Monday, April 23, 2012

ఇల్లు-ఇల్లాలు--1972






















ఈ పాట ఇక్కడ వినండి

సంగీత::K.V.మహదేవన్
రచన::అప్పలాచార్య
గానం::S.జానకి,రాజబాబు
తారాగణం::కృష్ణ, కృష్ణంరాజు,రాజబాబు,రమాప్రభ,వాణిశ్రీ,సూర్యకాంతం

పల్లవి::

వినరా సూరమ్మ కూతురు మొగుడా విషయమ్ము చెబుతాను
వినరా సూరమ్మ కూతురు మొగుడా విషయమ్ము చెబుతాను
అసలు విషయమ్ము చెబుతాను

చెప్పుమలీ

కారు మబ్బులు కమ్మేవేళా కాకులు గూటికి చెరేవేళా
కా...కా
చందమామ తొంగిచూసెవేళా సన్నజాజులు పూసేవేళా
ఆహా..ఓహో
ఒంటిగ నేను యింట్లోవుంటే..ఉయ్యాల ఎక్కి ఊగుతువుంటే
లాలి లాలి లాలి లాలి లాలి లాలి లాలి లాలి లాలిలో

ఏం జలిగింది?

తలుపు కిర్రున చప్పుడైనదీ..గుండె ఝల్లునా కొట్టుకున్నదీ
తలుపు కిర్రున చప్పుడైనదీ..గుండె ఝల్లునా కొట్టుకున్నదీ
మెల్ల మెల్లగ కళ్ళుతెరచి నే వచ్చినదెవరో చూసాను..వచ్చినదెవరో చూసాను

ఎవలాలు

నల్లనివాడు గుంటకన్నులవాడు గుబురు మీసాలవాడూ
అయ్యబాబోయ్
ఆరడుగుల పొడుగువాడు..ముద్దులిమ్మని నన్ను అడిగినాడు
ఏయ్ వాణ్ణి నేన్నలికేత్తాను 
నెనివ్వనెనివ్వ రానివ్వనంటూ..మొఖము దాచుకున్నా
పోనివ్వ పోనివ్వ ముద్దివ్వమంటూ..జడను లాగినాడూ
అమ్మా..నాన్నా..అమ్మా..నాన్నా కాపాడమంటూ అల్లాడిపోయానూ
అయినా కాని వదలక నన్ను ఒడిసి..పట్టినాడు
అంతలో వచ్చింది
ఏమిటి మూల్చా
కాదూ మా అమ్మ
ఊ..ఏమందీ
వెళ్ళవే నా తల్లి వెళ్ళవే అమ్మా ముద్దులిస్తే నీకు 
డబ్బులిస్తాడు మంచి బట్టలిస్తాడు..డబ్బులిస్తాడు మంచి బట్టలిస్తాడు 
అని ముందుకు తోసింది

ఆ..అది తల్లా కాదు లాక్షసి పిచాచి దయ్యం..తల్వాతేమయిందో చెప్పు

తప్పనిసరియై వెళ్లాను..సిగ్గుపడుతు నిలుచున్నాను
ఆ.....!!!
గదిలో కెత్తుకుపోయాడు కథలూ కబుర్లు చెప్పాడు..తన దుప్పటిలో చోటిచ్చాడు 
ఛీ కులతా..పాపాత్ములాలా..నువ్వు నాకొద్దు పో..వాడిదగ్గలకే పో

అంతకోపం ఎందుకయ్యా..అపుడు నా వయసైదయ్యా
ఏమితీ అప్పుడు నీకైదేళ్లా
అంతకోపం ఎందుకయ్యా..అపుడు నా వయసైదయ్యా
ఆ వచ్చినదీ..మా తాతయ్యా
తాతయ్యా తాతయ్యా మలి చెప్పవే 
తాతయ్య తకదియ్య
తాతయ్యా నేను ఎవలో..అనుకున్నాను
తాతయ్య కొంప..ముంచేచాడు

