సంగీతం::రమేష్ నాయుడు Director::Vijayanirmala రచన::దాశరథి గానం::S.P.బాలు తారాగణం::కృష్ణ, విజయనిర్మల,జగ్గయ్య,గుమ్మడి,చంద్రకళ,చంద్రమోహన్,S.వరలక్ష్మి,సూర్యకాంతం,రమాప్రభ
పల్లవి:: పెళ్ళంటే నూరేళ్ళ పంట..అది పండాలి కోరుకున్నవారి యింట..పండాలీ బంధాలను తెంచుకుని..బాధ్యతలను పెంచుకుని అడుగు ముందుకేశావమ్మా..గడప దాటి కదిలావమ్మా పెళ్ళంటే..ఏఏఏఏ..నూరేళ్ళ పంట చరణం::1 మనిషి విలువ పెరిగేది..ధనం వలన కాదు ప్రేమించే హృదయానికి..పేదతనం లేదు మనిషి విలువ పెరిగేది..ధనం వలన కాదు ప్రేమించే హృదయానికి..పేదతనం లేదు మనసులోని మమతలను..తెలుసుకోరు పెద్దలు మనసులోని మమతలను..తెలుసుకోరు పెద్దలు అందుకే తిరుగుబాటు..చేసేరు పిల్లలు పెళ్ళంటే..ఏఏఏఏ..నూరేళ్ళ పంట అది పండాలి..కోరుకున్న..వారి యింట..పండాలీ పెళ్ళంటే..ఏఏఏఏ..నూరేళ్ళ పంట చరణం::2 మంచీ చెడు తెలిసికూడా..చెప్పలేనివారు ఎవ్వరికీ పనికిరారు ఏమీ..చేయలేరు మంచీ చెడు తెలిసికూడా..చెప్పలేనివారు ఎవ్వరికీ పనికిరారు ఏమీ..చేయలేరు అన్నెం పున్నెం ఎరుగని..అమాయకపు జీవులు అపనిందల పాలవుతూ..అలమటించుతారు అన్నెం పున్నెం ఎరుగని..అమాయకపు జీవులు అపనిందల పాలవుతూ..అలమటించుతారు పెళ్ళంటే..ఏఏఏఏ..నూరేళ్ళ పంట అది పండాలి కోరుకున్న..వారి యింట పండాలీ పెళ్ళంటే..ఏఏఏఏ..నూరేళ్ళ పంట చరణం::3 మనసు ఒకరిపైన..మనువు ఒకరితోన మనసు ఒకరిపైన..మనువు ఒకరితోన ఎలా కుదురుతుందీ..యిది ఎలా జరుగుతుంది కలిమికాదు మగువకు కావల్సిందీ కలిమికాదు..మగువకు..కావల్సిందీ మనసిచ్చిన వానితో..మనువు కోరుకుంది మనసిచ్చిన వానితో..మనువు కోరుకుంది మనువు..కోరుకుంది పెళ్ళంటే..ఏఏఏఏ..నూరేళ్ళ పంట అది పండాలి కోరుకున్న వారి యింట..పండాలీ బంధాలను తెంచుకుని..బాధ్యతలను పెంచుకుని అడుగు ముందుకు వేశావమ్మా..అడుగు ముందుకు వేశావమ్మా పెళ్ళంటే..ఏఏఏఏ..నూరేళ్ళ పంట
సంగీతం::S.P.కోదండపాణి రచన::వేటూరి గానం::ఘంటసాల,P.సుశీల తారాగణం::కృష్ణ,శారద,రామకృష్ణ,విజయలలిత,ప్రభకర్ రెడ్డి ,బేబి శ్రీదేవి
పల్లవి:: సరి సరి ఈ వేళ..ఈ బిగువేలా గడసరి నాసామి..రావేలా సరి సరి ఈ వేళ..ఈ బిగువేలా గడసరి నాసామి..రావేలా సరి సరి ఈ వేళ..ఈ బిగువేలా చరణం::1 మల్లెలుపూచే చల్లని..వేళా మదిలోరేగే తీయని..జ్వాలా మల్లెలుపూచే చల్లని..వేళా మదిలోరేగే తీయని..జ్వాలా వయసే పాడే..వలపుల జోలా మాటవిందువని..ఏలుకొందువని మదిని నమ్ముకొని..మరిమరి పిలిచితిని సరి సరి ఈ వేళ..ఈ బిగువేలా గడసరి నాసామి..రావేలా సరి సరి ఈ వేళ..ఈ బిగువేలా చరణం::2 పచ్చని సొగసూ..వాడకముందే పరువం పల్లవి..పాడకముందే ఏఏఏఏఏ..ఆ ఆ ఆ ఆ ఆ ఆ పచ్చని సొగసూ..వాడకముందే పరువం పల్లవి..పాడకముందే పరులకుమరులే..కలుగకముందే మనసుమార్చుకొని..దరికిచేర్చుకొని తనివి తీర్చమని..మరి మరి వేడతిని సరి సరి ఈ వేళ..ఈ బిగువేలా చరణం::3 రావే రావె రస..తరంగిణీ రాగము నీవే..రాగ రాగిణీ మదిలో మెదిలె..మధుర రూపిణీ నీ అందియల వలపు పిలుపు..విని నా దెందమున మరులు..నిలుపుకొని తలచి వలచి నిలిపి..పిలిచితిని పలుకవె ఒకసారి..ఓ సుకుమారి తరగని వన్నెల..వయ్యారీ పలుకవె ఒకసారి..ఓ సుకుమారీ