Monday, October 05, 2015

స్వాతిముత్యం--1986



సంగీతం::ఇళయరాజా
రచన::ఆచార్య-ఆత్రేయ
గానం::S.P.బాలు,S.P.శైలజ 
Producer::Edida Nageswara Rao
Film Directed By::K.Viswanath
తారాగణం::కమల్‌హాసన్,రాధిక,గొల్లపూడిమారుతిరావు,J.V.సోమయాజులు,శరత్‌బాబు,దీప,Y.విజయ,డబ్బింగ్ జానకి,ఏడిదశ్రీరాం,మల్లికార్జునరావు,సుత్తి వీరభద్రరావు,విద్యాసాగర్,వరలక్ష్మీ.  
ప్రముఖ నిర్మాత ఏడిద నాగేశ్వర రావు గారి సృతులు 

పల్లవి::

పట్టుసీర తెస్తనని..ఈ..ఈ..ఈ..ఈ..ఈ..ఈ
పట్టుసీర తెస్తనని పడవేసికెళ్ళిండు..మావా..ఆ
పట్టుసీర తెస్తనని పడవేసికెళ్ళిండు..మావా..ఆ
గట్టుసేరే దాకా....అట్టగే ఉండు
పట్టపగలల్లే...ఓ..సందమావా
పట్టపగలల్లే...ఓ..సందమావా
తననన నానా..తానాని నన
తననన.......

చరణం::1 

తాళిబొట్టు తెస్తనని తాళ్ళరేవుకెళ్ళిండు..మావా..ఆ
తాళిబొట్టు తెస్తనని తాళ్ళరేవుకెళ్ళిండు..మావా..ఆ

ఆలినయ్యే దాకా....యెల్లిపోమాకా
ఎన్నెల్లమ్మ తోడు...సందమావా
ఎన్నెల్లమ్మ హొయ్..తోడు సందమావా
ఎన్నెలమ్మ..అబ్బ..స్స్

Swatimutyam--1986
Music::Ilayaraajaa
Lyrics::Achaarya-Atreya
Singer's::S.P.Baalu,S.P.Sailaja 
Phroducher::Edida Nagesvara Rao
Film^ Direchted By^::K.Visvanath
Cast::Kamalhaasan,Raadhika,Nirmalamma,Gollapoodimaarutirao,J.V.Somayaajulu,SaratBabu,Deepa,Y.Vijaya,Dubbing Janaki,EdidaSreeram,Mallikarjuna Rao,Suthi Veerabhadra Rao,Vidyasagar,
Varalakshmi,

:::::::::

paTTuseera testanani..ii..ii..ii..ii..ii..ii
paTTuseera testanani paDavEsikeLLinDu..maavaa..aa
paTTuseera testanani paDavEsikeLLinDu..maavaa..aa
gaTTusErE daakaa....aTTagE unDu
paTTapagalallE...O..sandamaavaa..aa
paTTapagalallE...O..sandamaavaa..aa
tananana naanaa..taanaani nana
tananana.......

::::1 

taaLiboTTu testanani taaLLarEvukeLLinDu..maavaa..aa
taaLiboTTu testanani taaLLarEvukeLLinDu..maavaa..aa

aalinayyE daakaa....yellipOmaakaa
ennellamma tODu..O...sandamaavaa
ennellamma hoy^..tODu sandamaavaa
ennelamma..abba..ss^

స్వాతిముత్యం--1986



సంగీతం::ఇళయరాజా
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::S.P.బాలు,S.జానకి 
Producer::Edida Nageswara Rao
Film Directed By::K.Viswanath
తారాగణం::కమల్‌హాసన్,రాధిక,గొల్లపూడిమారుతిరావు,J.V.సోమయాజులు,శరత్‌బాబు,దీప,Y.విజయ,డబ్బింగ్ జానకి,ఏడిదశ్రీరాం,మల్లికార్జునరావు,సుత్తి వీరభద్రరావు,విద్యాసాగర్,వరలక్ష్మీ.  
ప్రముఖ నిర్మాత ఏడిద నాగేశ్వర రావు గారి సృతులు 

మధ్యమావతి::రాగం 

పల్లవి::

ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ 
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ 
మీరు రోజూ ఇలా సాధన చేస్తారా..?
ఇప్పుదే మొదలు పెట్టాను!
నీ దగ్గర సంగీతం నేర్చుకోవాలి కదా !
మ్మ్..హు..నేనిక నేర్పేదేముందీ..మీరింత బాగా పాడుతుంటే

ఆ... పై షడ్యమం ...
మ... మందరంఆ..ఆ..ఆ..ఆ..ఆ 
చూడండి..ఆ..ఆ..ఆ..ఆ హా
ఆ..ఆ..ఆ....ఆ...ఆ...ఆ...ఆ....ఆ

