Wednesday, December 07, 2011

అత్తను దిద్దిన కోడలు--1970


!!!!!
సంగీతం::T.V.రాజు
రచన::కోసరాజు
గానం::S.P.బాలు,S.జానకి

పల్లవి::

రాజశ్రీ::
ఆహ్హా..మల్లెపూవులు..మ్మ్ హా..పిల్లనవ్వులు
మల్లెపూవులు పిల్లనవ్వులు..నీకోసమె..నీకోసమే
ఇటు రావోయి రావోయి రాజా..నారాజ

మల్లెపూవులు పిల్లనవ్వులు..నీకోసమె..నీకోసమే
ఇటు రావోయి రావోయి రాజా..నారాజ

చరణం::1

హరినాథ్::ఉన్నాను చాటుగా..

రాజశ్రీ::ఎక్కడో..?

హరినాథ్::వస్తాను సూటిగా..

రాజశ్రీ::ఎప్పుడో..

రాజశ్రీ::కనిపించవేలనో..

హరినాథ్::అందుకే

రాజశ్రీ::ఉడికింతు వెందుకో..

హరినాథ్::నీ పొందుకే..

రాజశ్రీ::
తనువంతా..గిలిగింతా..
తనువంతా..గిలిగింతా..
ఈ తాపం..మ్మ్..ఈ దాహం..
ఈ తాపం..ఈ దాహం..
ఆపలేనూ..నే ఓపలేను..
ఇక రావోయి..రావోయి రాజా..నారాజ

హరినాథ్::మల్లె పూవులు

రాజశ్రీ::హ్హూ..

హరినాథ్::ఈ పిల్లనవ్విలూ..

రాజశ్రీ::హాహ్హ..

హరినాథ్::నాకోసమే..

రాజశ్రీ::నీ కోసమే..
ఇటు రావోయి..రావోయి రాజా..నారాజ

చరణం::2
రాజశ్రీ::కన్నుల్లో మెరిసెలే..

హరినాథ్::కాటుకా

రాజశ్రీ::మనసుల్లో విరిసెలే..

హరినాథ్::కోరికా..
ప్రేమతో పిలిచెలే..

రాజశ్రీ::ప్రేయసీ..

హరినాథ్::గోముగా అడిగెలే..

రాజశ్రీ::కౌగిలీ..

హరినాథ్::కౌగిలిలో..ఊయలలూ..
బ్రతుకులలో..కిలకిలలూ..
చెలరేగగా..నా మనసూరగా..
ఇక రావేల రావేల రాణీ..నా రాణీ

హరినాథ్::మల్లెపూవులూ..

రాజశ్రీ::హ్హా..పిల్లనవ్వులు

హరినాథ్::హ్హాయ్..నీకోసమే..

రాజశ్రీ::మ్మ్ హు..నీకోసమే..

ఇద్దరు::అహాహహాహహాహా ఆహహా
అహాహహాహహాహా ఆహహా

బంధవ్యాలు--1968



బంధవ్యాలు::1968
సంగీతం::సాలూరి హనుమంత రావ్
రచన::సినారె
గానం::ఘటసాల,P.సుశీల

పల్లవి::
చంద్రమోహన్::

అటు గంటల మోతలు..గణగణా
ఇటు గాజుల సవ్వడి..గలగల
అటు గంటల మోతలు..గణగణా
ఇటు గాజుల సవ్వడి..గలగల
అటు విందునా..ఇటు కందునా..
అటు విందునా..ఇటు కందునా..
ఆ అందం మెరిసెను మిలా మిలా
నను తొందర చేసెను ఎలా ఎలా
ఎలా ఎలా..భళా భళా..
ఎలా ఎలా..భళా భళా..
అటు గంటల మోతలు..గణగణా

చరణం::1
చంద్రమోహన్::

ఓ..ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ
పంచవన్నెలరామచిలకా..పలకనైనా పలుకదేమి
కొమ్మ మాటున కోయిలమ్మా..కూయనైనా కూయదేమి
పలికితే వరహాలు రాలునా..పాడితే పగడాలు రాలునా
పలికితే వరహాలు రాలునా..పాడితే పగడాలు రాలునా
రాలితే అవి మూటకట్టి..కలకాలం దాచుకోనా
కలకాలం దాచుకోనా..

