సంగీతం::K.V.మహాదేవన్
రచన::ఆత్రేయ
గానం::V.రామకృష్ణ,P.సుశీల
తారాగణం::శోభన్‌బాబు,వాణిశ్రీ,S.V.రంగారావు,చంద్రకళ,నాగభూషణం,అంజలీదేవి,పద్మనాభం
పల్లవి::
ఆ..హా..ఆ..ఆ.ఆ.ఆహా..ఆ
ఆ..హా..ఆ..ఆ.ఆ.ఆహా..ఆ
కొత్తగా పెళ్ళైన..కుర్రవాడికి..ఈ
పట్టపగలె తొందర..ఆ..పండగుంది ముందర
కొత్తగా పెళ్ళైన..కుర్రదానికి..ఈ
పట్టరాని తొందర..ఆ..పట్టుకుంటె బిత్తర..ఆహా
చరణం::1
కొంగుచాటులో వయసు..పొంగులన్ని దాచావు
కోలకళ్ళ జాడలో..గుట్టు కాస్త చెప్పావు
కొంగుచాటులో వయసు..పొంగులన్ని దాచావు
కోలకళ్ళ జాడలో..గుట్టు కాస్త చెప్పావు
కోరి వలచి వచ్చాను..నీ కోసమెన్నొ తెచ్చాను
కోరి వలచి వచ్చాను..నీ కోసమెన్నొ తెచ్చాను
గుట్టు చప్పుడు లేక..నీ సొంతమే చేసుకో
కొత్తగా పెళ్ళైన కుర్రవాడికి..పట్టపగలె తొందర..ఆ
పట్టుకుంటె బిత్తర..ఆ..హా..హా
చరణం::2
నింగి వంగివచ్చిందీ..నిన్ను చూచేటందుకు
నేల పచ్చిక పరచింది..ఈ..నీవు నడిచేటందుకు
నింగి వంగివచ్చిందీ..నిన్ను చూచేటందుకు
నేల పచ్చిక పరచింది..ఈ..నీవు నడిచేటందుకు
మంచు జల్లు కురిసింది..చలి పుట్టేటందుకు
మబ్బు చాటు చేసింది..గిలి తీరేటందుకు
మబ్బు చాటు చేసింది..గిలి తీరేటందుకు
కొత్తగా పెళ్ళైన కుర్రదానికి..పట్టరాని తొందర..ఆ
పండగుంది..ముందరా..ఆ..హా..ఆ
చరణం::3
అల్లరి కళ్ళకు నల్లని కాటుక..హద్దులే గీచావు ఎందుకూ
కళ్ళకు కాటుకే చల్లదనం..హద్దులో ఆడదుంటె చక్కదనం
చీర కట్టులో ఎన్ని గమ్మత్తులు..చిగురాకు పెదవుల్లో ఎన్ని మత్తులు
బిగి కౌగిలింతలో కొత్తకొత్తలు..ప్రేమ బాటంతా పూలగుత్తులు
కొత్తగా పెళ్ళైన కుర్రదానికి..పట్టరాని తొందర..ఆ..
పట్టుకుంటె బిత్తర..ఆ..హా
కొత్తగా పెళ్ళైన కుర్రవాడికి..పట్టపగలె తొందర..ఆ
పండగుంది ముందర..ఆ..హా..ఆ
సంగీతం::K.V.మహాదేవన్
రచన::ఆత్రేయ
గానం::P.సుశీల ,V.రామకృష్ణ
తారాగణం::శోభన్‌బాబు,లక్ష్మి,S.V.రంగారావు,నాగభూషణం,సత్యనారాయణ,జయకుమారి,రమణారెడ్డి
పల్లవి::
ఓర్నాయాల..చూశానురా..ఈ వేళా
ఓర్నాయాల..చూశానురా..ఈ వేళా
పిల్లంటె పిల్లకాదు..వర్ణించ వల్లకాదు
పిల్లంటె పిల్లకాదు..వర్ణించ వల్లకాదు
అడగొద్దురో..ఓ..దానందచందాలూ
ఓర్నాయాల..చూశావా..ఈ వేళా
ఓర్నాయాల..చూశావా..ఈ వేళా
ఏమేమిచూశావు..చూసి ఏమిచేశావు
ఏమేమిచూశావు..చూసి ఏమిచేశావు
చెప్పొద్దురో..ఓ..దానందచందాలు
ఓర్నాయాల..చూశానురా..ఈ వేళా
చరణం::1
చూశానొక పొగరబోతు..గొడ్డునూ
అది చూపులతో..కుమ్మిందీ కోడెనూ
చూశానొక పొగరబోతు..గొడ్డునూ
అది చూపులతో..కుమ్మిందీ కోడెనూ
అయ్యయ్యో..గుండెల్లో దూసుకొనిపోయిందా..ఆ
అది ఉండుండి మంటెడుతు వుందా..గోవిందా
గుండెల్లో..దూసుకొనిపోయిందా
అది ఉండుండి..మంటెడుతు వుందా
ఛ..ఛ..దూసుకొనీ పోనీక వాటేసుకున్నాను
దూసుకొనీ పోనీక వాటేసుకున్నాను
ముద్దొకటీ యిచ్చానూ..ముక్కు తాడు వేశానూ
ముద్దొకటీ యిచ్చానూ..ముక్కు తాడు వేశానూ
కొయ్..కొయ్..కోతలు కొయ్
ఓర్నాయాల..చూశానురా..ఈ వేళా
ఏమేమిచూశావు..చూసి ఏమిచేశావు
ఏమేమిచూశావు..చూసి ఏమిచేశావు
అడగొద్దురో..ఓ..దానందచందాలు
ఓర్నాయాల..చూశానురా..ఈ వేళా
చరణం::2
నడిరేయిలోన..నడిరేయిలోన
సుడిగాలిలా గదిలోకి..గబగబ వచ్చింది
నన్ను సుట్టేసి..సుడి తిరిగిపోయింది
నడిరేయిలోన..సుడిగాలిలా
గదిలోకి..గబగబ వచ్చింది
నన్ను సుట్టేసి..సుడి తిరిగిపోయింది
ఆయ్యయ్యో ఓపలేని..ఆ తాపం ఒళ్ళంతా రగిలిందా
దాని కోపంతో..నీ గూబ పగిలిందా
ఓపలేని..ఆ తాపం ఒళ్ళంతా రగిలిందా
దాని కోపంతో..నీ గూబ పగిలిందా
ఛ..ఛ..తెల్లార్లు నాతోటె గడిపిందీ
తెల్లవార్లు..నాతోటె గడిపిందీ
ఇక వెళ్ళలేనంటూ..ఊ..నా వెంటపడిందీ
పడుతుంది..పడుతుంది
ఓర్నాయాల..చూశానురా ఈ వేళా
ఏమేమిచూశావు..చూసి ఏమిచేశావు
ఏమేమిచూశావు..చూసి ఏమిచేశావు
అడగొద్దురో..ఓ..దానందచందాలు
ఓర్నాయాల..చూశానురా ఈ వేళా
ఓర్నాయాల..చూశావా ఈ వేళా
ఓర్నాయాల..చూశానురా ఈ వేళా