Friday, May 02, 2014

నా పేరే భగవాన్--1976



















సంగీతం::చక్రవర్తి
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::S.జానకి
తారాగణం::రామకృష్ణ,మంజుల,ప్రభాకర్ రెడ్డి,జయమాలిని,గిరిజ,గిరిబాబు,అల్లురామలింగయ్య,సత్యనారాయణ.

పల్లవి::

నిను మధుశాల రమ్మన్నది..ఈ మధుశాల తోడున్నది
ఒక మనసైన మాటున్నది..నా మదిలోన చోటున్నది
నిను మధుశాల రమ్మన్నది..ఈ మధుశాల తోడున్నది
ఒక మనసైన మాటున్నది..నా మదిలోన చోటున్నది

చరణం::1

కళ్లల్లో అల్లరి ఒళ్ల౦తా ఆవిరి..కవ్వించి కదిలించెనా..రాజా
కళ్లల్లో అల్లరి ఒళ్ల౦తా ఆవిరి..కవ్వించి కదిలించెనా
నులివెచ్చని చలిచలి రాతిరి నీదేనా..చెలి యిచ్చిన తొలి తొలి కౌగిలి నీకేనా
నులివెచ్చని చలిచలి రాతిరి నీదేనా..చెలి యిచ్చిన తొలి తొలి కౌగిలి నీకేనా
రాజా..రాజా..రాజా..రాజా రాజా రాజా రాజా

చరణం::2

రాతిరి రాతిరి వస్తానంటిని..రానే రానైతివి
సెందురుడే సూరీడాయె..యెన్నెలంత యె౦డైపోయె
సెందురుడే సూరీడాయె..యెన్నెలంత యె౦డైపోయె
రేయి రాయిలా..కదలదాయె 
మావా..మావా..మావా..మావా మావా మావా మావా
నిను మధుశాల రమ్మన్నది..ఈ ప్రియబాల తోడున్నది
ఒక మనసైన మాటున్నది..నా మదిలోన చోటున్నది

చరణం::3

పరువాలే పో౦గుల కెరటాలై..రంగుల కిరాణాలై మెరెసెరా
రుచులోలికె పెదిమల..మధురిమ లందుకోరా
మరులోలికే వలపుల...ఘుమలందు 
రుచులోలికె పెదిమల..మధురిమ లందుకోరా
మరులోలికే వలపుల...ఘుమలందు 
రారా..రారా..రారా..రారా రారా రారా 
నిను మధుశాల రమ్మన్నది..ఈ జయమాల తోడున్నది
ఒక మనసైన మాటున్నది..నా మదిలోన చోటున్నది

ఇదెక్కడి న్యాయం--1977



సంగీతం::S.రాజేశ్వరరావు
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::P.సుశీల
తారాగణం::మురళిమోహన్,మోహన్‌బాబు,జయసుధ,ప్రభ,జయమాలిని,నరసింహరాజు,నిర్మలమ్మ 

పల్లవి::

రాతిరి రాతిరి వస్తావనీ..
రాతిరి రాతిరి వస్తావని..చందమావయ్యో
రాతిగంధం తీసివుంచా..చందమావయ్యో..చందమావయ్యో..ఓ 
చందమావయ్యో మావ..చందమావయ్యో
చందమావయ్యో మావ..చందమావయ్యో
రాతిరి రాతిరి వస్తావని..చందమావయ్యో

చరణం::1

రాతిరి నీవు రాకపోయి..రాతిరి నీవు రాకపోయి
రాతిగంధం..ఇంకిపోయే..
రగులుకొన్న నా వలపంతా..ఆ ఆ ఆ ఆ 
రగులుకొన్న నా వలపంతా..ఆ
దిగులుతోతే..చినబడిపోయే..ఏఏఏఏ

రాతిరి రాతిరి వస్తావని..చందమావయ్యో
చందమావయ్యో మావ..చందమావయ్యో
చందమావయ్యో మావ..చందమావయ్యో

