Sunday, January 18, 2009

ప్రేమ్ నగర్--1971




సంగీతం::K.V.మహాదేవన్
రచన::ఆత్రేయ
గానం::ఘంటసాల,L.R.ఈశ్వరి

లే..లే..లే..లేలేలే...నా రాజా...లేలే...నా రాజా
లేలేలే...నా రాజా లేలే. నా రాజా...
లేవనంటావా నన్ను లేపమంటావా

నిద్దుర లేవనంటావా నన్ను లేపమంటావా
లే..లే..లే..లేలేలే నా రాజా...లేలే నా రాజా...

పెటపెటలాడే పచ్చివయసు పై పై కొచ్చిందీ
వచ్చి వచ్చి మెరమెరలాడే మేని నునుపు మెత్తగ తగిలిందీ
హాయ్..పెటపెటలాడే పచ్చివయసు పై పై కొచ్చిందీ
మెరమెరలాడే మేని నునుపు మెత్తగ తగిలిందీ
మెత్తని మత్తూ..వెచ్చని ముద్దూ..ఒద్దిక కుదిరిందీ
ఇద్దరు ఉంటే...ఒక్కరికేలా...నిద్దుర వస్తుందీ

రా..రా..రా..రా ఆ నా రోజా..రావే..నా రోజా
రా ఆ నా రోజా..రావే..నా రోజా
రాతిరయ్యిందా..హావ్..నన్ను లేచిరమ్మందా..ఆవ్..
రాతిరయ్యిందా..హావ్..నన్ను లేచిరమ్మందా..ఆవ్..
లే..లే..లే..లేలేలే...నా రాజా...లేలే...నా రాజా

నల్లనల్లని కన్నులలోన ఎర్రని కైపుందీ
ఎర్ర ఎర్రనీ కుర్రతనములూ జుర్రుకుతాగాలీ..హా..హా..
నల్లనల్లని కన్నులలోన ఎర్రని కైపుందీ
ఎర్ర ఎర్రనీ కుర్రతనములూ జుర్రుకుతాగాలీ
తాగిన రాత్రీ..తాగని పగలూ ఒక్కటి కావాలీ
తాగిన రాత్రీ..తాగని పగలూ ఒక్కటి కావాలీ
ఆఖరి చుక్కా..హావ్..చక్కని చుక్కా..హా..అప్పుడు ఇవ్వాలీ

రా..రా..రా..రా ఆ నా రోజా..లలల్లాల్లా..రావే..నా రోజ
రాతిరయ్యిందా..హా..నన్ను లేచిరమ్మందా..హావ్..
రాతిరయ్యిందా..హా..నన్ను లేచిరమ్మందా..హా..
లే..లే..లే..లేలేలే...నా రాజా...లేలే...నా రాజా

ప్రేమ్ నగర్--1971




సంగీతం::KV.మహాదేవన్
రచన::ఆత్రేయ
గానం::ఘంటసాల


ఎవరికోసం ఎవరికోసం ఈ ప్రేమమందిరం ఈ శూన్యనందనం
ఈ భగ్నహృదయం ఈ అగ్నిగుండం
ఎవరికోసం ఎవరికోసం ఎవరికోసం..

ప్రేమభిక్ష నువ్వే పెట్టి ఈ పేదహృదయం పగులగొట్టి
పిచ్చివాణ్ణి పాత్రలేని బిచ్చగాణ్ణి చేశావు
నువ్వివ్వనిది దాచలేను ఇంకెవ్వడినీ అడుగలేను
బ్రతుకు నీకు ఇచ్చాను చితిని నాకు పేర్చావు
ఎవరికోసం ఎవరికోసం ఈ ప్రేమమందిరం ఈ శూన్యనందనం
ఎవరికోసం ఎవరికోసం ఎవరికోసం

ఓర్వలేని ఈ ప్రకృతి ప్రళయంగా మారనీ
నా దేవి లేని ఈ కోవెల తునాతునకలైపోనీ
కూలిపోయి ధూళిలో కలసిపోనీ కాలిపోయి బూడిదే మిగలనీ
ఎవరికోసం ఎవరికోసం ఈ ప్రేమమందిరం ఈ శూన్యనందనం
ఎవరికోసం ఎవరికోసం ఎవరికోసం

మమత నింపమన్నాను మనసు చంపుకున్నావు
మధువు తాగనన్నాను విషం తాగమన్నావు
నీకు ప్రేమంటే నిజం కాదు నాకు చావంటే భయం లేదు
నీ విరహంలో బ్రతికాను ఈ విషంతో మరణిస్తాను మరణిస్తాను

ప్రేమ్ నగర్--1971::యదుకుల కాంభోజి::రాగం




సంగీతం::మహాదేవన్
రచన::ఆత్రేయ
గానం::ఘంటసాల,P.సుశీల


రాగం::యదుకుల కాంభోజి::

(పహడి)

నీ కోసం..ఆ..ఆ..ఆ.
నీ కోసం..ఆ..ఆ..ఆ..ఆ
నీ కోసం వెలిసిందీ ప్రేమమందిరం
నీ కోసం విరిసిందీ హౄదయనందనం
నీ కోసం వెలిసిందీ ప్రేమమందిరం
నీ కోసం విరిసిందీ హౄదయనందనం
నీ కోసం వెలిసిందీ ప్రేమమందిరం

ప్రతి పూవూ నీ నవ్వే నేర్చుకున్నదీ
ప్రతి తీగ నీ వంపులు తెచ్చుకున్నదీ
ప్రతి పాదున నీ మమతే పండుతున్నదీ
ప్రతి పందిరి నీ మగసిరి చాటుతున్నదీ
నీ కోసం విరిసిందీ హౄదయనందనం
నీ కోసం వెలిసిందీ ప్రేమమందిరం

అలుపురాని వలపులు..ఆ..హ..హా..
ఆడుకునేదిక్కడ..ఆ..ఆ
చెప్పలేని తలపులు..ఆ..హ..హా
చేతలయేదిక్కడ..ఆ..ఆ..
విడిపోని బంధాలు వేసుకొనేదిక్కడ
తొలి చెలిమి అనుభవాలు తుది చూసేదిక్కడ
ఆ..ఆ..ఆ..ఓ..ఓ..ఓ..ఆ..హ..హా..ఆ..ఆ..ఆ..
నీ కోసం వెలిసిందీ ప్రేమమందిరం

కలలెరుగని మనసుకు..ఆ..హ..హా..హా
కన్నెరికం చేసావు..ఆ..ఆ..ఆ
శిల వంటి మనిషిని..అ..హ..హా..
శిల్పంగా మార్చావు...ఆఅ..ఆఅ
తెరువని నా గుడి తెరిచి దేవివై వెలిసావు
నువు మలిచిన ఈ బ్రతుకు నీకే నైవేద్యం
ఆ..ఆఆ..ఓ..ఓ..ఆ..హ..హ..హ..ఆ..హా..
ఆ..ఆ..ఆ.....
నీ కోసం వెలిసిందీ ప్రేమమందిరం
నీ కోసం విరిసిందీ హౄదయనందనం
నీ కోసం వెలిసిందీ ప్రేమమందిరం
నీ కోసం.....నీ కోసం