Tuesday, February 05, 2008

మనసు-మాంగల్యం--1971
సంగీతం::పెండ్యలనాగేశ్వరరావు 
రచన::ఆత్రేయ
గానం::ఘంటసాల,P.సుశీల 
తారాగణం::అక్కినేని,జమున,జగ్గయ్య,అంజలీదేవి,పద్మనాభం,రమణారెడ్డి,చంద్రమోహన్,రామకృష్ణ,గీతాంజలి.

పల్లవి::

సన్నని వెన్నెల..జలతారువలె కన్నుల 
కమ్మెను కన్నీటి తెర..ఆ తెరలో ఈ రాతిరిలో
నిన్ను నేను చూస్తున్నా..నిన్ను నేను చూస్తున్నా
నీలో నన్ను...నేను చూస్తున్నా 
ఇద్దరిలో జగతిలోన..ప్రేమ కొరకు వేగిపోవు  
వేల వేల...హృదయాలే చూస్తున్నా   
నిన్నునేను చూస్తున్నా..నీలో నన్ను నేను చూస్తున్నా

చరణం::1

కదలీ కదలక కదలే నీ కదలికలో..ఓ..ఓ..ఓ..ఓ 
కదలీ కదలక కదలే..నీ కదలికలో
చిరుగాలికి ఊగాడే వరిమడినే చూస్తున్నా..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
ఆ వరిమడిలో ఆ వరవడిలో..వంగి వంగి కలుపుతీయు
కాపుకన్నె...వంపులన్ని చూస్తున్నా..ఆ 
నిన్నునేను చూస్తున్నా..నీలో నన్ను నేను చూస్తున్నా

చరణం::2

విరిసీ విరియని విరివంటి పరువంలో..ఓ..ఓ..ఓ..ఓ 
కెరటాల గోదారి వురకలనే..కంటున్నా..ఆ..ఆ..ఆ..ఆ..ఆ  
ఆ వురకలలో ఆ నురుగులలో..ఆ వురకలలో నురుగులలో
గడవేస్తూ పడవనడుపు..పల్లెపడుచు పకపకలే వింటున్నా..హా హా హా 

చరణం::3

చిదుమని చెక్కిలి చిందే సిగ్గుల్లో..ఓ..ఓ..ఓ..ఓ 
సందెవేళ అలముకునే ఎర్రజీర చూస్తున్నా..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
ఆ ఎర్రదనంలో...ఆ కుర్రతనంలో 
ఆ ఎర్రదనంలో ఆ కుర్రతనంలో..వెనక జన్మలెన్నెన్నో
పెనవేసిన...వెచ్చదనం కంటున్నా     
నిన్నునేను చూస్తున్నా..నీలో నన్ను నేను చూస్తున్నా
నీలో నన్ను నేను చూస్తున్నా