Wednesday, June 22, 2011

అమ్మమాట--1972

చిమ్మటలోని ఈ పాట వింటూ లిరిక్స్ చూసుకోండి



సంగీతం::రమేష్‌నాయుడు
రచన::C.నారాయణ రెడ్డి
గానం::L.R.ఈశ్వరీ


మాయదారి సిన్నోడు..మనసే లాగేసిండు
నా..మనసే లాగేసిండు
లగ్నమెప్పుడురా మావా అంటె?
మాఘమాసం ఎల్లెదాక..మంచిరోజు లేదన్నాడే
ఆగేదెట్టగ..అందాక..ఏగేదెట్టాగా
ఆగేదెట్టగ..అందాక..ఏగేదెట్టాగా
కావమ్మ సెప్పవే..రావమ్మ సెప్పవే
రత్తమ్మ సెప్పవే..అత్తమ్మ సెప్పవే
ఆగేదెట్టగ..అందాక ఏగేదెట్టాగా
మాయదారి సిన్నోడు మనసే లాగేసిండు
మాయదారి సిన్నోడు..నా..మనసే లాగేసిండు
మాఘమాసం ఎల్లెదాక మంచిరోజు లేదన్నాడే
ఆగేదెట్టగ..అందాక..ఏగేదెట్టాగా

సింతసెట్టెక్కీ..సిగురులు కోస్తుంటే
సిట్టి సిట్టిగాజుల్లో..తాళం ఏస్తుంటే
సింతసెట్టెక్కీ..సిగురులు కోస్తుంటే
సిట్టి సిట్టిగాజుల్లో..తాళం ఏస్తుంటే
సిగురుల్లో..సిగురిల్లో..
సిగురుల్లో మాటేసి..కన్ను గీటిండే
జివ్వున ప్రాణాలు తోడేసిండే..
ఎప్పుడ్ర మావా అంటే??
సంకురాతిరి పొయ్యేదాకా..మంచిగడియే లేదన్నాడే
ఆగేదెట్టగ..అందాక..ఏగేదెట్టాగా
ఎల్లమ్మసెప్పవే..మల్లమ్మసెప్పవే
పుల్లమ్మసెప్పవే..బుల్లెమ్మసెప్పవే
ఆగేదెట్టగ..అందాక ఏగేదెట్టాగా

ఊరిసెరులో నే..నీదులాడుతుంటే
నీటి నురుగుల్లో..తేలితేలిపోతుంటే
ఊరిసెరులో నే..నీదులాడుతుంటే
నీటి నురుగుల్లో..తేలితేలిపోతుంటే
బుడుంగున..బుడుంగున..బుడుంగున
బుడుంగున..మీదెక్కి తేలిండే
నా తడికొంగు పట్టుకొనీ లాగిండే
ఎప్పుడ్రా.మావా అంటే??
శివరాతిరి ఎల్లేదాకా..సుభలగ్నం లేదన్నాడే
ఆగేదెట్టగ..అందాక..ఏగేదెట్టగా
పుల్లమ్మసెప్పవే..గున్నమ్మసెప్పవే..
కన్నమ్మసెప్పవే..సిన్నమ్మసెప్పవే
ఆగేదెట్టగ..అందాక..ఏగేదెట్టగా

కందిసేనుల్లో..ఓ..కావలికాసేసి
సందెకాడ ఒంటరిగా..డొంకదారినొస్తుంటే
కందిసేనుల్లో..ఓ..కావలికాసేసి
సందెకాడ ఒంటరిగా..డొంకదారినొస్తుంటే
గబుక్కున..గబుక్కున..గబుక్కున..
కళ్ళు రెండు మూసిండే..రివ్వున వాటేసి నవ్వేసిండే
ఏందిర మావా అంటే??
కోడికూసి కూయంగానే..తాళికడతా నన్నాడే
ఆగేదెట్టగ..ఇరాతిరి..ఏగేదెట్టగా
అమ్మమ్మసెప్పవే..అయ్యమ్మసెప్పవే..
పెద్దమ్మసెప్పవే..పిన్నమ్మసెప్పవే
ఆగేదెట్టగ..అందాక..ఏగేదెట్టగా
మాయదారి సిన్నోడు..నా మనసె లాగేసిండు
కోడికూసి కూయంగానే..తాళికడతా నన్నాడే
ఆగేదెట్టగ..ఇరాతిరి..ఏగేదెట్టగా
ఆగేదెట్టగ..ఇరాతిరి..ఏగేదెట్టగా


Amma Maata--1972
Music::Ramesh Naidu
Lyricist::C.Narayana Reddy
Singer's::L.R.Eshwari

mayadari sinnodu manase laagesindu na manase laagesindu
laggemeppudu ra mavaa ante
maghamaasam elle daakaa manchi roju ledannade
aagedettaga andaaka yegedettaga
aagedettaga andaaka yegedettaga
kaavamma seppave ravamma seppave
rattamma cheppave attamma cheppave
aagedettaga andaaka yegedettaga

