Tuesday, January 17, 2012

పగబట్టిన పడుచు--1971












సంగీతం::M.రంగారావ్ 
రచన::C.D.నారాయణరెడ్డి
గానం::P.సుశీల  
తారాగణం::హరనాధ్,గుమ్మడి,రాజనాల,శారద,విజయరాధిక,జ్యోతిలక్ష్మి,అంజలీదేవి, 

పల్లవి::

ఓహో..ఓహో..ఓహో..ఓహో..ఓహో..ఓహో
ఏవో మౌన..రాగాలు 
ఏవో మధుర..భావాలు 
నాలో కదలె..ఈ వేళ  
ఏవో మౌన..రాగాలు 
ఏవో మధుర..భావాలు 
నాలో కదలే..ఈ వేళ 

తుంటరి వయసేమన్నది
తూగాడు నడుమేమన్నది  
చెరలాడు పైటేమన్నది
విరహాలు ఇక చాలన్నది   
తుంటరి వయసేమన్నది
తూగాడు నడుమేమన్నది   
చెరలాడు పైటేమన్నది
విరహాలు ఇక చాలన్నది   
రారా..ఓ చిన్నవాడా
వలపే నీదేరా..నీదే లేరా    
ఏవో మౌన..రాగాలు 
ఏవో మధుర..భావాలు 
నాలో కదలే..ఈ వేళ 

చరణం::1

మాధవుడందని..రాధనై 
ఆరాధ తీయని..బాధనై 
ఆ బాధ మోయని..గాధనై 
ఎన్నాళ్ళు జాగ..తిరిగేను  
మాధవుడందని..రాధనై 
ఆరాధ తీయని..బాధనై 
ఆ బాధ మోయని..గాధనై 
ఎన్నాళ్ళు జాగ..తిరిగేను   
రారా..ఓ చెలికాడా నేనే 
ఆ రాధనురా..నీ రాధనురా 
ఏవో మౌన..రాగాలు 
ఏవో మధుర..భావాలు
నాలో కదలే..ఈ వేళ 

దేవదాసు--1974




















సంగీతం::రమేష్‌నాయుడు
రచన::ఆరుద్ర
గానం::S.P.బాలు
తారాగణం::కృష్ణ, విజయనిర్మల, గుమ్మడి,సత్యనారాయణ,అల్లు రామలింగయ్య 

పల్లవి::

ఇది నిశీధ సమయం అది తిరుగులేని పయనం ఊ
తిరిగి రాని పయనం తిరిగి రాని పయనం
ఇది నిశీధ సమయం..అది తిరుగులేని పయనం
తిరిగి రాని పయనం..ఇది నిశీధ సమయం

ఈ సమయం భ్రాంతి సుమా..ఆ పయనం మాయ సుమా
అంటున్న నేను.. వింటున్న నీవు
అంతా మాయసుమా..అంతా భ్రాంతి సుమా

చరణం::1

అయిదు సరుకుల మేళవింపుతో..తొమ్మిది తలుపుల భవనం
అందులోన నివాసం మాని హంస చేరురా గగనం
తానే లేని సదనంలో తలుపులు ఎందుకురా 
తిరిగి రానే రాని పయనంలో పిలుపులు ఎందుకురా
ఇది నిశీధ సమయం..అది తిరుగులేని పయనం
తిరిగి రాని పయనం..ఇది నిశీధ సమయం 

చరణం::2

మరలా పుట్టుక..మరలా చచ్చుట ఇరుసే లేని చక్రం
వచ్చేవారూ పొయేవారూ జగతి పురాతన సత్రం
రాకడకైనా పోకడకైనా కర్తవు కావుర నీవు
అన్ని అంచెలు దాటిన పిదప ఉన్నది కడపటి రేవు 

ఇది నిశీధ సమయం..అది తిరుగులేని పయనం
తిరిగి రాని పయనం..ఇది నిశీధ సమయం