ని స రి మ ప ని స రి ని రి రి స
ని ప మ ప ద ని సా ని ప రి మ రి నీ..సా
తానననా..తానా..న..తదరే..నా..ఆ 

సువ్వి సువ్వి..సువ్వాలమ్మా సీతాలమ్మా..ఆహ
గువ్వ మువ్వ..సవ్వాడల్లే నవ్వాలమ్మా 
సువ్వి సువ్వీ..సువ్వాలమ్మ..సీతాలమ్మా 
గువ్వ మువ్వా..సవ్వాడల్లే నవ్వాలమ్మా..ఆఆఆఆ
సువ్వి సువ్వి సువ్వాలమ్మా..సీతాలమ్మా 
సువ్వి సువ్వి సువ్వీ..సువ్వి సువ్వి సువ్వి
సువ్వి సువ్వి సువ్వాలమ్మా సీతాలమ్మా 

చరణం::1  

అండా దండా ఉండాలని..కోదండ రాముని నమ్ముకుంటే
అండా దండా ఉండాలని..కోదండ రాముని నమ్ముకుంటే
గుండేలేని మనిషల్లే..నిను కొండా కోనల కొదిలేశాడా
గుండేలేని మనిషల్లే...........
గుండేలేని మనిషల్లే నిను..కొండా కోనల కొదిలేశాడా

అగ్గీ లోనా దూకి..పువ్వు మొగ్గా లాగా తేలిన నువ్వు
నేగ్గేవమ్మా ఒక నాడు..నింగి నేల నీతోడు
నేగ్గేవమ్మా ఒక నాడు..నింగి నేల నీతోడు
సువ్వి సువ్వి సువ్వీ..సువ్వి సువ్వి సువ్వి
సువ్వి సువ్వి సువ్వాలమ్మా సీతాలమ్మా

చరణం::2 

చుట్టూ ఉన్నా చెట్టు చేమ..తోబుట్టువులింకా నీకమ్మా
చుట్టూ ఉన్నా చెట్టు చేమ..తోబుట్టువులింకా నీకమ్మా
ఆగక పొంగే కన్నీళ్ళే..నీ ఆకలి దప్పులు తీర్చేనమ్మా
ఆగక పొంగే కన్నీళ్ళే..నీ ఆకలి దప్పులు తీర్చేనమ్మా
పట్టిన గ్రహణం విడిచి..నీ బతుకున పున్నమి పండే ఘడియ
వస్తుందమ్మా ఒకనాడు..చూస్తున్నాడు పైవాడు
వస్తుందమ్మా ఆ నాడు..చూస్తాడా ఆ పైవాడు
సువ్వి సువ్వి సువ్వీ...

Swatimutyam--1986
Music::Ilayaraajaa
Lyrics::D.C.Naaraayanareddi
Singer's::S.P.Baalu,S.Jaanaki 
Phroducher::Edida Nagesvara Rao
Film^ Direchted By^::K.Visvanath
Cast::Kamalhaasan,Raadhika,Nirmalamma,Gollapoodimaarutirao,J.V.Somayaajulu,SaratBabu,Deepa,Y.Vijaya,Dubbing Janaki,EdidaSreeram,Mallikarjuna Rao,Suthi Veerabhadra Rao,Vidyasagar,
Varalakshmi,

:::::::::

aa..aa..aa..aa..aa..aa..aa..aa..aa..aa..aa..aa 
aa..aa..aa..aa..aa..aa..aa..aa..aa..aa..aa..aa 
meeru rOjuu ilaa saadhana chEstaaraa..?
ippudE modalu peTTaanu!
nee daggara sangeetam nErchukOvaali kadaa !
mm..hu..nEnika nErpEdEmundii..meerinta baagaa paaDutunTE

aa..a..pai shaDyamam ...
ma..a..mandaramaa..aa..aa..aa..aa 
chooDanDi..aa..aa..aa..aa haa
aa..aa..aa....aa...aa...aa...aa....aa

ni sa ri ma pa ni sa ri ni ri ri sa
ni pa ma pa da ni saa ni pa ri ma ri nee..saa
taanananaa..taanaa..na..tadaree..naa..aa 

suvvi suvvi..suvvaalammaa seetaalammaa..aaha
guvva muvva..savvaaDallE navvaalammaa 
suvvi suvvee..suvvaalamma..seetaalammaa 
guvva muvvaa..savvaaDallE navvaalammaa..aaaaaaaa
suvvi suvvi suvvaalammaa..seetaalammaa 
suvvi suvvi suvvee..suvvi suvvi suvvi
suvvi suvvi suvvaalammaa seetaalammaa 