:::1

sinta settekki sigurulu kostunte
siti siti gajullo taalam yestunte
sinta settekki sigurulu kostunte
siti siti gajullo taalam yestunte
sigurullo sigurullo
sigurullo matesi  kannu geetinde
jivvuna praanaalu todesinde
yeppudu ra mavaa ante
sankuraatiri poyye dakaa
manchi ghadiye ledannade
aagedettaga andaaka yegedettaga
 yellamma cheppave mallamma cheppave
pullamma cheppave bullamma cheppave

:::2

uri seruvuloni eeduladutunte
neeti nurugullo teli teli potunte
uri seruvuloni eeduladutunte
neeti nurugullo teli teli potunte
budunguna budunguna
budunnguna meedike telinde
na tadi kongu pattukuni laaginde
yeppudu ra mavaa ante
sivaratiri yelle dakaa
shubhalagnam ledannade
aagedettaga andaaka yegedettaga
punnamma cheppave gunnamma cheppave
kannamma cheppave chinnamma cheppave

kandi selallo kavali kasesi
sandakada ontariga donka darinostunte
kandi selallo kavali kasesi
sandakada ontariga donka darinostunte
gabukkuna gabukkuna
gabukkuna kallu rendu musinde
rivvuna vatesi navvesinde
yendira mavaa ante
kodi kusi kuyangaane tali kadataanannade
aagedettaga ee ratiri yegedettaga
ammamma cheppave ayyamma cheppave

peddamma cheppave pinnamma cheppave 

అంతా మన మంచికే--1972




సంగీతం::సత్యం
రచన::దాశరధి
గానం::SP.బాలు,P.సుశీల

ఓ...హో...హో..హో..
ఆఆఆహా..ఆఆహా...ఏహే...
నవ్వవే నా చెలీ..నవ్వవే నా చెలీ
చల్ల గాలి పిలిచేను..మల్లెపూలూ నవ్వేను
వలపులు పొంగే వేళలో......

నవ్వనా నా ప్రియా..మూడూ ముళ్ళూ పడగానే
తోడూ నీవూ కాగానే..మమతలు పండే వేళలో
నవ్వనా నా ప్రియా......

మనసులు ఏనాడొ కలిసాయిలే
మనువులు ఏనాడొ కుదిరాయిలే
నీవు నాదానవే..నీవు నా వాడవే
నేను నీ వాడ..నే నేను నీ దాననే
ఇక నను చేరి మురిపింప బెదురేలనే
నవ్వవే నా చెలీ..నవ్వనా నా ప్రియా

జగమేమి తలచేనొ..మనకెందుకూ
జనమేమి పలికేనొ..మనకేమిటీ
నేను నీ వాడనే..నేను నీ దాననే
నిజమైన మన ప్రేమ గెలిచేనులే

నవ్వవే నా చెలీ..నవ్వనా నా ప్రియా
సన్నగాలీ పిలిచేనూ..మల్లెపూలూ నవ్వేను
వలపులు పొంగే వేళలో..నవ్వవే నా చెలీ..నవ్వనా నా ప్రియా
ఎహెహేహే హే ఒహొ హో హో ఓ...

అంతా మన మంచికే--1972: హిందోళం ::రాగం





సంగీతం::సత్యం
రచన::దాశరధి

గానం::భానుమతి

రాగం:: హిందోళం :::

నేనే రాధనోయి..గోపాలా నేనే రాధ నోయి..
నేనే రాధనోయి..గోపాలా నేనే రాధ నోయి.
అందమైన ఈ బృందావని లో..నేనే రాధనోయి..
అందమైన ఈ బృందావని లో..నేనే రాధనోయి..
నేనే రాధనోయి..గోపాలా నేనే రాధ నోయి.

విరిసిన పున్నమి వెన్నెలలో..ఓ...
చల్లని యమునా తీరములో..ఓ..
విరిసిన పున్నమి వెన్నెలలో..ఓ...
చల్లని యమునా తీరములో..ఓ..
నీ పెదవులపై వేణు గానమై..
నీ పెదవులపై వేణు గానమై..
పొంగి పోదురా..నేనీ వేళా..
నేనే రాధనోయి..గోపాలా నేనే రాధ నోయి..

ఆడే పొన్నల నీడలలో..ఓ..
నీ మృదు పదముల జాడలలో..ఓ..
ఆడే పొన్నల నీడలలో..ఓ..
నీ మృదు పదముల జాడలలో..ఓ..
నేనే నీవై..నీవే నేనై..కృష్ణా..ఆ..ఆ..ఆ..
నేనే నీవై..నీవే నేనై..
అనుసరింతురా నేనీ వేళా..

నేనే రాధనోయి..గోపాలా..నేనే రాధ నోయి..
ఆఆఆఆఆఆఆఆఆ
నేనే రాధనోయి..ఆఆఆఆఆఆ..నేనే రాధనోయి..
నేనే రాధనోయి..ఆఆఆఆఆఆఅ
నేనే రాధ నోయి..ఆఆఆఆఆఆఆ
నేనే రాధనోయి..గోపాలా..నేనే రాధ నోయి..
నేనే రాధ నోయి..నేనే రాధ నోయి..నేనే రాధ నోయి..ఈ..