చరణం::2

కట్టుకొన్న చీర నలిగే..కట్టుకొన్న చీర నలిగే
పెట్టుకొన్న బొట్టు చెదిరే..కంటికి దిద్దిన కాటుక కరిగే..ఏఏఏ
కంటికి దిద్దిన కాటుక కరిగే..తెలియ రాని గుబులు పెరిగే 

రాతిరి రాతిరి వస్తావని..చందమావయ్యో
చందమావయ్యో మావ..చందమావయ్యో..హోయ్ 
చందమావయ్యో మావ..చందమావయ్యో

చరణం::3

చూపులతోటే తెల్లవారే..చూపులతోటే తెల్లవారే
చుక్కలన్ని చల్లగ జారే..ఎదురుగా నిను చూస్తుంటే..ఏఏఏఏ
ఎదురుగా నిను చూస్తుంటే..ఎన్నెన్నో కోరికలూరే..ఏఏఏ

రాతిరి రాతిరి వస్తావని..చందమావయ్యో
రాతిగంధం తీసివుంచా..చందమావయ్యో..చందమావయ్యో..ఓ 
చందమావయ్యో మావ..చందమావయ్యో
చందమావయ్యో మావ..చందమావయ్యో

Idekkadi Nyayam--1977
Music::S.Rajeswara rao
Lyrics::D.C.Naraayanareddi
Singer::P.Suseela
Cast::Muralimohan,Mohanbabu,Jayasudha,Prabha,Jayamalini,Narasimharaaju,Nirmalamma


:::

raatiri raatiri vastaavanii..
raatiri raatiri vastaavani..chandamaavayyO
raatigandham teesivunchaa..chandamaavayyO..chandamaavayyO..O 
chandamaavayyO maava..chandamaavayyO
chandamaavayyO maava..chandamaavayyO
raatiri raatiri vastaavani..chandamaavayyO

::::1

raatiri neevu raakapOyi..raatiri neevu raakapOyi
raatigandham..inkipOyE..
ragulukonna naa valapantaa..aa aa aa aa 
ragulukonna naa valapantaa..aa
digulutOtE..chinabaDipOyE..EEEE

raatiri raatiri vastaavani..chandamaavayyO
chandamaavayyO maava..chandamaavayyO
chandamaavayyO maava..chandamaavayyO

::::2

kaTTukonna chiira naligE..kaTTukonna chiira naligE
peTTukonna boTTu chedirE..kanTiki diddina kaaTuka karigE..EEE
kanTiki diddina kaaTuka karigE..teliya raani gubulu perigE 

raatiri raatiri vastaavani..chandamaavayyO
chandamaavayyO maava..chandamaavayyO..hOy 
chandamaavayyO maava..chandamaavayyO

::::3

chUpulatOTE tellavaarE..chUpulatOTE tellavaarE
chukkalanni challaga jaarE..edurugaa ninu chUstunTE..EEEE
edurugaa ninu chUstunTE..ennennO kOrikaloorE..EEE

raatiri raatiri vastaavani..chandamaavayyO
raatigandham teesivunchaa..chandamaavayyO..chandamaavayyO..O 
chandamaavayyO maava..chandamaavayyO
chandamaavayyO maava..chandamaavayyO

మా దైవం--1976

















http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=18105 సంగీతం::K.V.మహదేవన్
రచన::ఆరుద్ర
గానం::P.సుశీల
తారాగణం::N.T.రామారావు,జయచిత్ర,నాగభూషణం,పద్మనాభం,ప్రభాకర రెడ్డి,పండరీబాయి
పల్లవి::

మనిషిలోని మనసు చూడు
ఆ మనసులోన వుంటుంది మంచి చూడు
మంచితనం ఎంచుతూ మమకారం పెంచుతూ 
అందరికి ఆనందం పంచి చూడు
తక తక తై తై తక తక తై 
తై తక తక తై తై..తై తై
చక చక పనిచెయ్‌ చక చక పనిచెయ్‌ 
చక చక పనిచెయ్‌..చెయ్‌ చెయ్‌
తక తక తై తై తక తక తై 
తై తక తక తై తై.. తై తై
చక చక పనిచెయ్‌ చక చక పనిచెయ్‌ 
చక చక పనిచెయ్‌..చెయ్‌ చెయ్‌

