రోజా మూవీస్ వారి
సంగీతం::చక్రవర్తి
రచన::వీటూరిసుందరరామమూర్తి
గానం::S.P.బాలుP.సుశీల
దర్శకత్వం::K.రాఘవేంద్రరావు
తారాగణం::N.T.రామారావు,శ్రీదేవి,జగ్గయ్య,కాంతారావు,పుష్పలత,అల్లు రామలింగయ్య.
పల్లవి::
జాబిలితో చెప్పనా..ఆఆఆ
జాబిలితో చెప్పనా..జామురాతిరి నిదురలోన
నీవు చేసిన అల్లరి చెప్పనా..రోజా
జాబిలితో చెప్పనా..ఆఆఆ
జాబిలితో చెప్పనా..జామురాతిరి కలలలోన
నీవు రేపిన అలజడి చెప్పనా..రాజా
చరణం::1
తుమ్మెదలంటని..తేనెలకై
తుంటరి పెదవికి..దాహాలు
చుక్కలు చూడని.చీకటిలో
సిగ్గులు కలవని..విరహాలు
చూపులలో చలి..చురచురలూ
ఆకలి తీరని..విరవిరలూ
అన్ని ఆవిరి..పెడుతుంటే
నన్నే అల్లరి..పెడుతున్నావని
చెప్పనా..ఆ..చెప్పనా..ఆ..చెప్పనా
జాబిలితో చెప్పనా..ఆఆఆ
జామురాతిరి..కలలలోన నీవు
రేపిన అలజడి చెప్పనా..రాజా
చరణం::2
గొంతులు దాచిన.గుండెలలో
కోయిల పాడని..గీతాలు
సూర్యుడు చూడనని..గంగలలో
అలలై పొంగిన..అందాలు
కౌగిట కాముని.పున్నములు
వెన్నెల వీణల..సరిగమలు
పేరంటానికి..రమ్మంటే
పెళ్ళికి పెద్దవు..నీవేలెమ్మని
చెప్పనా.ఆ..చెప్పనా..ఆ..చెప్పనా
జాబిలితో చెప్పనా..ఆఆఆ
జాబిలితో చెప్పనా..జామురాతిరి కలలలోన
నీవు రేపిన అలజడి చెప్పనా..రాజా
జాబిలితో చెప్పనా..జాబిలితో చెప్పనా
జామురాతిరి నిదురలోన నీవు
చేసిన అల్లరి చెప్పనా..రోజా
రోజా..రాజా..రోజా..రాజా
రోజా..రాజా..రోజా..రాజా