Saturday, July 20, 2013

ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య--1982



సంగీతం::J.V.రాఘవులు
రచన::D.C..నారాయణ రెడ్డి
గానం::S.P.బాలు
తారాగణం::చిరంజీవి,మాధవి,గొల్లపూడి మారుతిరావు,పూర్ణిమ,అన్నపూర్ణ,P.L.నారాయణ.

పల్లవి::

మాటంటే బాణం..ఏ మగువన్నా ప్రాణం
ఆ ఇద్దరు దేవుళ్ళు కలసి..ఎత్తిన అవతారం..ఊ
మనం..మ్మ్ 
ఇంట్లో రామయ్య..వీధిలో కృష్ణయ్యా
ఇంట్లో రామయ్య..వీధిలో కృష్ణయ్యా
డండర డండర డాండాండ
డండర డండర డాండాండ
డండర డండర డాండాండ 
డండర డండర డాండాండ

చరణం::1

భార్య అడిగితే..ఏది లేదనను
బంగారు లేడి తెమ్మన్నా కాదననూ
హా..ఆ..ఆ..హా హా..ఆహ
ఆహ..ఆహ..హా..ఆ..ఆ
భార్య అడిగితే..ఏది లేదనను
బంగారు లేడి తెమ్మన్నా..కాదననూ
ఇల్లు దాటితే నేను..నేను కాను
హ..హా..ఇల్లు దాటితే నేను..నేను కాను
ఎన్ని పడకగదులు..ఏలుతానో చెప్పలేను
అసలే చెప్పలేను..అందుకే మనం
ఇంట్లో రామయ్య..వీధిలో కృష్ణయ్యా
ఇంట్లో రామయ్య..వీధిలో కృష్ణయ్యా

చరణం::2

ధర్మపత్ని ఎడబాటు తట్టుకోను..ఊ..ఊ
పది తలలెదురైనా..ఎగురగొట్టుతాను
ఆ..ఆ..ధర్మపత్ని ఎడబాటు తట్టుకోను
పది తలలెదురైనా..ఎగురగొట్టుతాను
మనసైతే మురళిని..చేపట్టుతాను
మనసైతే మురళిని..చేపట్టుతాను
వేల మంది గోపికలకు..గజ్జ కట్టుతాను
గజ్జ కట్టుతానూ..ఊ
హా..ఇంట్లో రామయ్య..వీధిలో కృష్ణయ్యా
ఇంట్లో రామయ్య..వీధిలో కృష్ణయ్యా

చరణం::3

ఒక్క భార్య వున్నవాడు..దేవుడే 
మరి అష్ట భార్యలున్నవాడు..దేవుడే
ఆ..ఆ హా హా..ఆ..ఆ 
ఆహ..ఆహ..ఆహ..హా..ఆ
ఒక్క భార్య వున్నవాడు..దేవుడే
మరి అష్ట భార్యలున్నవాడు..దేవుడే
ఆ ఇద్దరు దీవించిన చిరంజీవిని
ఆ ఇద్దరు దీవించిన చిరంజీవిని
విల్లు వేణువు పట్టిన సవ్యసాచిని
అపర సవ్యసాచిని..అందుకే మనం

ఇంట్లో రామయ్య..వీధిలో కృష్ణయ్యా
ఇంట్లో రామయ్య..వీధిలో కృష్ణయ్యా
మాటంటే బాణం..ఏ మగువన్నా ప్రాణం
ఆ ఇద్దరు దేవుళ్ళు కలసి..ఎత్తిన అవతారం
మనం..
ఇంట్లో రామయ్య..వీధిలో కృష్ణయ్యా
ఇంట్లో రామయ్య..వీధిలో కృష్ణయ్యా
డరడ డరడ డడడ..డడ్డర డడ్డర డడడ
డడ..డడ..డడ..డడ..డండరడాడ..డండరడడ

సూత్రధారులు--1989



సంగీతం::K.V.మహదేవన్
రచన::D.C.నారాయణ రెడ్డి
గానం::S.P.బాలు,S.P.శైలజ  
తారాగణం::A.N.R. , భానుచందర్ , రమ్యకృష్ణ 

పల్లవి::

యోపాం పుష్పం వేదా పుష్పవాం
ప్రజావాహన్ పశుమాన్ భవతి
చంద్రామావ అపాం పుష్పం పుష్పవాం
ప్రజావాహన్ పశుమాన్ భవతి
యయేవం వేదా..తనాననాన
యయేవం వేద..తనాననాన
యోపామాయతనం వేదా
తానాననననాననా
ఆయతనవాం భవతి
ఆ ఆ ఆ..ఆయతనవాం భవతి
ఆయతనవాం..భవతి
యయేవం వేదా యోపామాయతనం వేదా
ఆయతనవాం భవతి ఆయతనవాం భవతి

చరణం::1

అగ్నిర్వా అపామాయతనం ఆయతనవాం భవతి
యోయగ్నే రాయతనం వేదా ఆయతనవాం భవతి
ఆపోవారగ్నే ఆయతనవాం
ఆ ఆ ఆ..ఆయతనవాం భవతి ఆయతనవాం భవతి
యయేవం వేదా యోపామాయతనం వేదా
ఆయతనవాం భవతి ఆయతనవాం భవతి

చరణం::2

వాయుర్వా అపామాయతనం..ఆయతనవాం భవతి
యోరాయో రాయతనం వేదా..ఆయతనవాం భవతి
ఆపోవైవో రాయతనం
ఆ ఆ ఆ..ఆయతనవాం భవతి..ఆయతనవాం భవతి
యయేవం వేదా యోపామాయతనం వేదా
ఆయతనవాం భవతి..ఆయతనవాం భవతి.