Tuesday, January 21, 2014

అనురాగ సంగమం--1986



సంగీతం::ఇళయరాజా
రచన::M.గోపీ
గానం::S.P.బాలు
Film Directed By::Mani Ratnam 
తారాగణం::మోహన్,రాధ,అంబిక,కపిల్‌దేవ్ .

పల్లవి::

నవ్వింది రోజా..పూదోటలో
ఆ స్నేహ రాగం..ఏ జన్మదో
వలపు వాన ముంగిట కురిసి పరవశించెనూ
వసంతాలు ఎన్నో మదిలో కలబోసెనూ
ఒక రాగం అనురాగం ప్రతి రోజూ పాడేమూ

నవ్వింది రోజా..పూదోటలో

చరణం::1

నా గుండె గుడిలో నువు కొలువై
చిననాటి తోడై..నిలిచితివే..ఏఏఏ
నీవే లేక..నేనే శూన్యం
పాడే గీతం..నా చెలికోసం
నా పాట నీకు..వినిపించదా
నాటి వలపులు..నాటి తలపులు
నాలోని రాగమై..పలికెనే
నా కంటి వెన్నెలై..విరిసెనే
నా గొంతు..పల్లవించెనే
నువ్వు కన్న..కలలు పండెనే
నవ్వింది రోజా పూదోటలో..ఓఓఓ

చరణం::2

నీ ప్రేమ బంధం మది కదలీ
నా గుండె బరువై రగిలినదే..ఏఏఏ
పాటకు నీవే..స్వరమైనావే
కంటికి మాత్రం..కరువైనావే
రేపగలు నాలో..నీ ధ్యానమే
రాగదీపం నువ్వు..రాజ మేఘం నీవు
కోరేవు నా చెలి...రమ్మనీ
రాలేకపోతినే... లేదనీ
నా తప్పు..మన్నింతువో
నన్ను మరల..ఆదరింతువో

నవ్వింది రోజా...పూదోటలో
వలపు వాన ముంగిట..కురిసి పరవశించెనూ
వసంతాలు ఎన్నో..మదిలో కలబోసెనూ
ఒక రాగం అనురాగం..ప్రతి రోజూ పాడేమూ
నవ్వింది రోజా...పూదోటలో
ఆ స్నేహ రాగం...ఏ జన్మదో

Anuraaga Sangamam--1986
Music::Ilayaraaja
Lyrics::Mllavarapu Gopi
Singer::S.P.Baalu
Film Directed by::Mani Ratnam 
Cast::Mohan,Raadha,Ambika.

:::::::::::::::::::::

navvindi rOjaa..poodOTalO
aa snEha raagam..E janmadO
valapu vaana mungiTa kurisi paravasinchenuu
vasantaalu ennO madilO kalabOsenuu
omka raagam anuraagam prati rOjoo paaDEmuu

navvindi rOjaa..poodOTalO

::::1

naa gunDe guDilO nuvu koluvai
chinanaaTi tODai..nilichitivE..EEE 
neevE lEka..nEnE Soonyam
paaDE geetam..naa chelikOsam
naa paaTa neeku..vinipinchadaa
naaTi valapulu..naaTi talapulu
naalOni raagamai..palikenE
naa kanTi vennelai..virisenE
naa gontu..pallavinchenE
nuvvu kanna..kalalu panDenE
navvindi rOjaa poodOTalO..OOO

::::2

nee prEma bandham madi kadalii
naa gunDe baruvai ragilinadE..EEE
paaTaku neevE..svaramainaavE
kanTiki maatram..karuvainaavE
rEpagalu naalO..nee dhyaanamE
raagadeepam nuvvu..raaja mEgham neevu
kOrEvu naa cheli...rammanii
raalEkapOtinE... lEdanii
naa tappu..mannintuvO
nannu marala..aadarintuvO

navvindi rOjaa...poodOTalO
valapu vaana mungiTa..kurisi paravasinchenuu
vasantaalu ennO..madilO kalabOsenuu
oka raagam anuraagam..prati rOjuu paaDEmuu
navvimdi rOjaa...poodOTalO
aa snEha raagam...E janmadO