Saturday, July 05, 2014

వేటగాడు--1979



రోజా మూవీస్ వారి
సంగీతం::చక్రవర్తి
రచన::వీటూరిసుందరరామమూర్తి 
గానం::S.P.బాలుP.సుశీల
దర్శకత్వం::K.రాఘవేంద్రరావు
తారాగణం::N.T.రామారావు,శ్రీదేవి,జగ్గయ్య,కాంతారావు,పుష్పలత,అల్లు రామలింగయ్య.

పల్లవి::

కొయిలాలో..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..హో..ఓ
కోహ కోహిలీ..కోత మీద లాహిరీ
కోహ కోహిలీ..కోత మీద లాహిరీ
కొయిలాలో..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..హో..ఓ
కొండమీన సందమామా..కొనలోన కోయభామ
కొండమీన సందమామా..కొనలోన కోయభామ
పకపకలాడింది..నా పట్టు తప్పింది
పకపకలాడింది..నా పట్టు తప్పింది
దీని ముక్కుకు తాడెయ్యా
బలె సక్కిలిగిలిదీనందం
సుక్కులు..మొక్కయ్యా
ఈ సక్కని చుక్కే నా సొంతం
కొండమీన సందమామా..కొనలోన కోయ మామ
కొండమీన సందమామా..కొనలోన కోయ మామ
తొంగి చూశాడూ..నా కొంగు లాగాడు
తొంగి చూశాడూ..నా కొంగు లాగాడు
ఓయ్..ఈడిముక్కుకు తాడెయ్య
బలె సక్కిలిగిలిదీనందం
సుక్కలు పక్కేయ్యా..ఈ పక్కిట సిక్కే నా సొంతం 
కొండమీన సందమామా..ఆ..ఆ..ఆ
కొనలోన కోయ మామ..ఆ..ఆ

చరణం::1

ఎండల్లో వానలాగే యెంట వస్తాను
కొండల్లో కోన లాగే జంటగుంటాను
ఆ మూడు ముల్లేసి..ఈ ముద్దు చెల్లిస్తా
ఆ మూడు ముల్లేసి..ఈ ముద్దు చెల్లిస్తా

ఐదు ప్రాణాల అందం..ఆరతీస్తాను
ఏడూ జన్మాల బంధం..హారమేస్తానూ
ఐదు ప్రాణాల అందం..ఆరతీస్తాను
ఏడూ జన్మాల బంధం..హారమేస్తానూ

ఈ ముద్దు చెల్లిస్తే..ఆ హద్దు చెరిపేస్తా
ఈ ముద్దు చెల్లిస్తే..ఆ హద్దు చెరిపేస్తా

దీని ముక్కుకు..తాడెయ్య
బలె..సక్కిలిగిలిదీనందం
సుక్కులు..మొక్కయ్యా
ఈ సక్కని చుక్కే..నా సొంతం
కొండమీన సందమామా..ఆ..ఆ..ఆ
కొనలోన..కోయమామ
కొండమీన సందమామా..ఆ..ఆ..ఆ
కొనలోన..కోయభామ

చరణం::2

ఏరంటి నిన్ను చూసి..ఎల్లువవుతాను
వరదల్లె పొంగుతుంటే..వంతెనేస్తాను
ఎన్నెట్లో గోదారి..కౌగిట్లో పొంగిస్తా
ఎన్నెట్లో గోదారి..కౌగిట్లో పొంగిస్తా
ఆకాశమయితే నువ్వు..చుక్కనవుతాను
అందాల జాబిలయితే..పక్కనుంటాను
ఆకాశమయితే నువ్వు..చుక్కనవుతాను
అందాల జాబిలయితే..పక్కనుంటాను
మల్లెల్లో ఇల్లేసీ..మనసంతా ఇచ్చేస్తా
మల్లెల్లో ఇల్లేసీ..మనసంతా ఇచ్చేస్తా
దీని ముక్కుకు తాడెయ్య..బలె సక్కిలిగిలిదీనందం
సుక్కులు..మొక్కయ్యా..ఈ సక్కని చుక్కే నా సొంతం
కొండమీన సందమామా..ఆ..ఆ..ఆ
కొనలోన..కోయభామ
పకపకలాడింది..నా పట్టు తప్పింది
తొంగి చూశాడూ..నా కొంగు లాగాడు
ఓయ్..ఈడిముక్కుకు తాడెయ్య..బలె సక్కిలిగిలిదీనందం
సుక్కలు పక్కేయ్యా..ఈ పక్కిట సిక్కే నా సొంతం
కొండమీన సందమామా..ఆ..ఆ..ఆ
కొనలోన..కోయభామ
కొండమీన సందమామా..ఆ..ఆ..ఆ
కొనలోన కోయమామ
కోహ కోహిలీ..కోత మీద లాహిరీ
కోహ కోహిలీ..కోత మీద లాహిరీ
కొయిలాలో..ఓ..ఓ