Sunday, May 10, 2009

రామయ్య తండ్రి--1975


సంగీతం::సత్యం
రచన::మల్లెమాల
గానం::P.సుశీల,S.జానకి 
తారాగణం::సత్యనారయణ,రంగనాద్,రాజబాబు,ముక్కామల,జయంతి,ప్రభ,
మీనాకుమారి,పండరీబాయి 

పల్లవి::

అమ్మ మంచిదీ..మనసు మంచిదీ
అంతకన్న అమ్మచేయి..మరీ మంచిదీ
అమ్మ మంచిదీ..మనసు మంచిదీ 

అమ్మ వంటిదీ..అమ్మ ఒక్కటే
దేవుడైన దేవతైన..అమ్మ పిమ్మటే                               
అమ్మ వంటిదీ..అమ్మ ఒక్కటే 

చరణం::1

వెన్న కన్న మెత్తనిది అమ్మలాలనా
వెన్నెలలా చల్లనిది..అమ్మదీవెనా..ఆ
వెన్న కన్న మెత్తనిది అమ్మలాలనా
వెన్నెలలా చల్లనిది..అమ్మదీవెనా
అమ్మ పిలుపు...తీయన
అమ్మ తలపు...తీయన
అమ్మ ఏమి చేసినా..తీయతీయనా
అమ్మ మంచిదీ..మనసు మంచిదీ
అంతకన్న అమ్మచేయి..మరీ మంచిదీ 
అమ్మ మంచిదీ..మనసు మంచిదీ 

చరణం::2

అమ్మ ఒడి..గుడికన్నా పదిలమైనదీ
అమ్మనుడి బడికన్నా..విలువైనదీ..ఈ
అమ్మ ఒడి..గుడికన్నా పదిలమైనదీ
అమ్మనుడి బడికన్నా..విలువైనదీ
శాంతిదూత నెహ్రూజీ..జాతినేత బాపూజీ
అంతగొప్ప వాళ్ళైన..అమ్మ కన్న బిడ్డలే  
అమ్మ వంటిదీ...అమ్మ ఒక్కటే
దేవుడైన దేవతైన...అమ్మ పిమ్మటే                               
అమ్మ వంటిదీ...అమ్మ ఒక్కటే 

చరణం::3

అమ్మ వుంటె..లేనిదేమి లేనేలేదూ
అమ్మలేక ఏమున్నా..వున్నది కాదూ..ఊ
అమ్మ వుంటె..లేనిదేమి లేనేలేదూ
అమ్మలేక ఏమున్నా..వున్నది కాదూ
అమ్మంటే భోగమూ..అమ్మే ఒక యోగమూ 
అమ్మంటే అమ్మంటే అమ్మంటే..నిత్యమూ
అమ్మంటే అమ్మంటే అమ్మంటే..సత్యమూ
అమ్మే సర్వస్వమూ..అమ్మే సర్వస్వమూ