Saturday, March 02, 2013

నీడలేని ఆడది--1974

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=8001
సంగీతం::సత్యం
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::S.P.బాలు
తారాగణం::నరసింహరాజు,సుధీర్,వరప్రసాద్,ప్రభ, ఉమాదేవి,కల్పన,సీతాలత.

పల్లవి::

ఆ..ఆఆఆ..ఆఆఆ..ఆఆఆఆ  తొలివలపే తీయనిదీ..మదిలో మిగిలిన గాయమదీ
కలలాగా పెరిగినదీ..కథలాగా ముగిసినదీ
తొలివలపే తీయనిదీ..మదిలో మిగిలిన గాయమదీ
చరణం::1
అవే కేరటాలు..అవే కిరణాలు  
అదే గాలి ఈల..అదే సందె వేళ
అన్నీ ఉన్నాయి..అలాగే ఉన్నయి..కాని
చెలి ఒకతే కరువైనదీ..జీవితమే శిలయైనదీ     
తొలివలపే తీయనిదీ..మదిలో మిగిలిన గాయమదీ
రాధా...ఆఆఆ..  
చరణం::2
ఆనాటి ఆబాస..లేమాయెనో 
ఆకలలు ఆ చెలిమి..ఏమయనో
కొడిగట్టిన ఈ దీపం..అరకముందే
కొన ఊపిరి ఈ గూటిని..వీడకముందే
ఓ చెలీ..ఈ..ఓ చెలీ
కడసారైనా..నినుచూడనీ
నీ ఒడిలోనే..కనుమూయనీ