Sunday, December 26, 2010

కళ్యాణి--1979

సంగీతం::రమేశ్ నాయుడు
రచన::దాసం గోపాలకృష్ణ
గానం::S.P.బాలు, P.సుశీల

పల్లవి::

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
గుబులు పుట్టిస్తావు ఓ మల్లికా..గుండెలే దోస్తావు ఓ మల్లికా 
పూవుల్లో మేనకవె నవమల్లికా..పూబోణి కానుకవె సిరిమల్లికా 

గుబులు పుట్టిస్తావు ఓ మల్లికా..గుండెలే దోస్తావు ఓ మల్లికా 
పూవుల్లో మేనకవె నవమల్లికా..పూబోణి కానుకవె సిరిమల్లికా 
పూబోణి కానుకవె సిరిమల్లికా

చరణం::1

జవరాలి జడలోనా..ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
జవరాలి జడలోన..జలతారు తారవై
కాముకుల మెడలోన..కర్పూర హారమై
దేహాన్ని..ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
దేహాన్ని పులకించి..మురిసిపోతావు
దేవుణ్ణి పూజించ నోచుకోలేవూ.. 
దేవుణ్ణి పూజించ నోచుకోలేవూ....

జవరాలి జడలోన..జలతారు తారవై
కాముకుల మెడలోన..కర్పూర హారమై
దేహాన్ని పులకించి..మురిసిపోతావు
దేవుణ్ణి పూజించ నోచుకోలేవూ..
గుబులు పుట్టిస్తావు ఓ మల్లికా..గుండెలే దోస్తావు ఓ మల్లికా
పూవుల్లో మేనకవె నవమల్లికా..పూబోణి కానుకవె సిరిమల్లికా 

చరణం::2

సుతిమెత్తగా నీవు తల్పాలు వేస్తావు
సువాసనలతోటి..తానమాడిస్తావు  
ఉల్లాసకేళికి వళ్ళు ఇస్తావు.. 
ఉసిగొలిపి ఉసిగొలిపి..కళ్ళుమూస్తావు

సుతిమెత్తగా నీవు..ఆ ఆ ఆ ఆ ఆ ఆ
సుతిమెత్తగా నీవు..తల్పాలు వేస్తావు
సువాసనలతోటి..తానమాడిస్తావు
ఉల్లాసకేళికి..ఆ ఆ ఆ ఆ ఆ