సంగీతం::సత్యం
రచన::C.నారాయణ రెడ్డి
గానం::SP.బాలు
రాగం:::శంకరాభరణం
ఇదే పాటా ప్రతిచోటా
ఇలాగే పాడుకొంటాను
పలుకలేని వలపులన్ని
పాటలో దాచుకొంటానూ
ఇదే పాటా ప్రతిచోటా
ఇలాగే పాడుకొంటాను
నా పాటవిని మురిసావూ
ఆపైన నను వలచావూ
నా పాటవిని మురిసావూ
ఆపైన నను వలచావూ
కలలాగ నను కలిసావూ
లతలాగపెనవేసావూ
ఒక గానమై ఒక ప్రాణమై
జతగూడిమనమున్నాము..
ఉన్నాము..ఉన్నామూ..
ఇదే పాటా ప్రతిచోటా
ఇలాగే పాడుకొంటాను
పలుకలేని వలపులన్ని
పాటలో దాచుకొంటానూ
ఇదే పాటా ప్రతిచోటా
ఇలాగే పాడుకొంటాను
నాడేమి వుందని భ్రమిసేవు
నేడేమి లేదని విడిచేవూ
నాడేమి వుందని భ్రమిసేవు
నేడేమి లేదని విడిచేవూ
ఆ..మూడుముళ్ళను మరిచేవు
నా పాలమనసును విరిచేవూ
ఈ నాడు నను విడనాడిన
ఏనాటికైన కలిసేవూ..నువు
కలిసేవూ..నను..లకిసేవూ..
ఇదే పాటా ప్రతిచోటా
ఇలాగే పాడుకొంటాను
పలుకలేని వలపులన్ని
పాటలో దాచుకొంటానూ
ఇదే పాటా ప్రతిచోటా
ఇలాగే పాడుకొంటాను