సంగీతం::M.B.శ్రీనివాసన్
రచన::C.నారాయణ రెడ్డి
గానం::భానుమతి
ఆలుమగలు విడిపోయినంతనే అనురాగాలే మారునా
అనురాగాలే మారునా
విడిగా బ్రతుకులు గడిపినంతనే వివాహబంధం తీరునా
వివాహబంధం తీరునా
ఆలుమగలు విడిపోయినంతనే అనురాగాలే మారునా
అనురాగాలే మారునా
నుదుట బాసికము..తీసినంతనే
పదములపారాణి మాసినంతనే..
అగ్నిసాక్షిగా..ఆ..అగ్నిసాక్షిగా
అంకితమైన..అంతరంగములు వేరౌనా
ఆలుమగలు విడిపోయినంతనే అనురాగాలే మారునా
అనురాగాలే మారునా
మంగళసూత్రం..కట్టిన నాడే
మనసులు ముడిపడి పోలేదా
ఏడడుగులూ..నడచిన నాడే
ఇరువురు ఒకరైపోలేదా..
ఆలుమగలు విడిపోయినంతనే అనురాగాలే మారునా
అనురాగాలే మారునా
కోవెల తలుపులు మోసినంతనే..
కోవెల తలుపులు మోసినంతనే..
దైవము దూరమైపోవునా..
మనసున చీకటి కమ్మినంతనే..
మమతలవెలుగులు మాయునా..
ఆలుమగలు విడిపోయినంతనే అనురాగాలే మారునా
అనురాగాలే మారునా