Sunday, May 18, 2014

నీరాజనం--198



సంగీతం::O.P.నయ్యర్
రచన::రాజశ్రీ
గానం::S.P.బాలు

పల్లవి::

మమతే మధురం మమతే మధురం
మరపే శిశిరం ఎదకూ విధికీ
జరిగే సమరం జరిగే సమరం
మమతే మధురం మమతే మధురం
మరపే శిశిరం ఎదకూ విధికీ
జరిగే సమరం జరిగే సమరం

చరణం::1

మనిషికి వలపే వరమా
మది వలపుకు వగపే ఫలమా
మనిషికి వలపే వరమా
మది వలపుకు వగపే ఫలమా
అది పాపమా విధి శాపమా
అది పాపమా విధి శాపమా
ఎద ఉంటె అది నేరమా

మమతే మధురం మమతే మధురం
మరపే శిశిరం ఎదకూ విధికీ
జరిగే సమరం జరిగే సమరం

చరణం::2

గుండెల దాటని మాట
ఎద పిండిన తీయని పాటా
గుండెల దాటని మాట
ఎద పిండిన తీయని పాటా
చరణాలుగా కరుణించునా
చరణాలుగా కరుణించునా
పల్లవిగ మరపించునా

మమతే మధురం మమతే మధురం
మరపే శిశిరం ఎదకూ విధికీ
జరిగే సమరం జరిగే సమరం
మమతే మధురం మమతే మధురం

రాణీకాసుల రంగమ్మ--1981


సంగీతం::చక్రవర్తి
రచన::వీటూరి
గానం::S.P.బాలు,P.సుశీల
తారాగణం::చిరంజీవి,జగ్గయ్య,శ్రీదేవి.రాళ్ళపల్లి,నూతనప్రసాద్.

అందంగా ఉన్నావు..గోవిందా రామా
అందితే నీ సొమ్ము..పోయిందా భామా
అందంగా ఉన్నావు..గోవిందా రామా
అందితే నీ సొమ్ము..పోయిందా భామా
హే..హా..ఆ..భామా..ఓఆహా

అందంగా ఉన్నాను..గోవిందా రామా
అందకుంటే నీ సొమ్ము..పోయిందా మావా
అందంగా ఉన్నాను..గోవిందా రామా
అందకుంటే నీ సొమ్ము..పోయిందా మావా
హే..హా..మావా..షబబరిబ

చరణం::1

పులకలెన్నో రేపుతుంటావు..పలకరిస్తే రేపు అంటావు
తళుకులెన్నో ఆరబోస్తావు..తారలాగా అందనంటావు
న్యాయమా..ధర్మమా..న్యాయమా..ధర్మమా

ముద్దులన్నీ మూటగట్టి ఉట్టిమీద పెట్టుంచాను మావా
కన్నుగొట్టి..చేయిపట్టి..చేయమంటే ప్రేమబోణీ
న్యాయమా..ధర్మమా..న్యాయమా..ధర్మమా

అందంగా ఉన్నావు..గోవిందా రామా
అందకుంటే నీ సొమ్ము..పోయిందా మావా
హే..హా..మావా..షబబరిబ

చరణం::2 

కోకకడితే కొంగు పడతావు..పూలు పెడితే బెంగ పడతావు
చేపలాగా ఈతలేస్తావు..చూపులోనే జారిపోతావు
న్యాయమా..ధర్మమా..న్యాయమా..ధర్మమా 

రాజుకొన్న మూజు మీద..జాజిపూలు వాడిపోయే భామా
లేత సోకో పూత రేకో..చేయనంటే మేజువాణి
న్యాయమా..ధర్మమా..న్యాయమా..ధర్మమా

అందంగా ఉన్నాను..గోవిందా రామా
అందకుంటే నీ సొమ్ము పోయిందా..మావా
హే..హా..మావా..షబబరిబ

రామ్ రహీమ్--1974


సంగీతం::S.రాజేశ్వరరావు
రచన::D.C.నారాయణరెడ్డి 
గానం::S.P.బాలు,P.సుశీల
తారాగణం::బాలకృష్ణ,హరికృష్ణ,జానకి, సత్యనారాయణ,రోజారమణి, చంద్రమోహన్,రేలంగి,ధూళిపాళ

పల్లవి::

ఎగిరే గాలిపటానికి..దారం ఆధారం
ఎగిరే గాలిపటానికి..దారం ఆధారం 

నా నిరుపేద జీవితానికి..నీ ప్రేమే ఆధారం
నా నిరుపేద జీవితానికి..నీ ప్రేమే ఆధారం

చరణం::1

ప్రేమే ఒక కలిమి..దానికి లేనే లేదు లేమి
నా మనసే నిను వలచింది..ఆ వలపే జత కలిపిందీ
నా మనసే నిను వలచింది..ఆ వలపే జత కలిపిందీ
కలిసిన జంటల విడదీస్తుంది కాలం కాలం
ఆ కాలానికి ఎదురీదీ..చేరుకుందాము ఆవలి తీరం  
ఎగిరే గాలిపటానికి దారం ఆధారం
నా నిరుపేద జీవితానికి నీ ప్రేమే ఆధారం

చరణం::2

ఏ సుడిగాలి వీస్తుందో..ఏ జడివాన వస్తుందో
ఏ సుడిగాలి వీస్తుందో..ఏ జడివాన వస్తుందో
ఈ బంధం గాలిపటంలా..ఏ నిమిషం ఏమవుతుందో
గాలికి చెదరదు..వానకు తడవదు బంధం మన బంధం
అది ఎగరేసే ఒడుపుంటే..నిలిచిపోతుంది కలకాలం 
ఎగిరే గాలిపటానికి దారం ఆధారం
నా నిరుపేద జీవితానికి నీ ప్రేమే ఆధారం
అహహా అహహా అహాహా హ్హా..అహహా అహహా అహాహా హ్హా