అటు గంటల మోతలు..గణగణా
ఇటు గాజుల సవ్వడి..గలగల
అటు విందునా..ఇటు కందునా..
ఆ అందం మెరిసెను మిలా మిలా
నను తొందర చేసెను ఎలా ఎలా
ఎలా ఎలా..భళా భళా..
ఎలా ఎలా..భళా భళా..
అటు గంటల మోతలు..గణగణా

చరణం::2
చంద్రమోహన్::
ఓ..ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ
చిలిపి సిగ్గు మేలిముసుగై..చెలియమోమూ దాచెనెమో
కలికి నవ్వు వెలికి రాక..పెదవి తెరలో ఒదిగె నేమో

లక్ష్మీ::
దాచితే అది దాగునా..చెయ్ చాచితే చెలరేగునా
దాచితే అది దాగునా..చెయ్ చాచితే చెలరేగునా
నా గుండెలో ఈబండిలో..ఈ కుదుపులు ఊరెకె ఉండునా
ఈ కుదుపులు ఊరెకే..ఉండునా..

ఇద్దరు::
అటు గంటలమోతలు ..గణగణా..
ఇటు గాజుల సవ్వడి..గలగలా
అటు గంటలమోతలు ..గణగణా..
ఇటు గాజుల సవ్వడి..గలగలా
అటు విందునా..ఇటు కందునా..ఆ
అటు విందునా..ఇటు కందునా
ఆ అందం మెరిసెను మిలా మిలా
నను తొందర చేసెను ఎలా ఎలా
ఎలా ఎలా..భళా భళా..హేయ్య్..
ఎలా ఎలా..భళా భళా..
ఎలా ఎలా..భళా భళా..
ఎలా ఎలా..భళా భళా..

బంధవ్యాలు--1968



సంగీతం::సాలూరి హనుమంత రావ్
రచన::సినారె
గానం::ఘటసాల,P.సుశీల

లక్ష్మీ
ఒహో హో ఓహో హో ఓ ఓ ఓ ఓ..
తువ్వాయి తువ్వాయి అవ్వాయి తువ్వాయి
చెప్పవే నీవైన తువ్వాయీ..
మరి..ఎప్పుడే..మృగేది సన్నాయి

లక్ష్మీ::
తువ్వాయి తువ్వాయి అవ్వాయి తువ్వాయి
చెప్పవే నీవైన తువ్వాయీ..
మరి..ఎప్పుడే..మృగేది..సన్నాయి

చంద్రమోహన్::
తువ్వాయి తువ్వాయి అవ్వాయి తువ్వాయి
మాటాడవెందుకే తువ్వాయీ..
రేపో..మాపో..మోగుతుంది సన్నాయి

చరనం::
లక్ష్మీ::
కళ్ళలో కళ్ళుంచీ..తుళ్ళిపడ చేసాడే
కిల్లాడి మాటలతో..వల్లోన వేసాడే
వల్లోన వేసాడే...ఓలమ్మీ..

చంద్రమోహన్::
పన్నీటి వలపులతో..కళ్ళాపు చల్లిందే
ముత్యాల నవ్వులతో..ముగ్గులే వేసిందే..ముగ్గులే వేసిందే

లక్ష్మీ::
చీటికి మాటికి వస్తాడే..
నా చెక్కిట చిటికలు వేస్తాడే
చీటికి మాటికి వస్తాడే..
నా చెక్కిట చిటికలు వేస్తాడే

చద్రమోహన్::
అహ చప్పున దూసుకొపోతాదే..
నను కొప్పున దాచుకొ పోతాదే

లక్ష్మీ::
తువ్వాయి తువ్వాయి అవ్వాయి తువ్వాయి
చెప్పవే నీవైన తువ్వాయీ..
మరి..ఎప్పుడే..మృగేది..సన్నాయి

చరణం::
చంద్రమోహన్::
పొద్దంత నా మదిలో పొచుంది చాలకా
పొద్దంత నా మదిలో పొచుంది చాలకా
అద్దరేతిరి కలలో ముద్దులొలికిస్తాదే
ముద్దులొలికిస్తాదే..

