Friday, February 22, 2008

మనుషులు మారాలి--1969



గానం::SP. బాలు,P.సుశీల
రచన::C.నారాయణరెడ్డి
సంగీతం::KV.మహదేవన్


పాపాయి నవ్వాలి పండగే రావాలి మా ఇంట కురవాలి పన్నీరు
పాపాయి నవ్వాలి పండగే రావాలి మా ఇంట కురవాలి పన్నీరు
పాపాయి నవ్వినా పండగే వచ్చినా పేదల కన్నుల కన్నీరే..
పాపాయి నవ్వినా పండగే వచ్చినా పేదల కన్నుల కన్నీరే
నిరు పేదల కన్నుల కన్నీరే ...

!! పాపాయి నవ్వాలి పండగే రావాలి !!

కార్తీక మాసాన ఆకాశ మార్గాన కనువిందు చేసేను జాబిల్లి
కార్తీక మాసాన ఆకాశ మార్గాన కనువిందు చేసేను జాబిల్లి
ఆషాఢ మాసాన మేఘాల చెరలోన అల్లాడి పోయెను జాబిల్లి
ఆషాఢ మాసాన మేఘాల చెరలోన అల్లాడి పోయెను జాబిల్లి
అల్లాడి పోయెను జాబిల్లి
నిద్దురపో ...నిద్దురపో ముద్దుల పాపా నిద్దురపో
నిద్దురపో ...నిద్దురపో ముద్దుల పాపా నిద్దురపో

!! పాపాయి నవ్వాలి పండగే రావాలి !!

వైశాఖ మాసాన భూదేవి సిగలోన మరుమల్లెచెండౌను జాబిల్లి
శ్రావణ మాసాన జడివాన ఒడిలోన కన్నీటి కడవౌను జాబిల్లి
కన్నీటి కడవౌను జాబిల్లి
నిద్దురపో ...నిద్దురపో ముద్దుల పాపా నిద్దురపో
నిద్దురపో ...నిద్దురపో ముద్దుల పాపా నిద్దురపో

!! పాపాయి నవ్వాలి పండగే రావాలి !!

lotta champaldana

Thursday, February 14, 2008

అగ్ని పర్వతం--1985::శివరంజని::రాగం



సంగీతం::చక్రవర్తి
రచన::వేటూరి సుదరరామమూర్తి
గానం::S.P.బాలు,P.సుశీల

శివరంజని::రాగం 

ఈ గాలిలో...ఓ...ఓ...ఓ...
ఓ...ఓ...ఓ...ఓ...ఓ...
ఈ గాలిలో...ఓ..ఓ..ఓ..ఓ..
ఎక్కడో అలికిడి...హా...
అక్కడే అలజడి..మ్మ..హా..
మత్తుగా తడబడి
మెత్తగా జతబడి
పెట్టెను కౌగిలి ఒకవంకా
పెట్టెను చెక్కిలి నెలవంక
ఏమౌతదో ఏమిటో...ఓ...

ఈ గాలిలో...ఓ...ఓ...ఓ...
ఓ...ఓ...ఓ...ఓ...ఓ...
ఈ గాలిలో...ఓ..ఓ..ఓ..ఓ..
ఎక్కడో అలికిడి
అక్కడే అలజడి
మత్తుగా తడబడి
మెత్తగా జతబడి
చెక్కిలిగుంటలు ఒకవంకా
చక్కిలిగింతలు ఒక వంక
ఈ కాస్తకే ఎందుకో.....

ఈ గాలిలో..ఓ..ఓ..ఓ..ఓ..

నవ్విన వేళ మధుమాసంలా
విరబూసే నా కోర్కేలే...
పువ్వూ నేను పుట్టిన నాడే
వాలాము నీ పక్కనే...
వేసవి వడిలో వెన్నెల తడిలా
తనువులు కలిపే పెదవుల వడిలో
ఈ ప్రేమ పందిళ్ళలో...ఓ..ఓ..

