Friday, June 11, 2010

వయసొచ్చిన పిల్ల--1975


సంగీతం::T.చలపతిరావు  
రచన::దాశరథి
గానం:: S.జానకి
తారాగణం::లక్ష్మీ,మురళిమోహన్,గిరిబాబు,G.వరలక్ష్మి

పల్లవి::

నీవే కావాలిరా నిన్నే కోరానురా  
నీవే నీవే నీవే కావాలిరా 
నేను నిన్నే కోరానురా 
ముస్తాబై ఉన్నాను వస్తావనుకున్నాను 
ముస్తాబై ఉన్నాను వస్తావనుకున్నాను 
ఇంకా రావేమి..రా..ఆ ఆ ఆ
నీవే నీవే నీవే కావాలిరా 

చరణం::1

తుమ్మెదలానని తీయని తేనెలు 
కమ్మని పెదవుల తొనికెనురా  
తుమ్మెదలానని తీయని తేనెలు 
కమ్మని పెదవుల తొనికెనురా 
లేతగులాబి రేకుల వంటి 
లేతగులాబి రేకుల వంటి 
బుగ్గలు పిలిచేనురా 
నీవే నీవే నీవే కావాలిరా 
నేను నిన్నే కోరానురా 
ముస్తాబై ఉన్నాను వస్తావనుకున్నాను 
ముస్తాబై ఉన్నాను వస్తావనుకున్నాను 
ఇంకా రావేమి..రా..ఆ ఆ ఆ  
నీవే నీవే నీవే..కావాలిరా

చరణం::2

ఎవ్వరు తాకని పరువాలు 
నీకే నీకే కానుకలు 
ఎవ్వరు తాకని పరువాలు 
నీకే నీకే కానుకలు 
విరిసిన సొగసులు వెచ్చని 
వలపులు విరిసిన సొగసులు  
వెచ్చని వలపులు అన్నీ నీకేనురా 
నీవే నీవే నీవే..కావాలి రా 
నేను నిన్నే కోరాను రా 
ముస్తాబై ఉన్నాను వస్తావనుకున్నాను 
ముస్తాబై ఉన్నాను వస్తావనుకున్నాను 
ఇంకా రావేమి..రా..ఆ ఆ ఆ 
నీవే నీవే నీవే..కావాలిరా

చరణం::3

నా జడలోన నవ్వే పువ్వులు 
నిన్నే నిన్నే వెతికెనురా 
నా జడలోన నవ్వే పువ్వులు 
నిన్నే నిన్నే వెతికెనురా
కాలి అందియలు ఘల్లు ఘల్లుమని 
కాలి అందియలు ఘల్లు ఘల్లుమని 
నిన్నే పిలిచెనురా 
నీవే నీవే నీవే..కావాలి రా 
నేను నిన్నే కోరానురా 
ముస్తాబై ఉన్నాను వస్తావనుకున్నాను  
ముస్తాబై ఉన్నాను వస్తావనుకున్నాను 
ఇంకా రావేమి..రా..ఆ ఆ ఆ  
నీవే నీవే నీవే కావాలిరా