మురిపించే మువ్వలు--1962






సంగీతం::S.M.సుబ్బయ్య నాయుడు
రచన::ఆరుద్ర
దర్శకత్వం::M.V.రామన్
సంస్థ::దేవి ఫిల్మ్స్
తారాగణం::జెమిని గణేషన్,సావిత్రి,మనోహర్
గానం::S.జానకి

ఆభేరి :::: రాగం

పల్లవి::
ఆ ఆ ఆ ఆఆఆఆఆఆ
నీ లీల పాడెద దేవా..నీ లీల పాడెద దేవ

అనుపల్లవి::

మనవి ఆలించ వేడెద దేవా
నను లాలించు మా ముద్దు దేవా
నీ లీల పాడెద దేవ..నీ లీల పాడెద దేవ

సింధూర రాగంపు దేవా..
ఆ ఆ ఆ ఆ ఆ ఆఆఆఆఆ
దివ్య శృంగార భావంపు దేవా..
మళ్ళీ చెలువాలు నిను కోరు నీవు రావా, ఎలనీ
నీ లీల పాడెద దేవ

చరణం::
అనుపమ వరదాన శీలా..ఆ ఆ..

అనుపమ వరదాన శీలా....
వేగ కనిపించు కరుణాలవాలా
ఎలనీ నీ లీల పాడెద దేవ

చరణం::2

నీ లీల పాడెద దేవ
నను లాలించు మా ముద్దు దేవా
నీ లీల పాడెద దేవ..నీ లీల పాడెద దేవ

స్వ|| సగమపని నీ..నీ లీల పాడెద దేవ

నిస్స నిదపమా గామగరిసనీ పా నిసగమపా మగరిసా నిదమపా గరిని
నీ లీల పాడెద దేవ

సా, రిస్సా నిసరీసా నినిసా పపనినిసా మమపపనినిసా గగస గగస
నినిస పపని మమప గగమమపపనినిసస గరినిస...నీ లీల పాడెద దేవ

పానిదపమ గరిసని సగాగ సగాగ సగమప గరిసని సగసా,
నినిపా మమపా నీప నీప సాప నీపస నిద పమ గరి సగసా
గామపనిసా నిసగరి సరినీ 'సారిసనీ రీగరినీ సారిసనీ', గరినీ గరిగ నిరిగరి
నిగరినీ, నిరిరి నిసస నిరిరి నిసస నిదపా, నీనిస ఆఁ...

రీనిస పానిమాప గామ 'పనిసరి' ఆఁ...ఆ

సానిపాని ససనీ ససనీ
పనిపస పానిదనీ మాదనిసా నిదనీసరిసా
పానిదనిసరిసా..పానిదనిసరిసా..మగామపా
సాసనీ..నీసరిసా సాసనీ సాససాససాససది
సరిసని కిటతకథా..దదనినిసా..దదనిదపా కిటతకథా
నిదపమ తకుందరి సగమప కిటతకథా
సనిదనిపనిప కిటతకథా గరినిసదనిమపని..

నీ లీల పాడెద దేవా...
నను లాలించు మా ముద్దు దేవా..ఆ ఆ ఆ
నీ లీల పాడెద దేవా..

మన గాన కోకిల జానకమ్మ గారి జన్మదినానికి
జానకమ్మ పాడిన అద్భుతమైన ఈ పాటతో జానకమ్మకు
శతకోటి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతు....

ఈ గీతమునకు అనేక విశేషాలు ఉన్నాయి.
సావిత్రి యొక్క నూరవ చలన చిత్రము - 100 th film
( tamil ) ‘Konjum Salangai’ " మురిపించే మువ్వలు’అనే పేరుతో విడుదల ఐ,
విజయ దుందుభిని మోగించింది.
అరుణాచలం నాద స్వరము ఈ పాటకు మణి కిరీటము.
సన్నాయి పాటకు అందరినీ ఆకర్షింప జేస్తున్నది ఈ సంగీత సంవిధానము.
ఎస్.జానకి మొట్ట మొదటి పాట ఇది.
ఆమెకు ఈ సినిమా మ్యూజిక్ జగత్తులోనికి అవకాశము కలిగినది.