనఘనశ్యామా

చరణం::1

చదువులు హరించి అసురుండేగిన జలచరమైతివి ఆగమరూపా
చదువులు హరించి అసురుండేగిన జలచరమైతివి ఆగమరూపా
వేద నిధులనే విధాత కొసగిన ఆదిదేవుడవు నీవే కావా

నీలగగనఘనశ్యామా..నీలగగనఘనశ్యామా
ఘనశ్యామా దేవ..నీలగగనఘనశ్యామా

చరణం::2

కడలి మధించగ కదిలే నగమును వెడలి కూర్మమై వీపున మోసి
కడలి మధించగ కదిలే నగమును వెడలి కూర్మమై వీపున మోసి
అతివ రూపమున అమృతము గాచిన ఆదిదేవుడవు నీవే కావా

నీలగగనఘనశ్యామా..నీలగగనఘనశ్యామా
ఘనశ్యామా దేవ..నీలగగనఘనశ్యామా

చరణం::3

సుజనుల కోసము ఎపుడే వేషము ధరియించెదవో తెలియగనేరము
సుజనుల కోసము ఎపుడే వేషము ధరియించెదవో తెలియగనేరము
పెండ్లికొడుకువై వెడలి నాడవు ఎందుల కొరకో..హే! జగదీశా

నీలగగనఘనశ్యామా..నీలగగనఘనశ్యామా
ఘనశ్యామా దేవ..నీలగగనఘనశ్యామా

చెంచులక్ష్మి--1958::ద్విజావంతి::రాగ ( జై జై వంతి)






సంగీతం::S. రాజేశ్వరరావు
రచన::ఆరుద్ర
గానం::ఘంటసాల, జిక్కి

ద్విజావంతి::రాగ

( జై జై వంతి) 

పల్లవి::

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ 
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ 
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ 
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ 

ఆనందమాయే అలి నీలవేణి
ఆనందమాయే అలి నీలవేణి
అరుదెంచినావా అందాల దేవీ
ఆనందమాయే అలి నీలవేణి

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
అనువైన వేళా అనురాగ శోభా
అది ప్రేమపూజ నా భాగ్యమాయే
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
అలనాటి నోము కల నేడు పండే
అరుదైన హాయి నాలోన నిండే

ఆనందమాయే అసమాన తేజా
అపురూపమైనా అందాల దేవా
ఆనందమాయే అసమాన తేజా

చరణం::1

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఆ..సొగసైన రూపే సోలింత చూపే
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
సగమైన కనులా సంతోషమిటులే
నగుమోముపైన నడయాడు కళలే
అగుపించగానే మధులూరు నాలో

ఆనందమాయే అలి నీలవేణి
అరుదెంచినావా అందాల దేవీ
ఆనందమాయే అలి నీలవేణి

చరణం::2

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఎనలేని స్వామీ నిను చేరబోతే
నునులేత ప్రేమా నను సాగనీదే
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
తనువేమొ నీకై తపియించి నిలచే 
మనసేమొ నీలో మునుపే కలిసే

ఆనందమాయే అసమాన తేజా
అపురూపమైనా అందాల దేవా

ఆనందమాయే అలి నీలవేణి
అరుదెంచినావా అందాల దేవీ
ఆనందమాయే అలి నీలవేణి
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