లక్ష్మీ::
ఓ లమ్మీ..
పిట్ట గోడెక్కిననూ..పిలిచింది చాలకా
పిట్ట గోడెక్కిననూ..పిలిచింది చాలకా
ఊర బావి కెలుతుంటే..దారి కడ్డం వస్తాడే
దారికడ్డం వస్తాడే...

చంద్రమోహన్::
ఆచుకు ఆచుకు తందానా..
అది తాతక్కలాడుచు తందానా
ఆచుకు ఆచుకు తందానా..
అది తాతక్కలాడుచు తందానా

లక్ష్మీ::
ఆనిక్కు ఆటెక్కు తందానా
రెండు అందాల డీడిక్కు తందానా
ఆనిక్కు ఆటెక్కు తందానా
రెండు అందాల డీడిక్కు తందానా

ఇద్దరు::
తువ్వాయి తువ్వాయి అవ్వాయి తువ్వాయి
మాటాడవెందుకే తువ్వాయీ..
రేపో..మాపో..మోగుతుంది సన్నాయి
సన్నాయి..సన్నాయి..సన్నాయి..
హహహహహహహ...

బంధవ్యాలు--1968





సంగీతం::సాలూరి హనుమంత రావ్
రచన::సినారె
గానం::ఘటసాల

మంచి తనానికి ఫలితం వంచన
మనిషికి మిగిలేదేమిటి వేదనా..
ఆరని తీరని వేదన ఆవేదన

మంచి తనానికి ఫలితం

అన్నగారి మది వెన్నెల తునక
తమ్ముని మనసే మీగడ తరగ
అన్నగారి మది వెన్నెల తునక
తమ్ముని మనసే మీగడ తరగ
మరదలి మమత మరువపు మొలక
మరదలి మమత మరువపు మొలక
మరి ఏల కలిగెను ఈ కలత

మంచి తనానికి ఫలితం

పచ్చగ ఎదిగే సంసారంలో
చిచ్చులు రేపెను శని ఏదో
సిరులొలికించే పాల కుండలో
గరళము కలిపేను విధి ఏదో..విధి ఏదో

మంచి తనానికి ఫలితం

పాపమనేది పాము వంటిది
బయటపడునురా ఒకనాడు
నిజమనేది నిప్పువంటిది
ౠజువౌలేరా మరునాడు

మంచి తనానికి ఫలితం వంచన
మనిషికి మిగిలేదేమిటి వేదనా
ఆరని తీరని వేదన ఆవేదన
మంచి తనానికి ఫలితం

నిర్దోషి--1967

విషాదము వైరాగ్యం తో పాడిన ఘంటసాల గారి ఈ పాట మనం విని తీరాల్సిందే



సంగీతం::ఘటసాల
రచన::సినారె
గానం::ఘంటసాల

మల్లియలారా మాలికలారా..మౌనముగా ఉన్నారామా కధయే విన్నారా
మల్లియలారా మాలికలారా..మౌనముగా ఉన్నారామా కధయే విన్నారా

జాబిలి లోనే జ్వాలలు రేగే..వెన్నెల లోనే చీకటి మూగే
జాబిలి లోనే జ్వాలలు రేగే..వెన్నెల లోనే చీకటి మూగే
పలుకగ లేక పదములు రాక..పలుకగా లేక పదములే రాక
బ్రతుకే తానే బరువై సాగే
మల్లియలారా మాలికలారా..మౌనముగా ఉన్నారా..మా కధయే విన్నారా

చెదరిన వీణ రవళించేనా..జీవనరాగం చివురించేనా
చెదరిన వీణ రవళించేనా..జీవనరాగం చివురించేనా
కలతలు పోయి వలపులు పొంగి..కలతలే పోయి వలపులే పొంగి
మనసే లోలో పులకించేనా
మల్లియలారా మాలికలారా..మౌనముగా ఉన్నారా..మా కధయే విన్నారా
మల్లియలారా మాలికలారా..మౌనముగా ఉన్నారా..మా కధయే విన్నారా