::::1  

anDaa danDaa unDaalani..kOdanDa raamuni nammukunTE
anDaa danDaa unDaalani..kOdanDa raamuni nammukunTE
gunDElEni manishallE..ninu konDaa kOnala kodilESaaDaa
gunDElEni manishallE...........
gunDElEni manishallE ninu..konDaa kOnala kodilESaaDaa

aggee lOnaa dooki..puvvu moggaa laagaa tElina nuvvu
nEggEvammaa oka naaDu..ningi nEla neetODu
nEggEvammaa oka naaDu..ningi nEla neetODu
suvvi suvvi suvvee..suvvi suvvi suvvi
suvvi suvvi suvvaalammaa seetaalammaa

::::2 

chuTToo unnaa cheTTu chEma..tObuTTuvulinkaa neekammaa
chuTToo unnaa cheTTu chEma..tObuTTuvulinkaa neekammaa
aagaka pongE kanneeLLE..nee aakali dappulu teerchEnammaa
aagaka pongE kanneeLLE..nee aakali dappulu teerchEnammaa
paTTina grahaNam viDichi..nee batukuna punnami panDE ghaDiya
vastundammaa okanaaDu..choostunnaaDu paivaaDu
vastundammaa aa naaDu..choostaaDaa aa paivaaDu
suvvi suvvi suvvee...

స్వాతిముత్యం--1986



సంగీతం::ఇళయరాజా
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::S.P.బాలు,S.జానకి 
Producer::Edida Nageswara Rao
Film Directed By::K.Viswanath
తారాగణం::కమల్‌హాసన్,రాధిక,గొల్లపూడిమారుతిరావు,J.V.సోమయాజులు,శరత్‌బాబు,దీప,Y.విజయ,డబ్బింగ్ జానకి,ఏడిదశ్రీరాం,మల్లికార్జునరావు,సుత్తి వీరభద్రరావు,విద్యాసాగర్,వరలక్ష్మీ.  
ప్రముఖ నిర్మాత ఏడిద నాగేశ్వర రావు గారి సృతులు 

పల్లవి::

ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ 
మనసు పలికే..మనసు పలికే
మౌనగీతం..మౌనగీతం
మనసు పలికే..మౌన గీతం..నేడే

మమతలొలికే..మమతలొలికే
స్వాతిముత్యం..స్వాతిముత్యం
మమతలొలికే స్వాతిముత్యం..నీవే

అణువు అణువు..ప్రణయ మధువు
అణువు అణువు..ప్రణయ మధువు
తనువు..సుమధనువు
మనసు పలికే..మౌన గీతం..నేడే
మమతలొలికే స్వాతిముత్యం..నీవే

చరణం::1

శిరసుపై నీ గంగనై మరుల జలకాలాడనీ..మరుల జలకాలాడనీ
సగము మేన  గిరిజనై పగలు రేయి ఒదగనీ..పగలు రేయి ఒదగనీ

హృదయ మేళనలో..మధుర లాలనలో
హృదయ మేళనలో..మధుర లాలనలో
వెలిగిపోని..రాగ దీపం
వెలిగిపోని రాగ దీపం..వేయి జన్మలుగా  
మనసు పలికే మౌన గీతం..నేడే
మమతలొలికే స్వాతిముత్యం..నీవే

చరణం::2

ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
కానరానీ ప్రేమకే ఓనమాలు దిద్దనీ..ఓనమాలు దిద్దనీ
పెదవిపై నీ ముద్దునై మొదటి తీపి అద్దనీ..మొదటి తీపి
లలిత యామినిలో..కలల కౌముదిలో
లలిత యామినిలో..కలల కౌముదిలో
కరిగిపోని..కాలమంతా
కరిగిపోని కాలమంతా..కౌగిలింతలుగా

మనసు పలికే..మనసు పలికే
మౌనగీతం..మౌనగీతం
మనసు పలికే మౌన గీతం..నేడే
మమతలొలికే..మమతలొలికే
స్వాతిముత్యం..స్వాతిముత్యం
మమతలొలికే స్వాతిముత్యం..నీవే
అణువు అణువు..ప్రణయ మధువు
అణువు అణువు..ప్రణయ మధువు
తనువు..సుమధనువు

Swatimutyam--1986
Music::Ilayaraajaa
Lyrics::D.C.Naaraayanareddi
Singer's::S.P.Baalu,S.Jaanaki 
Phroducher::Edida Nagesvara Rao
Film Direchted By::K.Visvanath
Cast::Kamalhaasan,Raadhika,Nirmalamma,Gollapoodimaarutirao,J.V.Somayaajulu,SaratBabu,Deepa,Y.Vijaya,Dubbing Janaki,EdidaSreeram,MallikarjunaRao,SuthiVeerabhadraRao,Vidyasagar,
Varalakshmi,

