సంగీతం::విశ్వనాథన్ రామమూర్తి
రచన::ఆచార్య,ఆత్రేయ
గానం::P. సుశీల
సాకీ::
ప్రేమే నీకు మాంగల్యం అది జన్మజన్మల అనుబంధం
చావు పుట్టుకల కందని బంధం..దానికి లేదు వైధవ్యం
దానికి లేదు వైధవ్యం...
పల్లవి::
నిత్య సుమంగళి నీవమ్మా
నీకు అమంగళమేదమ్మా
నిత్య సుమంగళి నీవమ్మా
నీకు అమంగళమేదమ్మా
ప్రేమకు మృత్యువు లేదమ్మా
పెట్టిన బొట్టూ పోదమ్మా..పెట్టిన బొట్టూ పోదమ్మా
చరణం::1
పది మాసాలు మోసావే..ప్రాణంగా కనిపెంచావే
విడనాడి వెళుతున్నావా..కడసారి లాలించేవా
ఎవరో నిను ముద్దాడేరూ..ఎక్కడ అమ్మాని అడిగేరు
నాన్నను చేరగ పోయెనని..నవ్వుతూ చెప్పరా నా తండ్రి
నవ్వుతూ చెప్పరా నా తండ్రి....
చరణం::2
తల్లిని కాను తనయను కాను..ఎవరికి నేను కోడలు కాను
దేవుడు లేక కోవెల లేదు..నా దైవం లేక నే లేను
నా దైవం లేక నే లేను