ఈ గాలిలో...ఓ...ఓ...ఓ
ఈ గాలిలో...ఓ...ఓ...ఓ
ఎక్కడో అలికిడి..ఆ..హా..
అక్కడే అలజడి..ఆ..హా..
మత్తుగా తడబడి మెత్తగా జతబడి
పెట్టెను కౌగిలి ఒక వంకా..హా..
పెట్టెను చెక్కిలి నెలవంకా
ఈ కాస్తకే..ఎందుకో..ఓ...ఓ..

ఈ గాలిలో..ఓ...ఓ...ఓ..ఓ..
లలలల లలలల
లలలల లలలల
లల లలలా లలల..

తాకిన చోటా తాంబూలంలా
ఎరుపెక్కె నీ చెక్కిలీ
పొద్దూ ముద్దూ పుట్టే చోట
ఎరుపెక్కవా ఆ దిక్కులే..
ఎదజల్లు పెరిగీ
ఎదవగు జరిగీ
కథ ఇక మొదలై
కౌగిట బిగిసే
ఈ సందె సయ్యాటలో..ఓ..ఓ..

ఈ గాలిలో..ఓ..ఓ..ఓ
..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ
ఈ గాలిలో..ఓ..ఓ..ఓ..ఓ
ఎక్కడో అలికిడి..హా..హా..
అక్కడే అలజడి..హా..హా..
మత్తుగా తడబడి
మెత్తగా జతబడి
పెట్టెను కౌగిలి ఒకవంక
పెట్టెను చెక్కిలి నెలవంక
ఈ కాస్తకే ఎందుకో..ఓ...ఓ..ఓ..
మ్మీ..మ్మీ..మ్మీ..మ్మీ..
మ్మీ..మ్మీ..మ్మీ..మ్మీ..
మ్మీ..మ్మీ..మ్మీ..మ్మీ..

Monday, February 11, 2008

జీవన తరంగాలు--1973






















సంగీతం::J.V.రాఘవులురచన::ఆత్రేయ
గానం::ఘంటసాల,P.సుశీల

ఈ అందానికి బంధం వేశానొకనాడు
ఆ బంధమె నాకందమైనది ఈ నాడు
ఈ అందానికి బంధం వేశానొకనాడు
ఆ బంధమె నాకందమైనది ఈ నాడు

నీ కళ్ళు ఆనాడు ఎరుపెక్కెను
నేడు ఆ ఎరుపె నీ బుగ్గపై పాకెను
ఊహూ...
నీ కళ్ళు ఆనాడు ఎరుపెక్కెను
నేడు ఆ ఎరుపె నీ బుగ్గపై పాకెను
నీ చేతులానాడు చెరలాయెను
నేడు ఆ చెరలె కౌగిలై పెనవేసెను

ఈ అందానికి బంధం వేసానొకనాడు
ఆ బంధమె నాకందమైనది ఈ నాడు !!

నీ వేడి లోనే నా చలువ ఉందని
వాన ఎండను చేరింది
నీ చలువే నా వేడికి విలువని
ఎండే వానను మెచ్చింది
నీ వేడి లోనే నా చలువ ఉందని
వాన ఎండను చేరింది
నీ చలువే నా వేడికి విలువని
ఎండే వానను మెచ్చింది
ఇద్దరు కలిసిన ఆ ఒద్దికలో
ఇంధ్ర ధనస్సే విరిసింది
ఏడు రంగుల ముగ్గును వేసి
నింగీ నేలను కలిపింది
ప్రేమకు పెళ్ళే చేసింది

ఈ అందానికి బంధం వేసానొకనాడు
ఆ బంధమె నాకందమైనది ఈ నాడు
ఆహాహా ఆహాహా!
!!

