సంగీతం::చక్రవర్తి
రచన::C.V.రమణ
గానం::P.సుశీల,L.R.ఈశ్వరి
తారాగణం::శోభన్ బాబు, వాణిశ్రీ, విజయలలిత,ప్రభాకర రెడ్డి, సూర్యకాంతం,రమణారెడ్డి,G. వరలక్ష్మి
పల్లవి::
నాగులేటి వాగులోన..కడవ ముంచ బోతుంటే
నాగులేటి వాగులోన..కడవ ముంచ బోతుంటే
నీటిలోన నిన్ను చూసి..కొంగుజారి పోతుంటే
ఎంతో సిగ్గయిందిరా మామా..ఒళ్లు జల్లుమన్నాదిరా
మామ...ఒళ్ళు ఝల్లుమన్నాదిరా
నాగులేటి వాగులోన..కడవ ముంచ బోతుంటే
నీటిలోన నిన్ను చూసి..కొంగుజారి పోతుంటే
ఎంతో సిగ్గయిందిరా మామా..ఒళ్లు జల్లుమన్నాదిరా
మామ...ఒళ్ళు ఝల్లుమన్నాదిరా
చరణం::1
గూటిలోన దీపమెట్టి..ఏడినీళ్ళ తానమాడి
గూటిలోన దీపమెట్టి..ఏడినీళ్ళ తానమాడి
బంతి పూలెట్టుకొని..నీ కోసం సూత్తంటె
బంతి పూలెట్టుకొని..నీ కోసం సూత్తంటె
చందమామ వచ్చాడు..కన్నుగీటిపోయాడు
చందమామ వచ్చాడు..కన్నుగీటిపోయాడు
అప్పుడు మామ..మ్మ్ హూ..
ఎంతో సిగ్గయిందిరా మామా..ఒళ్లు జల్లుమన్నాదిరా
మామ...ఒళ్ళు ఝల్లుమన్నాదిరా
చరణం::2
నల్లమబ్బు మొలిసింది..పల్లెమీద ముసిరింది
నల్లమబ్బు మొలిసింది..పల్లెమీద ముసిరింది
జల్లు కురవబోతంటే..ఒళ్లు మరసి నేనుంటే
ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ
జల్లు కురవబోతంటే..ఒళ్లు మరసి నేనుంటే
మబ్బులోని మెరుపొచ్చి..బుగ్గగిల్లిపోయింది
మబ్బులోని మెరుపొచ్చి..బుగ్గగిల్లిపోయింది
అప్పుడు మామ..హ్హా..
ఎంతో సిగ్గయిందిరా మామా..ఒళ్లు జల్లుమన్నాదిరా
మామ..ఒళ్ళు ఝల్లుమన్నాదిరా
నాగులేటి వాగులోన..కడవ ముంచ బోతుంటే
నీటిలోన నిన్ను చూసి..కొంగుజారి పోతుంటే
ఎంతో సిగ్గయిందిరా మామా..ఒళ్లు జల్లుమన్నాదిరా
మామ..ఒళ్ళు ఝల్లుమన్నాదిరా
మామ ఒళ్ళు ఝల్లుమన్నాదిరా
మామ..ఒళ్ళు ఝల్లుమన్నాదిరా
మామ ఒళ్ళు ఝల్లుమన్నాదిరా
సంగీతం::సత్యం
ప్రొడ్యుసర్::చలం
Director:దర్శకత్వం::B.V.ప్రసాద్
రచన::రాజశ్రీ
గానం::పిఠాపురం నాగేశ్వరరావు,L. R.ఈశ్వరి
తారాగణం::P.భానుమతి, చలం,జమున,చలం,జమున,పద్మనాభం
గీతాంజలి,రాజనాల,ఛాయాదేవి,సత్యనారాయణ
పల్లవి::
వస్తే ఇస్తా నా మూగ...మనసూ
ఇస్తే వస్తా నీ దోర...వయసూ
వస్తే ఇస్తా నా మూగ...మనసూ
ఇస్తే వస్తా నీ దోర...వయసూ
అహ టక్కరి మాటల..చక్కని బస్తీ మావా
అహ అల్లరి చూపుల..పల్లెటూరి ఓ భామా
వస్తావా ఇస్తానూ...కన్నె మనసూ
ఇస్తేనే వస్తానూ...దోర వయసూ
వస్తే ఇస్తా నా...మూగ మనసూ
