Sunday, May 27, 2012

మాయని-మమత--1970::కల్యాణి::రాగం




సంగీతం::అశ్వథామ
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::ఘంటసాల,P.సుశీల

తారాగణం::N.T.రామారావు,B.సరోజాదేవి,శోభన్‌బాబు,లక్ష్మి,నాగభూషణం

కల్యాణి::రాగం

పల్లవి::
కనులు మాటలాడుననీ..ఈ
మనసు పాట పాడుననీ..ఈ
కనులు మాటలాడుననీ మనసు పాట పాడుననీ
కనులు మాటలాడుననీ మనసు పాట పాడుననీ
కవితలల్లితి ఇన్నాళ్ళు..అవి కనుగొన్నాను ఈనాడు
కనులు మాటలాడుననీ మనసు పాట పాడుననీ
కవితలల్లగ విన్నాను..అవి కనుగొన్నాను ఈనాడు

చరణం::1

మెత్తగసాగే మేని తీగ..మెలికలు తిరిగితే ఒక అందం
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆఅ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
మెత్తగసాగే మేని తీగ..మెలికలు తిరిగితే ఒక అందం
ఆ మేనితీగ వలపుల పందిట అల్లుకొంటే ఒక అందం
మలయానిలమున చెలి ముంగురుల మబ్బులూగితే ఒక అందం
ఆ ముంగురులే చెలికాని మోముపై ముసురుకొంటే ఒక అందం
అదే...ఏ....ముద్దులొలికే అనుబంధం

కనులు మాటలాడుననీ మనసు పాట పాడుననీ
కవితలల్లితి ఇన్నాళ్ళు..అవి కనుగొన్నాను ఈనాడు

చరణం::2

వేచిన కలువా వెన్నెల జల్లుల..విరిసిపోతే మధురానందం
ఆ..కలువ చెలువ నెలరాయునిలో..కరిగిపోతే మహా అనందం
జగములు ఏలే చంద్రవదనతో..ఎగిసిపోతే దివ్యా నందం
ఆ..ఎగిసి ఎగిసి పులకించిన మనసులు ఏకమైతే ఇక ఆనందం
అదే...ఏ..ఏ..ఏ..యుగయుగాల అనుబంధం

Maayani Mamata--1970
Music::aswadhama
Lyrics::D.C.Narayana Reddy 
Singer's::Ghantasala,P.Suseela

::::


kanulu maaTalaaDunanii..ii..

manasu paaTa paaDunanii..ii..

kanulu maaTalaaDunanii..manasu paaTa paaDunanii

kavita lalliti innaaLLu..adi kanugonnaanu iinaaDu 

kanulu maaTalaaDunanii..manasu paaTa paaDunanii

kavita lallaga vinnaanu..adi kanugonnaanu iinaaDu 

::::1


mettagasaagE mEniteega melikalu tirigite oka andam

aa aa aa aa aa aa aa aa aa

mettagasaagE mEniteega melikalu tirigite..oka andam

aa mEniteega valapula pandiTa allukonTE..oka andam
malayaa nilamuna cheli mungurula mabbuloogitE..oka andam
A mungurulE chelikaani mOmupai musurukonTE..oka andam
adE..E..muddulolikE anubandham

kanulu maaTalaaDunanii..manasu paaTa paaDunanii

kavita lalliti innaaLLu..adi kanugonnaanu iinaaDu

::::2


vEchina kaluva vennela jallula visiripOtE..madhuraanandam

aa kaluva cheluva nelaraayunilO karigipOtE..mahadaanandam
jagamulanElE chandravadanatO egisipOtE..divyaanandam
aa..egisi egisi pulakinchina manasulu EkamaitE..rasaanandam
adE..E..yugayugaala anubandham.....

8/22/2012…time..5:45pm