Sunday, May 03, 2009

రామయ్య తండ్రి--1975

సంగీతం::సత్యం
రచన::మల్లెమాల
గానం::P.సుశీల,S.జానకి 
తారాగణం::సత్యనారయణ,రంగనాద్,రాజబాబు,ముక్కామల,జయంతి,ప్రభ,
మీనాకుమారి,పండరీబాయి 

పల్లవి::

అమ్మానాన్నకు పెళ్ళీ..ఎన్నోయేళ్ళకు మళ్ళీ
పీపీ పీపీ పిపిపీ పీపీ పిపిపీ పీపీ పిపిపీ పీపీ
అమ్మానాన్నకు పెళ్ళీ..ఎన్నో యేళ్ళకు మళ్ళీ 
తూ తూ బాకా వూదాలీ..డోలు సన్నాయి మోగాలీ          
తూ తూ బాకా వూదాలీ..డోలు సన్నాయి మోగాలీ          
అమ్మానాన్నకు పెళ్ళీ..ఎన్నో యేళ్ళకు మళ్ళీ 

చరణం::1

ఆ పెళ్ళికి నేను లేను..ఈ పెళ్ళికి నేనున్నాను  
ఆ పెళ్ళికి నేను లేను..ఈ పెళ్ళికి నేనున్నాను 
చిన్నపిల్లలే పెళ్ళిపెద్దలై..చేతులు కలిపిన పెళ్ళే పెళ్ళి     
అమ్మానాన్నకు పెళ్ళీ..ఎన్నో యేళ్ళకు మళ్ళీ 
తూ తూ బాకా వూదాలీ..డోలు సన్నాయి మోగాలీ          
అమ్మానాన్నకు పెళ్ళీ..ఎన్నో యేళ్ళకు మళ్ళీ 

చరణం::2

ఎందుకమ్మా సిగ్గూ..నాన్నా కొంచెం తగ్గూ
ఎందుకమ్మా సిగ్గూ..నాన్నా కొంచెం తగ్గూ
ఇవిగో ఇవిగో తలంబ్రాలు..అమ్మకు అందులో సగపాలు
ఇవిగో ఇవిగో తలంబ్రాలు..అమ్మకు అందులో సగపాలు
అన్యోన్యత మీ యిద్దరిపాలు..ఆనందం మా అందరిపాలు
బాలల దీవెన బ్రహ్మదీవెనై..వర్ధిల్లండీ కలకాలం
వర్ధిల్లండీ కలకాలం..వర్ధిల్లండీ కలకాలం    
అమ్మానాన్నకు పెళ్ళీ..ఎన్నో యేళ్ళకు మళ్ళీ
చిన్నపిల్లలే పెళ్ళిపెద్దలై..చేతులు కలిపిన పెళ్ళే పెళ్ళి     
అమ్మానాన్నకు పెళ్ళీ ఎన్నో యేళ్ళకు మళ్ళీ..ఎన్నో యేళ్ళకు మళ్ళీ