ఇస్తే వస్తా నీ...దోర వయసూ
చరణం::1
నీ రూపం నాలోనా..నాటుకుందీ ఘాటుగా
నిదురైనా పోలేదు..నాటి నుండీ నిండుగా
నీ రూపం నాలోనా..నాటుకుందీ ఘాటుగా
నిదురైనా పోలేదు..నాటి నుండీ నిండుగా
చూపులతో మురిపించొద్దు..ఊపులతో ఊరించొద్దు
మనసైతే పక్కకు వచ్చి..చేతికి చిక్కి
కోరినదిచ్చి...ఆ
ఇస్తే వస్తా నీ దోర...వయసూ
అహ..వస్తే ఇస్తా నా మూగ...మనసూ
చరణం::2
పరువంలో తూలు..పాల బువ్వుందీ
గుండెల్లో చూడు..పైడి గువ్వుందీ
పరువంలో తూలు..పాల బువ్వుందీ
గుండెల్లో చూడు పైడి..గువ్వుందీ
ఆ గూడు చేరాలంటే..నా తోడు కావాలంటే
నువు పూల పందిరి...వేసి
అందరి ముందు..తాళిని కట్టి..ఓ
వస్తే ఇస్తా నా మూగ...మనసూ
ఇస్తే వస్తా నీ దోర...వయసూ
అహ టక్కరి మాటల..చక్కని బస్తీ మావా
అహ అల్లరి చూపుల..పల్లెటూరి ఓ భామా
సంగీతం::సత్యం
ప్రొడ్యుసర్::చలం
Director:దర్శకత్వం::B.V.ప్రసాద్
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::S.P.బాలు
తారాగణం::P.భానుమతి, చలం,జమున,చలం,జమున,పద్మనాభం
గీతాంజలి,రాజనాల,ఛాయాదేవి,సత్యనారాయణ
పల్లవి::
రింజిం రింజిం హైదరబాద్..రిక్షావాలా జిందాబాద్
మూడు చక్రములు గిరగిర తిరిగితే
మోటరు కారు...బలాదూర్
రింజిం రింజిం హైదరబాద్..రిక్షావాలా జిందాబాద్
చరణం::1
అటు చూస్తే చార్మినారు..ఇటు చూస్తే జుమ్మా మసీదు
అటు చూస్తే చార్మినారు..ఇటు చూస్తే జుమ్మా మసీదు
ఆ వంకా అసెంబ్లీ హాలు..ఈ వంకా జూబిలి హాలూ
తళ తళ మెరిసే..ఏఏఏఏఏఏ..తళ తళ మెరిసే
హుస్సేనుసాగరు..దాటితే...సికింద్రబాదూ
రింజిం రింజిం హైదరబాద్..రిక్షావాలా జిందాబాద్
చరణం::2
ఒక తలపై రూమీ టోపీ..ఒక తలపై గాందీ టోపీ
ఒక తలపై రూమీ టోపీ..ఒక తలపై గాందీ టోపీ
క్యాభాయి అని అంటాడొకడూ..ఏమోయీ అని అంటాడొకడూ
మతాలు భాషలూ వేరైనా..ఆఆఆఆఆ..మతాలు భాషలూ వేరైనా
మనమంతా...భాయీ భాయీ
రింజిం రింజిం హైదరబాద్..రిక్షావాలా జిందాబాద్
చరణం::3
ఉన్నవాడికి తింటే అరగదు..లేనివాడికి తిండే దొరకదు
ఉన్నవాడికి తింటే అరగదు..లేనివాడికి తిండే దొరకదు
పరుపులున్నా పట్టదు నిదర..కరుకు నేలను గురకలు వినరా
హెచ్చు తగ్గులు తొలిగే రోజూ..ఊఊఊఊఊ..హెచ్చు తగ్గులు తొలిగే రోజూ
ఎపుడొస్తుందో...ఏమో
రింజిం రింజిం హైదరబాద్..రిక్షావాలా జిందాబాద్
మూడు చక్రములు గిరగిర తిరిగితే..మోటరు కారు బలాదూర్
రింజిం రింజిం హైదరబాద్..రిక్షావాలా జిందాబాద్