చరణం::1

ఎటువంటి మొరకైనా చదునౌను
ఆ చదునైన మాగాణి పదునౌను
ఎటువంటి మొరకైనా చదునౌను
ఆ చదునైన మాగాణి పదునౌను
ప్రతిచేను పండాలి పచ్చపచ్చగా
ప్రతిచేను పండాలి పచ్చపచ్చగా
ప్రతిగుండె మారాలి మెత్తమెత్తగా
మనిషిలోని మనసు చూడు
ఆ మనసులోన వుంటుంది మంచి చూడు
మంచితనం ఎంచుతూ మమకారం పెంచుతూ
అందరికి ఆనందం పంచి చూడు

చరణం::2

చోటీయకుంటే వంచనకు ఇక
పనిలేదులే ముళ్ళ కంచెలకు
చెప్పేస్తే పోతుంది చేసిన పాపం
తప్పులకు ఎంచకున్న ఎంతో పుణ్యం
మనిషిలోని మనసు చూడు
ఆ మనసులోన వుంటుంది మంచి చూడు
మంచితనం ఎంచుతూ మమకారం పెంచుతూ
అందరికి ఆనందం పంచి చూడు
తక తక తై తై తక తక తై 
తై తక తక తై తై..తై తై
చక చక పనిచెయ్‌ చక చక పనిచెయ్‌ 
చక చక పనిచెయ్‌..చెయ్‌ చెయ్‌
తక తక తై తై తక తక తై 
తై తక తక తై తై..తై తై తై
చక చక పనిచెయ్‌ చక చక పనిచెయ్‌ 
చక చక పనిచెయ్‌..చెయ్‌ చెయ్‌ చెయ్‌

మహాత్ముడు--1976



సంగీతం::T.చలపతిరావు
రచన::కోసరాజురాఘవయ్య 
గానం::రమేష్,G.ఆనంద్,విల్సన్,L.R. అంజలి
తారాగణం::అక్కినేని,శారద,ప్రభ,G.వరలక్ష్మి,జయమాలిని,సత్యనారాయణ,కాంతారావు,అల్లు రామలింగయ్య

పల్లవి::

మ్మ్..రంభ లాగున్నది..ఆహా..ఓహో
మేనకలాగున్నాది..ఓహో..ఓహో
రంభ లాగున్నది రమ్ము తీసుకొచ్చింది
మేనకలాగున్నాది మేక డోలు తెచ్చింది 
వేసుకో..నా సామిరంగా..చివరకీ ఏమౌతుందో చూసుకో..హోయ్
రంభ లాగున్నది..రమ్ము తీసుకొచ్చింది
మేనకలాగున్నాది..మేక డోలు తెచ్చింది
వేసుకో..నా సామిరంగా..చివరకీ ఏమౌతుందో చూసుకో

చరణం::1

విసిరావంటే ఓర చూపు..ఎక్కిపోతుంది..ఆ..ఎంతోకైపు
విసిరావంటే ఓర చూపు..ఎక్కిపోతుంది ఎంతోకైపు
ఓరచూపుకే ఉలిక్కిపడతావే..ఏఏఏ..నా వెచ్చని కౌగిలి 
ఎర్రని చెక్కిలి ఒంపులు సొంపులు..నిన్ను పిలిస్తే ఏమౌతావో   
ఆవు్..ఆవు్..ఆవు్..రంభ లాగున్నది రమ్ము తీసుకొచ్చింది      
మేనకలాగున్నాది మేక డోలు తెచ్చింది
వేసుకో..నా సామిరంగా చివరకీ ఏమౌతుందో చూసుకో

చరణం::2

ఎందరెందరో కన్నేసిన..అందగాడు ఉన్నాడు
స్వర్గానికి నిచ్చెనవేసి..మబ్బులో కూర్చున్నాడు
స్వర్గానికి నిచ్చెనవేసి..మబ్బులో కూర్చున్నాడు 
అందుకే నా పెదవుల..మధువూ అందిస్తానూ
ముందు ముందు..మోజులన్నీ తీరుస్తానూ   
ఆ..అందుకే నా పెదవుల..మధువూ అందిస్తానూ
ముందు ముందు మోజులన్నీ తీరుస్తానూ   
రంభ లాగున్నది..రమ్ము తీసుకొచ్చింది
మేనకలాగున్నాది..మేక డోలు తెచ్చింది
వేసుకో..నా సామిరంగా చివరకీ ఏమౌతుందో చూసుకో

