Thursday, November 15, 2007

ఖైదీ బాబాయ్--1974


























సంగీత::K.V.మహదేవన్
రచన::ఆరుద్ర
గానం::P.సుశీల
తారాగణం::శోభన్ బాబు,వాణిశ్రీ,షావుకారు జానకి,పద్మనాభం,గుమ్మడి,రమాప్రభ,చంద్రమోహన్,సుమ,నిర్మల.

పల్లవి::

బయస్కోప్పిల్లొచ్చిందీ..బలే తమాషా చూపిస్తుందీ
పైసా ఒకటి పారేస్తే..ప్రపంచమంతా కనిపిస్తుంది
కాశీ పట్నం సూడరబాబూ..సూడరబాబూ 
కాళహస్తి సూడరబాబూ..సూడరబాబూ 

చరణం::1

అలివేలు మంగమ్మను సూడూ
బీబీ నంచారమ్మను సూడూ 
అలివేలు మంగమ్మను సూడూ
బీబీ నంచారమ్మను సూడూ 
యిద్దరు భార్యల మద్దెన నలిగే
యెర్రిబాగుల యెంకన్నను సూడూ   
కాశీ పట్నం సూడరబాబూ సూడరబాబూ
కాళహస్తి సూడరబాబూ సూడరబాబూ 

చరణం::2

అది ఓరుగలు గడ్డరా ఆమె కాకతీయుల బిడ్డరా  
పేరు రుద్రమదేవిరా పౌరుషంలో కనకదుర్గరా  
అది ఓరుగలు గడ్డరా ఆమె కాకతీయుల బిడ్డరా  
పేరు రుద్రమదేవిరా పౌరుషంలో కనకదుర్గరా  
బ్రహ్మనాయని మీసం ఛూడూ బాలచంద్రుని రోసం చూడు
చూడు చూడు అటు బొబ్బొలి గాండ్రించెను తాండ్రబెబ్బులి 
కాశీ పట్నం సూడరబాబూ సూడరబాబూ
కాళహస్తి సూడరబాబూ సూడరబాబూ 

చరణం::3

కొండపల్లి బొమ్మను చూడూ..కోహినూరు వజ్రం చూడూ
కొండవీటి కోటను చూడూ..గోలకొండ ఖిల్లాను చూడు
రతనాలున్న రాయలసీమను..చూడు చూడు
సంపదలున్న సర్కారును..చూడు చూడు
తేనెలూరే తెలంగాణాను..చూడు చూడు
ఓ బాబూ..తెలుగునాడు వెలుగులన్నీ 
కలిపి చూడు..కలగలిపు చూడు          
బయస్కోప్పిల్లొచ్చిందీ
బలే తమాషా..చూపిస్తుందీ
పైసా ఒకటి పారేస్తే..ప్రపంచమంతా కనిపిస్తుంది
కాశీ పట్నం సూడరబాబూ..సూడరబాబూ
కాళహస్తి సూడరబాబూ..సూడరబాబూ