Lipi Leni Kanti Baasaby rampandu-bellary సంగీతం::రమేష్ నాయుడు రచన::వేటూరి గానం::S.P.బాలు.S.జానకి Film Directed By::Jandyaala తారాగణం::నరేష్,పూర్ణిమ,సుత్తి వీరభద్రరావు,నూతనప్రసాద్,ముచ్చెర్ల అరుణ,రాళ్ళపల్లి,సంగీత,శ్రీలక్ష్మీ,సుత్తివేలు. పల్లవి:: లిపి లేని కంటి బాసా తెలిపింది చిలిపి ఆశా నీ కన్నుల కాటుక లేఖలలో నీ సొగసుల కవితా రేఖలలో ఇలా.. ఇలా చదవనీ.. నీ లేఖని.. ప్రణయ రేఖనీ
బదులైన లేని లేఖా బ్రతుకైన ప్రేమ లేఖా నీ కౌగిట బిగిసిన శ్వాసలతో నీ కవితలు నేర్పిన ప్రాసలతో ఇలా.. ఇలా రాయనీ.. నా లేఖని.. ప్రణయ రేఖనీ లిపి లేని కంటి బాసా..తెలిపింది చిలిపి ఆశా
చరణం::1 అమావాస్య నిశిలో కోటి తారలున్న ఆకాశం వెదుకుతు ఉందీ వేదన తానై విదియ నాటి జాబిలి కోసం వెలుగు నీడలెన్నున్నా వెలగలేని ఆకాశం మ్ము...హూ...లలలలా ఆ...ఆ... లలలలా ఆ...ఆ...ఆ... తనన తనన తనన వెదుకుతు ఉందీ వెన్నెల తానై ఒక్కనాటి పున్నమి కోసం లిపి లేని కంటి బాసా..తెలిసింది చిలిపి ఆశా
చరణం::2 అక్షరాల నీడలలో నీ జాడలు చూసుకునీ ఆ పదాల అల్లికలో నీ పెదవులు అద్దుకునీ నీ కంటికి పాపను నేనై నీ ఇంటికి వాకిలి నేనై గడపదాట లేకా నన్నే గడియవేసుకున్నాను ఘడియైనా నీవు లేక గడపలేక ఉన్నాను
బదులైన లేని లేఖా బ్రతుకైన ప్రేమ లేఖా నీ కౌగిట బిగిసిన శ్వాసలతో నీ కవితలు నేర్పిన ప్రాసలతో ఇలా..ఇలా రాయనీ....నీ లేఖని....ప్రణయ రేఖనీ లిపి లేని కంటి బాసా..తెలిసింది చిలిపి ఆశా
సంగీతం::రమేష్ నాయుడు రచన ::వేటూరి గానకోకిల:: S.జానకి directed by ::Jandhyala. produced by::Ramoji Rao తారాగణం::నరేష్,పూర్ణిమ,సుత్తి వీరభద్రరావు,నూతనప్రసాద్,ముచ్చెర్ల అరుణ,రాళ్ళపల్లి,సంగీత,శ్రీలక్ష్మీ,సుత్తివేలు. !! రాగం: కల్యాణి !! పల్లవి:: మనసా తుళ్ళి పడకే అతిగా ఆశ పడకే అతనికి నీవూ నచ్చావొ లేదో ఆ శుభ ఘడియా వచ్చేనొ రాదో తొందర పడితే అలుసే మనసా తెలుసా
!! మనసా తుళ్ళి పడకే అతిగా ఆశ పడకే !!
ఏమంత అందాలు కలవనీ.. వస్తాడు నిన్ను వలచీ ఏమంత సిరి వుంది నీకనీ.. మురిసేను నిన్ను తలచీ చదువా పదవా ఏముంది నీకు తళుకూ కులుకూ ఏదమ్మ నీకు శృతి మించకే నీవు మనసా
మనసా తుళ్ళి పడకే అతిగా ఆశ పడకే అతనికి నీవూ నచ్చావొ లేదో ఆ శుభ ఘడియా వచ్చేనొ రాదో తొందర పడితే అలుసే మనసా తెలుసా
!! మనసా తుళ్ళి పడకే అతిగా ఆశ పడకే !!
ఏనోము నోచావు నీవనీ.. దొరికేను ఆ ప్రేమ ఫలమూ ఏ దేవుడిస్తాడు నీకనీ.. అరుదైన అంత వరమూ మనసా వినవే మహ అందగాడు తనుగా జతగా మనకంది రాడు కలలాపవే కన్నె మనసా
మనసా తుళ్ళి పడకే అతిగా ఆశ పడకే అతనికి నీవూ నచ్చావొ లేదో ఆ శుభ ఘడియా వచ్చేనొ రాదో తొందర పడితే అలుసే మనసా తెలుసా
!! మనసా తుళ్ళి పడకే అతిగా ఆశ పడకే !! Manasaaa.. Thullipadake.. Athigaa aasa padake Athaniki neevu.. nacchavo ledo.. Aa subha ghadiyaa.. vaccheno raado.. Thondara padithe aluse manasaa thelusaa Yemantha andaalu kalavani Vasthaadu ninnu valachi.. Yemantha siri undi neekani.. Murisenu ninnu thalachi.. Chaduvaa, padhavaa emundi neeku Thaluku, kuluku yedamma neeku.. Sruthi minchake neevu manasaa Ye nomu nochaavu neevani Dorikenu aa prema phalamu Ye devudu isthadu neekani Arudaina antha varamu.. Manasaa, vinave.. maha andagadu Thanugaa jathagaa.. manakandi raadu.. Kalalaapave kanne manasaaa