సంగీత::సత్యం
రచన::రాజశ్రీ
గానం::P.సుశీల
తారాగణం::చంద్రమోహన్,జమున,సత్యనారాయణ,రాజసులోచన, ఛాయాదేవి,అల్లు రామలింగయ్య
పల్లవి::
ఆడించేదీ...పాడించేదీ
అంతా నీవేనురా..దేవా
చిత్రము...నీ లీలరా
ఆడించేదీ...పాడించేదీ
అంతా నీవేనురా..దేవా
చిత్రము...నీ లీలరా
చరణం::1
నా మాట నీవు..మన్నించావూ
మనసార నన్ను..కరుణించావూ
కుమిలే మనసును..ఓదార్చావూ దేవా
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
కుమిలే మనసును..ఓదార్చావూ
మళ్ళీ మనిషిగ...చేశావూ
ఆడించేదీ...పాడించేదీ
అంతా నీవేనురా..దేవా
చిత్రము నీ లీలరా..ఆఆఆఆ
చరణం::::2
చీకటి వెనుక..వెలుగును దాచి
వేదన వెనుక..వేడుక దాచి
చీకటి వెనుక..వెలుగును దాచి
వేదన వెనుక..వేడుక దాచి
బ్రతుకు బాటలే..మార్చేవు
బ్రతుకు బాటలే..మార్చేవు
బంగారు మనసులు..కాపాడేవూ
ఆడించేదీ...పాడించేదీ
అంతా నీవేనురా..దేవా
చిత్రము...నీ లీలరా
చరణం::3
పరుల సుఖాలు...కోరేవారు
మంచీ మమత...పెంచేవారు
నీ రూపాలై...వెలిశారు
దివినే భువికి...అందించారు
ఆడించేదీ...పాడించేదీ
అంతా నీవేనురా..దేవా
చిత్రము నీ లీలరా..దేవా
చిత్రము...నీ లీలరా
No comments:
Post a Comment