Monday, March 17, 2014

బుద్ధిమంతుడు--1969::మోహన::రాగం
















సంగీతం::K.V.మహదేవన్
రచన::దాశరధి 
గానం::ఘంటసాల
తారాగణం::అక్కినేని, విజయనిర్మల, శోభన్‌బాబు,నాగభూషణం,అల్లు రామలింగయ్య

మోహన::రాగం

సాకీ::

వేయి వేణువులు మ్రోగేవేళ
ఆ ఆ..ఆ ఆ..ఆ ఆ
హాయి వెల్లువై పొంగేవేళ
రాసకేళిలో తేలేవేళ
రాధమ్మను లాలించే వేళ

పల్లవి::

నను పాలింపగ నడచీ వచ్చితివా
మొరలాలింపగ తరలీ వచ్చితివా గోపాలా
నను పాలింపగ నడచీ వచ్చితివా
మొరలాలింపగ తరలీ వచ్చితివా గోపాలా
నను పాలింపగ నడచీ వచ్చితివా..ఆ

చరణం::1

అరచెదిరిన తిలకముతో అల్లదిగో రాధమ్మ
అరజారిన పయ్యెదతో అదిగదిగో గోపెమ్మ
ఎరుపెక్కిన కన్నులతో ఇదిగిదిగో సత్యభామ
పొద పొదలో ఎద ఎద లో
నీ కొరకై వెదుకుచుండగా 

నను పాలింపగ నడచీ వచ్చితివా
మొరలాలింపగ తరలీ వచ్చితివా గోపాలా
నను పాలింపగ నడచీ వచ్చితివా..ఆ

చరణం::2

కంసుని చెరసాలలో ఖైదీవై పుట్టావు
కాంతల కౌగిళ్లలో ఖైదీవై పెరిగావు
కరకు రాతి గుళ్లలో ఖైదీగా నిలిచావు
ఈ భక్తుని గుండెలో ఖైదీగా ఉండాలని

నను పాలింపగ నడచీ వచ్చితివా
మొరలాలింపగ తరలీ వచ్చితివా గోపాలా
నను పాలింపగ నడచీ వచ్చితివా..ఆ

బుద్ధిమంతుడు--1969
























సంగీతం::K.V.మహదేవన్
రచన::ఆరుద్ర
గానం::ఘంటసాల,P.సుశీల
తారాగణం::అక్కినేని, విజయనిర్మల, శోభన్‌బాబు,నాగభూషణం,అల్లు రామలింగయ్య

పల్లవి::

గుట్టమీద గువ్వ కూసింది 
కట్టమీద కంజు పలికింది 
ఓ..గుట్టమీద గువ్వ కూసింది 
కట్టమీద కంజు పలికింది 
ఓ..గుడిలోన జేగంట మ్రోగింది 
నా గుండెలో తొలివలపు పండింది 
ఓ..గుడిలోన జేగంట మ్రోగింది 
నా గుండెలో తొలివలపు పండింది 
ఓ గుండెలో తొలివలపు పండింది 

చరణం::1

నల్లా నల్లాని మబ్బు నడిచింది 
తెల్లా తెల్లాని అంచు తోచింది 
నల్లా నల్లాని మబ్బు నడిచింది 
తెల్లా తెల్లాని అంచు తోచింది 
తనువు సెలరేఖలై వెలిగింది 
తనువు సెలరేఖలై వెలిగింది 
చల్లా చల్లాని జల్లు కురిసింది 
ఓ..గుట్టమీద గువ్వ కూసింది 
నా గుండెలో తొలివలపు పండింది 
ఓ..గుట్టమీద గువ్వ కూసింది 

చరణం::2

కొమ్మ మీదా వాలి గోరింకా 
కమ్మ కమ్మని ఊసులాడింది 
మ్మ మీదా వాలి గోరింకా 
కమ్మ కమ్మని ఊసులాడింది
గోరింక తానింక గూడు కట్టకపోతే 
గోరింక తానింక గూడు కట్టకపోతే 
కొమ్మా యెంతో చిన్న బోతుంది 
కొమ్మా యెంతో చిన్న బోతుంది 
ఓ..గుట్టమీద గువ్వ కూసింది 
నా గుండెలో తొలివలపు పండింది 
ఓ..గుట్టమీద గువ్వ కూసింది 