:::::::::

aa..aa..aa..aa..aa..aa..aa..aa..aa..aa..aa..aa 
manasu palikE..manasu palikE
mauna geetaM..mauna geetaM
manasu palikE mauna geetaM..nEDE
mamatalolikE..mamatalolikE
swaatimutyam..swaatimutyam
mamatalolikE swaatimutyam..neevE
aNuvu aNuvu..praNaya madhuvu
aNuvu aNuvu..praNaya madhuvu
tanuvu..sumadhanuvu
manasu palikE..mouna geetam..nEDE
mamatalolikE swaatimutyam..neevE

::::1

Sirasupai nee ganganai marula jalakaalaaDanee..marula jalakaalaaDanee
sagamu mEnu  girijanai pagalu rEyi odaganee..pagalu rEyi odaganee
hRdaya mELanalO..madhura laalanalO
hRdaya mELanalO..madhura laalanalO
veligipOni..raaga deepam
veligipOni raaga deepam..vEyi janmalugaa 

manasu palikE mouna geetam..nEDE
mamatalolikE swaatimutyam..neevE

::::2

aa..aa..aa..aa..aa..aa..aa..aa..aa..aa..aa..aa
kaanaraanee prEmakE Onamaalu diddanee..Onamaalu diddanee
pedavipai nee muddunai modaTi teepi addanee..modaTi teepi
lalita yaaminilO..kalala koumudilO
lalita yaaminilO..kalala koumudilO
karigipOni..kaalamantaa
karigipOni kaalamantaa..kougilintalugaa

manasu palikE..manasu palikE
mauna geetaM..mauna geetaM
manasu palikE mauna geetaM..nEDE
mamatalolikE..mamatalolikE
swaatimutyam..swaatimutyam
mamatalolikE swaatimutyam..neevE
aNuvu aNuvu..praNaya madhuvu
aNuvu aNuvu..praNaya madhuvu
tanuvu..sumadhanuvu

Edida Nageswara Rao Naidu



ఉన్నత విలువలు కలిగిన తెలుగు చిత్రసీమ ప్రతిభను ప్రపంచానికి చాటిన మహా మనిషి..
ప్రముఖ నిర్మాత ఏడిద నాగేశ్వర రావు గారు పరమపదించారు. వారి ఆత్మ కు శాంతి కలగాలని కోరుకుంటూ వారికి ఘన నివాళులు అర్పిస్తుంది ' సంగీత ప్రపంచం'.
అనారోగ్యంతో హైదరాబాదులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. పూర్థోదయా మూవీస్ క్రియేషన్స్ పతాకంపై ఆయన పలు కళాత్మక చిత్రాలను నిర్మించారు. ఆయన వయస్సు 82 ఏళ్లు. ఆయన భౌతిక కాయానికి హైదరాబాదులోని ఫిల్మ్‌నగర్‌లో గల నివాసానికి తరలించారు. శంకరాభరణం, స్వాతిముత్యం, సాగరసంగమం, సితార, సీతాకోకచిలుక, సిరిసిరిమువ్వ, స్వయంకృషి, అపద్భాంధవుడు వంటి పలు చిత్రాలను ఆయన నిర్మించారు. 
పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ఆయన 1934 ఏప్రిల్ 24వ తేదీన జన్మించారు. డబ్బింగ్ ఆర్టిస్టు ఆయన కెరీర్‌ను ప్రారంభించారు. నిర్మాత యు. విశ్వేశ్వరరావు అనువదించిన పార్వతీ కళ్యాణం చిత్రంలో శివుడి పాత్రధారికి ఆయన తొలిసారి డబ్బింగ్ చెప్పారు. ఎన్టీఆర్ నటించిన ఆత్మబంధువు చిత్రంతో ఆన తెర వెనుక నుంచి తెరపైి వచ్చారు. 1964, 1974 మధ్య కాలంలో ఆయన దాదాపు 30 చిత్రాల్లో వేషాలు వేశారు. వందకు పైగా చిత్రాల్లో డబ్బింగ్ చెప్పారు. ఆయనకు శ్రీ వెంకటేశ్వర కల్యాణం పేరుతో విడుదలైన అనువాద చిత్రం ఆయనకు లాభాలు తెచ్చి పెట్టింది. 1976లో విడుదలైన సిరిసిరిమువ్వ చిత్రం విజయంతో ఆయనకు తిరుగులేకుండా పోయింది .ఆ తర్వాత ఆయన పూర్థోదయ ఆర్ట్ పిక్చర్ సంస్థలను నెలకొల్పారు. ఆ బ్యానర్‌పై నిర్మించిన తాయారమ్మ - బంగారయ్య చిత్రంతో ఆయన జైత్రయాత్ర ప్రారంభమైంది.

ఆయన అంత్యక్రియలు సోమవారం సాయంత్రం మహాప్రస్థానంలో జరుగుతాయి.
Music World Rajesh Sri