Friday, March 08, 2013

బ్లాగు మిత్రులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు___/\___

మాతృదేవత--1969
సంగీతం::K.V.మహదేవన్
రచన::C.నారాయణ రెడ్డి
గానం::P.సుశీల, B.వసంత 

దర్శకత్వం::సావిత్రి 
నటీనటులు::సావిత్రి, ఎన్.టి.రామారావు, శోభన్‌బాబు, చంద్రకళ, నాగభూషణం, 
రేలంగి, హేమలత, బేబిరాణి, రాజబాబు, మంజుల, సురభి బాలసరస్వతి, విజయలలిత, సాక్షి రంగారావు 
నిర్మాతలు::అట్లూరి పూర్ణచంద్రరావు, ఎం.చంద్రశేఖర్‌‌

పల్లవి::

మాతృదేవోభవా..పిత్రుదేవొభవా..ఆచార్యదేవోభవా..
మానవజాతి మనుగడకే ప్రాణం పోసింది మగువా..
త్యాగంలో..అనురాగంలో..తరగని పెన్నిధి మగువా..
మానవజాతి మనుగడకే ప్రాణం పోసింది మగువా..
త్యాగంలో..అనురాగంలో..తరగని పెన్నిధి మగువా..

చరణం::1

ఒక అన్నకు ముద్దుల చెల్లీ ..
ఒక ప్రియునికి వలపుల మల్లీ..
ఒక అన్నకు ముద్దుల చెల్లీ ..
ఒక ప్రియునికి వలపుల మల్లీ..

ఒక రామయ్యకే కన్నతల్లీ..
ఒక రామయ్యకే కన్నతల్లీ..
సకలావనికే కల్పవల్లీ..

అఅఅఅఅఅఅఅఅఅఅఅఅఅఅఅఅఅఅఅ..ఆ ఆ 
అఅఅఅఅఅఅఅఅఅఅఅఆఆఆఆఆఆఆఆఆఆ
ఒ ఒ ఒఒ ఒ ఒఒ ఒ ఒ ఒ ఒ ఓ ఓ ఓ ఓ ఓ 

మానవజాతి మనుగడకే ప్రాణం పోసింది మగువా...
త్యాగంలో..అనురాగంలో..తరగని పెన్నిధి మగువా..

చరణం::2

సీతగా..ధరణిజాతగా..సహనశీలం చాటినదీ..
రాధగా..మధురబాధగా..ప్రణయగాథల మీటినదీ..
సీతగా..ధరణిజాతగా..సహనశీలం చాటినదీ..
రాధగా..మధురబాధగా..ప్రణయగాథల మీటినదీ..

మోల్లగా..కవితలల్లగా..తేనేజల్లు కురిసినదీ..
మోల్లగా..కవితలల్లగా..తేనేజల్లు కురిసినదీ.. 
లక్ష్మిగా..ఝాన్సీలక్ష్మిగా..సమార రంగాన దూకినదీ..
లక్ష్మిగా..ఝాన్సీలక్ష్మిగా..సమార రంగాన దూకినదీ..

మానవజాతి మనుగడకే ప్రాణం పోసింది మగువా..
త్యాగంలో..అనురాగంలో..తరగని పెన్నిధి మగువా..

చరణం::3

తరుణి పెదవిపై చిరునగవొలకిన..మెరియును ముత్యాల సరులూ..
కలకంటికంట కన్నీరొలకిన..తొలగిపోవురా సిరులూ..
కన్నకడుపునా చిచ్చురగిలినా..కరువుల పాలవును దేశం..
కన్నకడుపునా చిచ్చురగిలినా..కరువుల పాలవును దేశం.. 
తల్లినిమించిన దైవం లేదని..తరతరాల సందేశం..
తల్లినిమించిన దైవం లేదని..తరతరాల సందేశం..

అఅఅఅఅఅఅఅఅఅఅఅఅఅఅఅఅఅఅఅ..ఆ ఆ 
అఅఅఅఅఅఅఅఅఅఅఅఆఆఆఆఆఆఆఆఆఆ
ఒ ఒ ఒఒ ఒ ఒఒ ఒ ఒ ఒ ఒ ఓ ఓ ఓ ఓ ఓ 

మానవజాతి మనుగడకే ప్రాణం పోసింది మగువా...
త్యాగంలో..అనురాగంలో..తరగని పెన్నిధి మగువా..తరగని పెన్నిధి మగువా..