జీవన తరంగాలు--1973




సంగీతం::J.V.రాఘవులు
రచన::C.నారాయణ రెడ్డి
గానం::L.R.ఈశ్వరీ


నందామయా గురుడ నందామయా
ఉందామయా తెలుసుకొందామయా

మెరిసే సంఘం మేడిపండు
దాని పొట్టవిప్పి చూస్తే పురుగులుండు
మెరిసే సంఘం మేడిపండు
దాని పొట్టవిప్పి చూస్తే పురుగులుండు
ఆ కుళ్ళు లేని చోటూ ఇక్కడే 2
అనుభవించు రాజా ఇప్పుడే
ఆనందసారం ఇంతేనయా2

నందామయా..గురుడ నందామయా
ఉందామయా..తెలుసుకొందామయా !!

పుట్టీనప్పుడు బట్టకట్టలేదు
పోయే టప్పుడు అది వెంటరాదు
పుట్టీనప్పుడు బట్టకట్టలేదు
పోయే టప్పుడు అది వెంటరాదు
నడుమ బట్టకడితే నగుబాటు
నాగరీకం ముదిరితే పొరబాటు
వేదాంతసారం ఇంతేనయా 2

నందామయా..గురుడ నందామయా
ఉందామయా..తెలుసుకొందామయా !!

Tuesday, February 05, 2008

మనసు-మాంగల్యం--1971




















సంగీతం::పెండ్యలనాగేశ్వరరావు 
రచన::ఆత్రేయ
గానం::ఘంటసాల,P.సుశీల 
తారాగణం::అక్కినేని,జమున,జగ్గయ్య,అంజలీదేవి,పద్మనాభం,రమణారెడ్డి,చంద్రమోహన్,రామకృష్ణ,గీతాంజలి.

పల్లవి::

సన్నని వెన్నెల..జలతారువలె కన్నుల 
కమ్మెను కన్నీటి తెర..ఆ తెరలో ఈ రాతిరిలో
నిన్ను నేను చూస్తున్నా..నిన్ను నేను చూస్తున్నా
నీలో నన్ను...నేను చూస్తున్నా 
ఇద్దరిలో జగతిలోన..ప్రేమ కొరకు వేగిపోవు  
వేల వేల...హృదయాలే చూస్తున్నా   
నిన్నునేను చూస్తున్నా..నీలో నన్ను నేను చూస్తున్నా

చరణం::1

కదలీ కదలక కదలే నీ కదలికలో..ఓ..ఓ..ఓ..ఓ 
కదలీ కదలక కదలే..నీ కదలికలో
చిరుగాలికి ఊగాడే వరిమడినే చూస్తున్నా..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
ఆ వరిమడిలో ఆ వరవడిలో..వంగి వంగి కలుపుతీయు
కాపుకన్నె...వంపులన్ని చూస్తున్నా..ఆ 
నిన్నునేను చూస్తున్నా..నీలో నన్ను నేను చూస్తున్నా

చరణం::2

విరిసీ విరియని విరివంటి పరువంలో..ఓ..ఓ..ఓ..ఓ 
కెరటాల గోదారి వురకలనే..కంటున్నా..ఆ..ఆ..ఆ..ఆ..ఆ  
ఆ వురకలలో ఆ నురుగులలో..ఆ వురకలలో నురుగులలో
గడవేస్తూ పడవనడుపు..పల్లెపడుచు పకపకలే వింటున్నా..హా హా హా 

చరణం::3

చిదుమని చెక్కిలి చిందే సిగ్గుల్లో..ఓ..ఓ..ఓ..ఓ 
సందెవేళ అలముకునే ఎర్రజీర చూస్తున్నా..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
ఆ ఎర్రదనంలో...ఆ కుర్రతనంలో 
ఆ ఎర్రదనంలో ఆ కుర్రతనంలో..వెనక జన్మలెన్నెన్నో
పెనవేసిన...వెచ్చదనం కంటున్నా     
నిన్నునేను చూస్తున్నా..నీలో నన్ను నేను చూస్తున్నా
నీలో నన్ను నేను చూస్తున్నా