చరణం::3

రేపటి మాటా మనకు వద్దు..ఇప్పటి సుఖమే..ఆ..ఎంతో ముద్దు
రేపటి మాటా మనకు వద్దు..ఇప్పటి సుఖమే ఎంతో ముద్దు
వట్టి ముద్దుకే మురిసిపోతావే..నే మల్లి పూవుల పందిరి కింద
పానుపు పరచి..రా రమ్మంటే ఏమౌతావో..అమ్మో..అమ్మో..అమ్మో      
రంభ లాగున్నది..రమ్ము తీసుకొచ్చింది
మేనకలాగున్నాది..మేక డోలు తెచ్చింది
వేసుకో..నా సామిరంగా చివరకీ ఏమౌతుందో చూసుకో
చివరకీ ఏమౌతుందో..చూసుకో
చివరకీ ఏమౌతుందో..చూసుకో

అర్ధరాత్రి--1969




సంగీతం::మాస్టర్ వేణు
రచన::ఆరుద్ర
గానం::P.సుశీల
Film Directed By::Saambasivarao
తారాగణం::జగ్గయ్య,భారతి,రమణారెడ్డి,రావికొండలరావు,రాధిక,కల్పన,నిర్మల,సాక్షిరంగారావు,K.V.చలం.

పల్లవి::

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఈ పిలుపు నీ కోసమే..నా మమత నీ కోసమే
వేయి జన్మాలనుండీ..వేయి కన్నూలు తెరచీ
వెతికేది బ్రతికేది..నీ కోసమే..ఏ

చరణం::1

నెలరాజును..తారక చేరునులే
విరజాజిని..వాసన వీడదులే
నెలరాజును..తారక చేరునులే
విరజాజిని..వాసన వీడదులే
నీ నీడవలే..మది ఆడునులే
ఈ తీయని కోరిక మారదులే..ఏఏఏఏఏఏ
ఓహో..హో..ఓఓఓ....ఓఓఓ.ఓహో..హో..ఓఓఓ....ఓఓఓ
ఈ పిలుపు నీ కోసమే..ఏ

చరణం::2

కనుపాపల..వెలిగే దీపమునై..ఈ
కల లోపల..వెలసే రూపమునై..ఈ
కనుపాపల..వెలిగే దీపమునై
కల లోపల..వెలసే రూపమునై
తొలి దీవనగా..చిరజీవనమై
నీ తూరుపు..గాలిగ వీచితిని..ఈఈఈఈఈ
ఓహో..హో..ఓఓఓ....ఓఓఓ.ఓహో..హో..ఓఓఓ....ఓఓఓ
ఈ పిలుపు నీ కోసమే..ఏ

చరణం::3

పాదాలను మెరిసే..పారాణి
నెమ్మోమున నిలచే..సింధురం
పాదాలను మెరిసే..పారాణి
నెమ్మోమున నిలచే..సింధురం
నీ కానుకలై..నెలకొన్నవిలే
నీ ఊపిరిలోనే..నా కాపురము..ఊఊఊఊఊఊ
ఓహోహో..ఓఓఓఓ..ఓఓఓ..ఓహోహో..ఓఓఓ.. ఓఓఓ

ఈ పిలుపు నీ కోసమే..నా మమత నీ కోసమే
వేయి జన్మాలనుండీ..వేయి కన్నూలు తెరచీ
వెతికేది బ్రతికేది..నీ కోసమే..ఏఏఏఏఏఏ



ArdhaRathri--1969
Music::Master Venu
Lyrics::Arudra
Singer::P.Suseela
Film Directed By::Saambasivarao
Cast::Jaggayya,Bharati,Ramanareddi,Raavikondalraavu,Radhika,Kalpana,Nirmala,SaakshiRangaRao,K.V.Chalam.

