Monday, May 26, 2008

మైనర్ బాబు --1973



సంగీతం::T.చలపతి రావ్
రచన::ఆచార్య ఆత్రేయ
గానం::P.సుశీల

కారున్న మైనరు
కాలం మారింది మైనరు
ఇక తగ్గాలి మీ జోరూ..
మా చేతికి వచ్చాయి తాళాలు
మా చేతికి వచ్చాయి తాళాలు
" హత్తేరీ "

కారున్న మైనరు
కాలం మారింది మైనరు
ఇక తగ్గాలి మీ జోరూ..
మా చేతికి వచ్చాయి తాళాలు
మా చేతికి వచ్చాయి తాళాలు

రోడ్డంత బాగుంటే మీకంత హుషారు
దాన్నేసినోళ్ళమీదనే ఎక్కించిపోతారు
రోడ్డంత బాగుంటే మీకంత హుషారు
దాన్నేసినోళ్ళమీదనే ఎక్కించిపోతారు
మేమెక్కి కుర్చోంటే మీరేమైపోతారో
మేమెక్కికూర్చోంటే మీరేమైపోతారో
మా పక్కనింత చోటిస్తే చాలంటారు
"హత్తేరీ"

కారున్న మైనరు
కాలం మారింది మైనరు
ఇక తగ్గాలి మీ జోరూ..
మా చేతికి వచ్చాయి తాళాలు
మా చేతికి వచ్చాయి తాళాలు
"హత్తేరీ "

పదునైన కన్నెపిల్ల ఎదురైతే
పల్లికిలించి ప్రేమపాఠలేన్నో చెపుతారు
పదునైన కన్నెపిల్ల ఎదురైతే
పల్లికిలించి ప్రేమపాఠలేన్నో చెపుతారు
పెళ్ళాడమంటేనే గొప్పోళ్ళమంటరూ
పెళ్ళాడమంటేనే గొప్పోళ్ళమంటారు
మా ప్రేమ ముందు బీదోళ్ళు మీరేనంటారు


కారున్న మైనరు
కాలం మారింది మైనరు
ఇక తగ్గాలి మీ జోరూ..
మా చేతికి వచ్చాయి తాళాలు
మా చేతికి వచ్చాయి తాళాలు

నీవేంట నేనొస్తే నీ డబ్బు చూస్తాను
నా వేంత నీవు వొచ్చేవా లోకాన్ని చూస్తావు
లోకాన్ని చూడందే నీవ్ మనిషివి కాలేవూ
లోకాన్ని చూడందే నీవ్ మనిషివి కాలేవూ
మా వాడివైతే కలకాలం బ్రతికుంటావు
"హత్తేరీ "
కారున్న మైనరు
కాలం మారింది మైనరు
ఇక తగ్గాలి మీ జోరూ..
మా చేతికి వచ్చాయి తాళాలు
మా చేతికి వచ్చాయి తాళాలు
"హత్తేరీ"

మైనర్ బాబు --1973



సంగీతం::T.చలపతి రావ్
రచన::C.నారాయణ రెడ్డి
గానం:: ఘంటసాల

మోతిమహల్లో చూసానా
తాజ్ మహల్లో చూసానా
మోతిమహల్లో చూసానా
తాజ్ మహల్లో చూసానా
బేబి బేబి బేబీ
నీ పేరేంటో చెప్పు బేబీ
ఇంటి పేరేంటో చెప్పు బేబీ

పడకగదిలో కలలఒడిలో
పరవశించేవేళలో
యా..యా..యా..లా...లా...
పడకగదిలో కలలఒడిలో
పరవశించేవేళలో
నువు పాలరాతి బొమ్మలాగా
నువు పాలరాతి బొమ్మలాగా
పాన్‌పు చేరిన గుర్తుంది
మాయమైనట్లు గుర్తుంది
ఇంతకు నీ పేరేంటో చెప్పు బేబీ
బేబి బేబి బేబీ
ఇంతకు నీ పేరేంటో చెప్పు బేబీ
బేబి బేబి బేబీ
హా..హయ్..హయ్..హయ్..
హయ్..హయ్..హా..ఆ..ఆ..అహా..
ఇంతకు నీ పేరేంటో చెప్పు బేబీ
బేబి బేబి బేబీ
ఇంతకు నీ పేరేంటో చెప్పు బేబీ
బేబి బేబి బేబీ

నీటిలోపల నీటిదాపుల
వేచివుండే వేళలో
నీటిలోపల నీటిదాపుల
వేచివుండే వేళలో
నువు అందమైన హంసలాగ
అందమైన హంసలాగ
కదలివచ్చిన గుర్తుంది
కన్నుగీటిన గుర్తుంది
ఇంతకు నీ పేరేంటో చెప్పు బేబి
బేబి బేబి బేబీ
నీ పేరేంటో చెప్పు బేబి
బేబి బేబి బేబీ
హా..హయ్..హయ్..హయ్..
హయ్..హయ్..హా..ఆ..ఆ..అహా..
నీ పేరేంటో చెప్పు బేబీ
బేబి బేబి బేబీ
నీ పేరేంటో చెప్పు బేబీ
బేబి బేబి బేబీ