Friday, July 17, 2015

మిస్సమ్మ--1955::ఆనందభైరవి::రాగం
సంగీతం::సాలూరి రాజేశ్వరరావు
రచన::పింగళి నాగేంద్రరావు
గానం::P.లీల
Film Directed By::L.V.Prasaad
తారాగణం::నందమూరి తారక రామారావు,అక్కినేని నాగేశ్వరరావు,సావిత్రి,S.V.రంగారావు,జమున,రేలంగి వెంకటరామయ్య,ఋష్యేంద్రమణి,
రమణారెడ్డి,అల్లు రామలింగయ్య,గుమ్మడి వెంకటేశ్వరరావు.

ఆనందభైరవి::రాగం 

పల్లవి::

శ్రీ జానకీ దేవీ..సీమంతమలరే
మహలక్ష్మి సుందర..వదనము గనరే
శ్రీ జానకీ దేవి..సీమంతమలరే

చరణం::1

పన్నీరు గంధాలు..సఖి పైన చిలికించి
కానుకలూ కట్నాలు..చదివించరమ్మా
పన్నీరు గంధాలు..సఖి పైన చిలికించి
కానుకలూ కట్నాలు..చదివించరమ్మా
మల్లే మొల్లల తరులు..సఖి జడను సవరించీ
ఎల్లా వేడుకలిపుడూ..చేయించరమ్మా
శ్రీ జానకీ దేవీ..సీమంతమలరే
మహలక్ష్మి సుందర..వదనము గనరే
శ్రీ జానకీ దేవి..సీమంతమలరే

చరణం::2

కులుకుచూ కూచున్న..కలికిని తిలకించి
అలుక చెందగనీక..అలరించరమ్మా
కులుకుచూ కూచున్న..కలికిని తిలకించి
అలుక చెందగనీక..అలరించరమ్మా
కులమెల్ల దీవించు..కొమరూని గనుమంచు
ఎల్లా ముత్తైదువులు..దీవించరమ్మా
శ్రీ జానకీ దేవీ..సీమంతమలరే
మహలక్ష్మి సుందర..వదనము గనరే
శ్రీ జానకీ దేవి..సీమంతమలరే