::::::::::::::::::

aa aa aa aa aa aa aa aa aa
ii pilupu nee kOsamE..naa mamata nee kOsamE
vEyi janmaalanunDii..vEyi kannuulu terachii
vetikEdi bratikEdi..nee kOsamE..E

::::1

nelaraajunu..taaraka chErunulE
virajaajini..vaasana veeDadulE
nelaraajunu..taaraka chErunulE
virajaajini..vaasana veeDadulE
nee neeDavalE..madi ADunulE
ii teeyani kOrika maaradulE..EEEEEE
OhO..hO..OOO..ahahaa..aaaaaaaaa 
ii pilupu nee kOsamE..E

::::2

kanupaapala..veligE deepamunai..ii
kala lOpala..veligE roopamunai..ii
kanupaapala..veligE deepamunai
kala lOpala..veligE roopamunai
toli deevanagaa..chirajeevanamai
nee toorupu..gaaliga veechitini..iiiiiiiiii
OhO..hO..OOO..OhO..hO..OOO..oo
ii pilupu nee kOsamE..E

::::3

paadaalanu merisE..paaraaNi
nemmOmuna nilachE..sindhuram
paadaalanu merisE..paaraaNi
nemmOmuna nilachE..sindhuram
nee kaanukalai..nelakonnavilE
nee UpirilOnE..naa kaapuramu..uuuuuuuuuuuu
OhOhO..OOOO..OOO..OhOhO..OOO..ahahaa..AAA

ii pilupu nee kOsamE..naa mamata nee kOsamE
vEyi janmaalanunDii..vEyi kannuulu terachii
vetikEdi bratikEdi..nee kOsamE..EEEEEE

ఏడంతస్తుల మేడ--1980
















http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=1851
సంగీతం::చక్రవర్తి
రచన::రాజశ్రీ
గానం::P.సుశీల,S.P.బాలు
 Film Directred By::Dasari Narayana Rao
తారాగణం::అక్కినేని,సుజాత,జగ్గయ్య,ప్రభాకర రెడ్డి,జయసుధ,జయప్రద

పల్లవి::

అహ..హా..హా
అహహహ..ఆ ఆ ఆ హా
ఇది మేఘ సందేశమో..అనురాగ సంకేతమో
ఆ..ఆ..ఇది మేఘ సందేశమో..అనురాగ సంకేతమో
చిరుజల్లు కురిసింది విను వీధిలో
చిరుజల్లు కురిసింది విను వీధిలో
హరివిల్లు విరిసింది తొలి ప్రేమలో
ఇది మేఘ సందేశమో..అనురాగ సంకేతమో

చరణం::1

అహ..హా..హా
అహహహ..ఆ ఆ ఆ హా
వెల్లువలా పొంగే నా పాల వయసు
పల్లవి పాడేను నా మూగ మనసు
వెల్లువలా పొంగే నా పాల వయసు..ఆ..ఆ..ఆ
పల్లవి పాడేను నా మూగ మనసు
నీ పాట నా బాట కావాలని
ఆ నింగి ఈ నేల కలవాలని
చినుకులు వేశాయి ఒక ఒంతెన
చినుకులు వేశాయి ఒక ఒంతెన
కలిసిన హృదయాలకది దీవెనా
ఇది మేఘ సందేశమో..అనురాగ సంకేతమో

చరణం::2

తడిసిన తనువేదో కోరింది స్నేహం
కలిగెను జడి వాన నాకు దాహం
తడిసిన తనువేదో కోరింది స్నేహం
ఆ..హా..కలిగెను జడి వాన నాకు దాహం
నీ చెంత మేను మరవాలనీ
నీ కంటిలో పాప కావాలనీ
వలపులు చేశాయి వాగ్ధానము..హా..ఆ..ఆ
వలపులు చేశాయి వాగ్ధానము
మనకివి సిరులింక కలకాలము
ఇది మేఘ సందేశమో..అనురాగ సంకేతమో
చిరుజల్లు కురిసింది విను వీధిలో
చిరుజల్లు కురిసింది విను వీధిలో
హరివిల్లు విరిసింది తొలి ప్రేమలో
ఇది మేఘ సందేశమో..అనురాగ సంకేతమో