లలలలలాల లలలలలాల లలలలలాల లాలా
లలలలలాల లలలలలాల లలలలలాల లాలా
సంగీతం::సత్యం
ప్రొడ్యుసర్::చలం
Director:దర్శకత్వం::బి.వి.ప్రసాద్
రచన::రాజశ్రీ
గానం::S.P.బాలు
తారాగణం::P.భానుమతి, చలం,జమున,చలం,జమున,పద్మనాభం
గీతాంజలి,రాజనాల,ఛాయాదేవి,సత్యనారాయణ
పల్లవి::
హే..ఎద్దుబండి చూడు..ఒంటెద్దుబండి చూడు
అహ ఎద్దు మొద్దు అవతారం..బండి తోలుతున్నాడు
పల్లెటూరి బైతుగాడు డియ్యాలో..అహ..డియ్యాలో
దిష్టిబొమ్మలాగ ఉన్నాడు..డియ్యాలో
పల్లెటూరి బైతుగాడు డియ్యాలో..అహ..డియ్యాలో
దిష్టిబొమ్మలాగ..ఉన్నాడు డియ్యాలో
లా లల లల లలలల ఆహా హా లా లల లల లలలలలా
తుర్రు బుర్రు కారు..ఇది డబ్బా రేకు కారూ
టైరు పగిలిపోయిందా..కారు పని గోవిందా
బస్తీ దొరసానులూ డియ్యాలో..ఒహొ డియ్యాలో
బుట్టబొమ్మల్లా ఉన్నారు..డియ్యాలో
చరణం::1
రివ్వు రివ్వున సాగే..గువ్వలాంటి కారూ
ఎంత దూరమైనా..ఇది చిటికెలోన చేరూ
రివ్వు రివ్వున సాగే..గువ్వలాంటి కారూ
ఎంత దూరమైనా..ఇది చిటికెలోన చేరూ
అహ..ఎవ్వరాపలేరూ..ఇది ఇంగిలీషు కారు
మా కారుముందు నీ బండి..బలాదూర్..బలాదూర్
పల్లెటూరి బైతుగాడు డియ్యాలో..ఒహో..డియ్యాలో
దిష్టిబొమ్మలాగ ఉన్నాడు..డియ్యాలో
చరణం::2
పరుగెత్తే వరకే..కారు జోరు చెల్లు
కుంటు పడిందంటే..ఇనప కొట్టు కెళ్ళు
పరుగెత్తే వరకే..ఈ కారు జోరు చెల్లు
కుంటు పడిందంటే..అది ఇనపకొట్టు కెళ్ళు
మీ ఓటు కారు కంటే..మా నాటు బండి మేలు
ఏ గట్టు పుట్టలడ్డున్నా..నెట్టుకుంటు పోతుందీ
బస్తీ దొరసానులూ డియ్యాలో..ఒహొ డియ్యాలో
బుట్టబొమ్మల్లా ఉన్నారు..డియ్యాలో
పల్లెటూరి బైతుగాడు డియ్యాలో..ఒహో..డియ్యాలో
దిష్టిబొమ్మలాగ ఉన్నాడు..డియ్యాలో
లా లల లల లలల లా హా లా లా లల లల లలల లా లా
లా లల లల లలలల ఆహా హా లా లల లల లలలలలా
సంగీతం::S.P.కోదండపాణి
రచన::చిల్లర భావనారాయణ
గానం::S..జానకి
శుక్రవారపు పొద్దు సిరిని విడువద్దు
దివ్వె నూదగ వద్దు..బువ్వ నెట్టొద్దు
తోబుట్టువుల మనసు కష్ట పెట్టొద్దు
తొలి సంజె..మలి సంజె నిదురపోవద్దు
మా తల్లి వరలక్ష్మి నిను వీడదపుడు
మా తల్లి వరలక్ష్మి నిను వీడదపుడు
ఇల్ల్లాలు కంటతడి పెట్టనీ యింట
కల్లలాడని యింట గోమాత వెంట
ముంగిళ్ళ ముగ్గుల్లో..పసుపు గడపల్లో
పూలల్లో..పాలల్లో..
పూలల్లో..పాలల్లో..ధాన్య రాశుల్లో
మా తల్లి మహలక్ష్మి స్థిరముగా నుండు