సంగీతం::MM.కీరవాణి రచన::వేటూరిసుందరరామమూర్తి గానం::K.S.చిత్ర Film Directed By::K.Ajayakumar Film Produced By::K.S.Rama Rao తారాగణం::నాజార్,మాధవి,తనికెళ్ళభరణి,బ్రంహానందం,నిర్మలమ్మ,అల్లురామలింగయ్య,కోటశ్రీనివాస్‌రావు,చారుహాసన్,సుధ. పల్లవి:: వేణువై వచ్చాను భువనానికి గాలినై పోతాను గగనానికి వేణువై వచ్చాను భువనానికి గాలినై పోతాను గగనానికి మమతలన్నీ మౌనగానం వాంఛలన్నీ వాయులీనం వేణువై వచ్చాను భువనానికి గాలినై పోతాను గగనానికి మాతృదేవోభవ..పితృదేవోభవ..ఆచార్యదేవోభవ చరణం::1 ఏడుకొండలకైనా బండతానొక్కటే ఏడు జన్మల తీపి ఈ బంధమే ఏడుకొండలకైనా బండతానొక్కటే ఏడు జన్మల తీపి ఈ బంధమే నీ కంటిలో నలక లో వెలుగు నే కనక నేను నేననుకుంటే ఎద చీకటే హరీ..హరీ..హరీ..ఈ రాయినై ఉన్నాను ఈ నాటికి రామ పాదము రాక ఏనాటికి వేణువై వచ్చాను భువనానికి గాలినై పోతాను గగనానికి వేణువై వచ్చాను భువనానికి గాలినై పోతాను గగనానికి చరణం::2 నీరు కన్నీరాయే ఊపిరే బరువాయే నిప్పు నిప్పుగమారె నాగుండెలో..ఆ నీరు కన్నీరాయే ఊపిరే బరువాయే నిప్పు నిప్పుగమారె నాగుండెలో ఆ నింగిలో కలిసి నా శూన్యబంధాలు పుట్టిల్లు చేరే మట్టి ప్రాణాలు హరీ..హరీ..హరీ..ఈ రెప్పనై ఉన్నాను మీ కంటికి పాపనై వస్తాను మీ ఇంటికి వేణువై వచ్చాను భువనానికి గాలినై పోయాను గగనానికి గాలినై పోయాను గగనానికి Maathrudevobhava --1993 Music::MM.Keeravaani Lyrics:Veturisundararamamoorti Singer's::K.S.Chitra Film Directed By::K.Ajayakumar Film Produced By::K.S.Rama Rao Cast::Nasser,Madhavi,Nirmalamma,Tanikella bharani,Alluraamalingayya,Kota Srinivas Rao,Bramhanandam,Chaaruhaasan,Sudha.
సంగీతం::MM.కీరవాణి రచన::వేటూరిసుందరరామమూర్తి గానం::S.P.బాలు,K.S.చిత్ర Film Directed By::K.Ajayakumar Film Produced By::K.S.Rama Rao తారాగణం::నాజార్,మాధవి,తనికెళ్ళభరణి,బ్రంహానందం,నిర్మలమ్మ,అల్లురామలింగయ్య,కోటశ్రీనివాస్‌రావు,చారుహాసన్,సుధ. పల్లవి:: రాగం అనురాగం..సంసారం..మ్మ్ బంధం అనుబంధం..సంగీతం..మ్మ్ ఇద్దరుంటే పంచదార..సాగరం ఇల్లు చూస్తే మల్లె పూల పంజరం..అహహా..ఆ రాగం అనురాగం సంసారం..బంధం అనుబంధం సంగీతం చరణం::1 గోడ మీద బొమ్మ గొలుసుల బొమ్మ వచ్చే పోయే వారికి వడ్డించే బొమ్మ ఏంటో చెప్పమ్మా..తేలు పగలేమో రెండే కాళ్ళు చీకటి పడితే నాలుగు కాళ్ళు జంతువు కాదు మనిషే..ఎవరు..?ఇంకెవరు నాన్నే..ఏయ్ చిరు చిరు నవ్వుల్లో చిన్నారి గువ్వల్లో..చీకటింట దీపమెట్టాలా కనులు అదిరేలా..హా..కలలు కనవేలా ముసి ముసి ముద్దుల్లొ ముక్కుతున్న పొద్దుల్లో వెన్నెలింట వేడే పుట్టాలా పెదవి వెనకాలా హా..మధువులొలకాలా ఒడిలో పాప బడిలో పాప జతకీ కంటి పాపా యెదలో పాప యెదుటే పాప చెలి నా పాప చెలాకి సొగసుల రాగం అనురాగం సంసారం..మ్మ్..బంధం అనుబంధం సంగీతం..మ్మ్
చరణం::2 రాతిరి చేసిన తప్పుల్ని పొద్దుట మన్నించేస్తుంది ఎన్ని సార్లు మాట తప్పినా మన్నించాం పో అంటుంది ఆ దేవతెవరు? కనకదుర్గమ్మ..కాదు పోలేరమ్మా..కాదు..మరియమ్మా..కాదమ్మా..మీ అమ్మ తొలకరి తోటల్లొ వాగుల్లో వంకల్లో ఎంకి పాట ఏకం అవ్వాలా మనసు కవి పాటా..హ..మనకు విరిబాటా తిరుపతి కొండల్లో కోనల్లో కోవెల్లో ఏడు జన్మలేకం అవ్వాలా తెలుగు హరి పాటా..హ..తేనియల తేటా చిరు కోపాల చెలి రూపాలు పరిచే పక్కపాలు తమ తాపాల కసి దూపాలు అపుడే కాదు పదండి అనగల రాగం అనురాగం సంసారం బంధం అనుబంధం సంగీతం Maathrudevobhava --1993 Music::MM.Keeravaani Lyrics:Veturisundararamamoorti Singer's::S.P.Baalu,K.S.Chitra Film Directed By::K.Ajayakumar Film Produced By::K.S.Rama Rao Cast::Nasser,Madhavi,Nirmalamma,Tanikella bharani,Alluraamalingayya,Kota Srinivas Rao,Bramhanandam,Chaaruhaasan,Sudha.