చరణం::3

సన్న గాజుల రవళి పిలిచింది 
సన్న జాజుల దండ వేసింది 
సన్న గాజుల రవళి పిలిచింది 
సన్న జాజుల దండ వేసింది 
మనసైన జవరాలే వలచింది 
మనసైన జవరాలే వలచింది 
మనుగడే ఒక మలుపు తిరిగింది 
మనుగడే ఒక మలుపు తిరిగింది 
మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ 

బుద్ధిమంతుడు--1969





















సంగీతం::K.V.మహదేవన్
రచన::ఆరుద్ర
గానం::ఘంటసాల
తారాగణం::అక్కినేని, విజయనిర్మల, శోభన్‌బాబు,నాగభూషణం,అల్లు రామలింగయ్య

పల్లవి::

టాటా వీడుకోలు..గుడ్ బై ఇంకా సెలవు
టాటా వీడుకోలు..గుడ్ బై ఇంకా సెలవు
టాటా వీడుకోలు..గుడ్ బై ఇంకా సెలవు
తొలినాటి స్నేహితులారా..చెలరేగే కోరికలారా..హోయ్
తొలినాటి స్నేహితులారా..చెలరేగే కోరికలారా 
టాటా వీడుకోలు..గుడ్ బై ఇంకా సెలవు
టాటా వీడుకోలు..

చరణం::1

ప్రియురాలి వలపులకన్నా..నునువెచ్ననిదేది లేదని
ప్రియురాలి వలపులకన్నా..నునువెచ్ననిదేది లేదని
నిన్ననే నాకు తెలిసింది..ఒక చిన్నది నాకు తెలిపింది
ఆ..ప్రేమ నగరుకే పోతాను..పోతాను..పోతాను
ఈ..కామ నగరుకు రాను..ఇక రాను

టాటా వీడుకోలు..గుడ్ బై ఇంకా సెలవు
టాటా వీడుకోలు..

చరణం::2

ఇచ్చుటలో ఉన్న హాయీ..వేరెచ్ఛటను లేనే లేదనీ
ఇచ్చుటలో ఉన్న హాయీ..వేరెచ్ఛటను లేనే లేదనీ
లేటుగా తెలుసుకున్నాను..నా లోటును దిద్దుకున్నాను
ఆ స్నేహ నగరుకే పోతాను..పోతాను..పోతాను
ఈ మోహా నగరుకు రాను..ఇక రాను

టాటా వీడుకూలు..గుడ్ బై ఇంకా సెలవు
టాటా వీడుకోలు..

చరణం::3

మధుపాత్ర కెదలొ ఇంక..ఏమాత్రం చోటు లేదనీ
మధుపాత్ర కెదలొ ఇంక..ఏమాత్రం చోటు లేదనీ
మనసైన పిల్లె చెప్పింది..మనసైన పిల్లె చెప్పింది
నా మనసంతా తానై నిండింది..
నా మనసంతా తానై నిండింది 
నే..రాగ నగరుకే పోతాను
అనురాగ నగరుకే పోతాను..పోతాను

Budhimantudu--1969
Music::K.V.Mahadevan
Lyrics::Arudra
Singer's::Ghantasala
Cast::ANR, Vijayanirmala,Sobhanbabu,Nagabhushanam,Alluramalingayya.

:::

TaaTaa veeDukoolu..Good bye inkaa selavu
TaaTaa veeDukoolu..Good bye inkaa selavu
TaaTaa veeDukoolu..Good bye inkaa selavu
tolinaaTi snehitulaaraa..chelarege kOrikalaaraa..hOy
tolinaaTi snehitulaaraa..chelarege kOrikalaaraa 
TaaTaa veeDukoolu..Good bye inkaa selavu
TaaTaa veeDukOlu..

:::1

priyuraali valapulakannaa..nunuvechnanidedi ledani
priyuraali valapulakannaa..nunuvechnanidedi ledani
ninnane naaku telisindi..oka chinnadi naaku telipindi
aa..prema nagaruke pOtaanu..pOtaanu..pOtaanu
ee..kaama nagaruku raanu..ika raanu

TaaTaa veeDukoolu..Good bye inkaa selavu
TaaTaa veeDukOlu..

