Monday, January 28, 2008

చక్రవాకం--1974::చక్రవాకం::రాగం



సంగీతం::KV.మహాదేవన్
రచన::ఆచార్య ఆత్రేయ
గానం::P.సుశీల
రాగం ::: చక్రవాకం


వీణలోనా తీగలోనా ఎక్కడున్నది నాదమూ
అది ఎలాగైనది రాగము
వీణలోనా తీగలోనా ఎక్కడున్నది నాదమూ
అది ఎలాగైనది రాగము వీణలోనా తీగలోనా

మాటలోనా మనసులోనా ఎక్కడున్నది భావము
అది ఎప్పుడవును గానము
మాటలోనా మనసులోనా ఎక్కడున్నది భావము
అది ఎప్పుడవును గానము
నాదమునకు స్వరమే రాగము మనసులోని మాటే భావము
రాగ భావము లేకమైనది రమ్యమైన గానము
వీణలోనా తీగలోనా...

గతజన్మ శౄతి చేసుకొన్నదీ
అది ఈ జన్మ సంగీతమైనదీ
సరిగమ పదనిసా నిదపమగరిదా
రాగాల ఆరోహణవరోహణైనది
అనురాగ హౄదయాల అన్వేషనైనది
వీణలోనా తీగలోనా

గుండెలోనా గొంతులోనా
ఎక్కడున్నదీ ఆవేదన అది ఎలాగవును సాధన
గీతమునకు బలమే వేదన వేదన రాగమునకు మెరుగే సాధన
గుండె గొంతుక లేకమైనది నిండురాగాలాపన
వీనలోనా తీగలోనా..
.