Saturday, October 01, 2011

ఆడపడచు--1967


సంగీతం::T.చలపతిరావ్
రచన::?
గానం::T.R.జయదేవ్,P.సుశీల


పల్లవి::

శోభన్::
గారడి చేసే కన్నులతో
నన్నారడి చేసే వెందుకనీ
ఎందుకనీ..ఎందుకనీ

వాణిశ్రీ::
చిలిపి చిలిపి నీ చేతలతో
నను కలవర పరచే వెందుకనీ
ఎందుకనీ..ఎందుకనీ..

చరణం::1

శోభన్::
రారమ్మని నే పిలవగనే..
రానని మారాం చేసేవు
ఎందుకనీ..ఎందుకనీ

వాణిశ్రీ::
గారాలొలికే చెక్కిలిపై..
నేరం చేయగ తలచేవు
ఎందుకనీ..ఎందుకనీ

శోభన్::
గారడి చేసే కన్నులతో
నన్నారడి చేసే వెందుకనీ
ఎందుకనీ..ఎందుకనీ

వాణిశ్రీ::
గారాలొలికే చెక్కిలిపై..
నేరం చేయగ తలచేవు
ఎందుకనీ..ఎందుకనీ

చరణం::2
శోభన్::
జడలో పూవులు తురుమగనే
తడబడి దూదుకుపోయేవు
ఎందుకనీ..ఎందుకనీ

వాణిశ్రీ::
పూవులు తురుమే సాకులతో
నా నవ్వును దోచగ తలచేవూ
ఎబ్దుకబీ..ఎందుకనీ

శోభన్::
గారడి చేసే కన్నులతో
నన్నారడి చేసే వెందుకనీ
ఎందుకనీ..ఎందుకనీ

వాణిశ్రీ::
గారాలొలికే చెక్కిలిపై..
నేరం చేయగ తలచేవు
ఎందుకనీ..ఎందుకనీ

చరణం::3

శోభన్::
నీ పాదాలే సోకిన చోట
నిగనిగ లాడేను ఈ చోటా
ఎందుకనీ..ఎందుకనీ

వాణిశ్రీ::
నను కాపాడే నీ నీడే
అందా లొలికేను నామీదా
ఎందుకనీ..ఎందుకనీ

శోభన్::
గారడి చేసే కన్నులతో
నన్నారడి చేసే వెందుకనీ
ఎందుకనీ..ఎందుకనీ