సంగీతం::S.రాజేశ్వరరావు
రచన::D.సినారె
గానం:::ఘంటసాల,P.సుశీల
పల్లవి::
ఈ రోజుల్లో పడుచువారు గడుసువారు
వీలైతే హుషారు కాకుంటే కంగారు
ఈ రోజుల్లో పడుచువారు గడుసువారు
వీలైతే హుషారు కాకుంటే కంగారు
ఈరోజుల్లో..ఓ ఓ ఓ ఓ ఓ
చరణం::1
తాజా తాజా మోజుల కోసం..తహతహలాడుతు ఉంటారు
తాజా తాజా మోజుల కోసం..తహతహలాడుతు ఉంటారు
పొట్టి షర్ట్లతో టైటు ప్యాంట్లతో..లొట్టి పిట్టలవుతుంటారు
మెప్పులు కోసం..అప్పులు చేసి
మెప్పులు కోసం అప్పులు చేసి..తిప్పలపాలవుతుంతారు
ఈరోజుల్లో..ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ
చరణం::2
రోడ్డు సైడున రోమియోలలా..రోజంతా బీటేస్తారు
రోడ్డు సైడున రోమియోలలా..రోజంతా బీటేస్తారు
సొగసరి చిన్నది కంటపడిందా చూపులతో మింగేస్తారు
ఆ చిన్న కాస్తా..చెయ్యి విసిరితే
ఆ చిన్నది కాస్త చెయ్యి విసిరితే చెప్పకుండా చెక్కేస్తారు
ఈ రోజుల్లో పడుచువారు గడుసువారు
వీలైతే హుషారు..కాకుంటే కంగారు
ఈరోజుల్లో..ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ
చరణం::3
పాఠాలకు ఎగనామం పెట్టి..మ్యాటిని షోలకు తయ్యారు
పాఠాలకు ఎగనామం పెట్టి..మ్యాటిని షోలకు తయ్యారు
పార్టీలంటూ పికినికులంటూ..పుణ్యకాలము గడిపేరు
పరీక్ష రోజులు..ముంచుకురాగా
పరీక్ష రోజులు ముంచుకురాగా..తిరుపతి ముడుపులు కడతారు
ఈరోజుల్లో..పడుచువారు గడుసువారు
సహనంలో కిసానులు..సమరంలో జవానులు
ఈరోజుల్లో..ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ
ఆడపిల్లలను గౌరవించితే..ఆత్మ గౌరవం పెరిగేను
సమరసభావం కలిగిన నాడే చదువుల విలువలు పెరిగేను
దేశానికి వెన్నెముకలు మీరు దివాళ కోరులు కావద్దు
భవితవ్యానికి బాటలు వేసే..భారం మనదని మరవద్దు
ఆ భారం మనదని మరవద్దు..మనదని మరవొద్దు