:::2

ichchuTalO unna haayee..verechChaTanu lene ledanee
ichchuTalO unna haayee..verechChaTanu lene ledanee
leTugaa telusukunnaanu..naa lOTunu diddukunnaanu
aa sneha nagaruke pOtaanu..pOtaanu..pOtaanu
ee mOhaa nagaruku raanu..ika raanu

TaaTaa veeDukoolu..Good bye inkaa selavu
TaaTaa veeDukOlu..

:::3

madhupaatra kedalo inka..emaatram chOTu ledanee
madhupaatra kedalo inka..emaatram chOTu ledanee
manasaina pille cheppindi..manasaina pille cheppindi
naa manasantaa taanai ninDindi..
naa manasantaa taanai ninDindi 
ne..raaga nagaruke pOtaanu

anuraaga nagaruke pOtaanu..pOtaanu

భబ్రువాహన--1964
















సంగీతం::పామర్తి
రచన::సముద్రాల (సీనియర్)
గానం::ఘంటసాల,P.సుశీల
తారాగణం::N.T.రామారావు, కాంతారావు, S.వరలక్ష్మి, చలం, L. విజయలక్ష్మి

పల్లవి::

దేవీ..ఇదిగో..నిన్నే.. 
నిన్నే నిన్నే చెలి నిలు నిలుమా
నినువిడి నిలువగ లేను సుమా
నిన్నే నిన్నే చెలి నిలు నిలుమా

నను విడుమా..ఇక నను విడుమా
నను విడుమా..ఇక నను విడుమా
నమస్తే జటాధారి..నాదారిని
విడు విడుమా..చెలి నిలు నిలుమా

చరణం::1

మగువలు కొలువగ దరిచేరగా
మతిమాయుట యతులకు న్యాయమా
మగువలు కొలువగ దరిచేరగా
మతిమాయుట యతులకు న్యాయమా
నీ కనుసన్నలా నను కరుణించినా
ఈ సన్యాసి మారేను సంసారిగా
విడువిడుమా..చెలి నిలు నిలుమా

చరణం::2

ఆపకుమా నే పాపినయ్యా 
ఈ రూపము నిలువగ రానిదయా
ఆపకుమా నే పాపినయ్యా 
ఈ రూపము నిలువగ రానిదయా
నీ రూపానికే నే ఈ రూపున
ఇట చేరి జపించి తపించేనులే
విడు విడుమా..చెలి నిలు నిలుమా

చరణం::3

విజయునికే తనువంకితం
నీ చెలువుని మోసం చేయుదువా
నేనే విజయుండను నేనే చెలికాడను
ఈ గోశాయి వేసాలు నీకోసమే
ఆ..ఆ..
నిలు నిలుమా..నను విడు విడుమా
నిలు నిలుమా..నను విడు విడుమా

BhabruVaahana--1964
Music::Paamarti
LYRICS::Samudraala (Senior)
Singer's::Ghantasala,Suseela
CAST::N.T.RaamaaRao,KaantaaRao, S.Varalakshmi, ChalaM, L.Vijayalakshmi

:::

devee..idigO..ninne.. 
ninne ninne cheli nilu nilumaa
ninuviDi niluvaga lenu sumaa
ninne ninne cheli nilu nilumaa

nanu viDumaa..ika nanu viDumaa
nanu viDumaa..ika nanu viDumaa
namaste jaTaadhaari..naadaarini
viDu viDumaa..cheli nilu nilumaa

:::1

maguvalu koluvaga daricheragaa
matimaayuTa yatulaku nyaayamaa
maguvalu koluvaga daricheragaa
matimaayuTa yatulaku nyaayamaa
nee kanusannalaa nanu karuninchinaa
ee sanyaasi maarenu samsaarigaa
viDuviDumaa..cheli nilu nilumaa

:::2

aapakumaa ne paapinayyaa 
ee roopamu niluvaga raanidayaa
aapakumaa ne paapinayyaa 
ee roopamu niluvaga raanidayaa
nee roopaanike ne ee roopuna
iTa cheri japinchi tapinchenule
viDu viDumaa..cheli nilu nilumaa

:::3

vijayunike tanuvankitam
nee cheluvuni mOsam caeyuduvaa
nene vijayunDanu nene chelikaaDanu
ee gOSaayi vesaalu neekOsame
aa..aa..
nilu nilumaa..nanu viDu viDumaa

nilu nilumaa..nanu viDu viDumaa