Sunday, January 06, 2013

రెండు జెళ్ళ సీత--1983






సంగీతం::రమేష్‌నాయుడు    
రచన::వేటూరి
గానం::S.P.బాలు,S.జానకి 
తారాగణం::నరేష్,ప్రదీప్,మహాలక్ష్మీ,రాజేష్,సూధాకర్.   

పల్లవి::
కొబ్బరి నీళ్ళ..జలకాలాడి 
ఊఁహూ..ఊఁహూ..ఊఁహూ
కోనసీమ..కోక గట్టి
ఆహా..ఆహా..ఆహా
పొద్దుటెండ..తిలకాలెట్టి
ముద్ద పసుపు..సందెల కొస్తావా
ముద్దు తీర్చే..సందిటి కొస్తావా..ఆఆ
ముద్దు తీర్చే..సందిటి కొస్తావా..ఆఆ

కొబ్బరి నీళ్ళ జలకాలాడి
ఊహూ..ఊహూ..ఊహూ
కోనసీమ..కోక గట్టి
ఊహూ..ఊహూ..ఊహూ
పొద్దుటెండ..తిలకాలెట్టి
ముద్ద పసుపు..సందెల కొస్తాలే
ముద్దు తీర్చే..సందిలి ఇస్తాలే..ఏఏఏ
ముద్దు తీర్చే..సందిలి ఇస్తాలే..ఏఏ 

చరణం::1

ఆకాశ వీణల్లో నేను..ఊఊఊ 
అనురాగమే..పాడుకుంటా
గొంగూర పచ్చట్లో..నేను
ఉల్లిపాయే నంజుకుంటా..స్స్ 
నీరుల్లిపాయే..నంజుకుంటా

ఆకాశ వీణల్లో నేను..ఊఊఊ
అనురాగమే..పాడు కుంటా
శృంగార వీధుల్లో..నేను 
రసనాట్యమే..ఆడుకుంటా 
ప్రేమ రసనాట్యమే..ఆడుకుంటా

మాటివ్వు నాకు..మనసిచ్చుకుంటా
వదిలేస్తే వంకాయ..వండించుకుంటా
Ah....I am sorry...
వంకాయ వంటి కూరయు
పంకజముఖి సీత వంటి భార్యామణి
అన్నారు కదండి..అందుకే అలా పాడాననమాట
ఓ..హో..హా హా 

కొబ్బరి నీళ్ళ..జలకాలాడి
ఊహూ..ఊహూ..ఊహూ
కోనసీమ...కోక గట్టి
ఊహూ..ఊహూ..ఊహూ
పొద్దుటెండ...తిలకాలెట్టి
ముద్ద పసుపు..సందెల కొస్తావా
ముద్దు తీర్చే..సందిటి కొస్తావా..ఆ
ముద్దు తీర్చే..సందిలి ఇస్తాలే..ఏ..ఏ 


చరణం::2 

అమ్మవారి ఎదుట..నేనూ..ఊఊఊ 
నీ కుంకుమే..దిద్దుకుంటా 
నీ కోసమే...కాచుకుంటా
అమ్మతో చెప్పి..నేనూ..ఊఊఊ
అప్పచ్చులే...తెచ్చుకుంటా

అమ్మవారి ఎదుట నేనూ..ఊఊఊ 
నీ కుంకుమే..దిద్దుకుంటా
నీ కోసమే...కాచుకుంటా
అసుర సంధ్యవేళ నేనూ..ఊఊఊ 
ఆలయంలో...వేచి వుంటా
నీ హారతే...అందుకుంటా

మాగాయలోన...పెరుగేసుకుంటా
వదిలెస్తే నా దారి నే చూసుకుంటా
హ్మ్..చూడండి
మాగాయ...మహాపచ్చడి
పెరుగేస్తే మహత్తరి..అది వేస్తే అడ్డ విస్తరి
మానిన్యా మహాసుందరి
అన్నారు...కదండి
అందుకే అలా పాడాననమాట
హాహాహాహా 

కొబ్బరి నీళ్ళ జలకాలాడి
అహా..హా..ఆహా 
కోనసీమ కోక గట్టి
ఓహో..హోహోహో 
పొద్దుటెండ...తిలకాలెట్టి
ముద్ద పసుపు..సందెల కొస్తావా..ఆ
ముద్దు తీర్చే..సందిటి కొస్తావా..ఆఆఆ 
ముద్దు తీర్చే..సందిటి ఇస్తాలే..ఏఏఏ

సుమంగళి--1988



















సంగీతం::సాలూరి వాసురావు
రచన::భువనచంద్ర 
దర్శకత్వం::విజయబాపినీడు 
గానం::S.P.బాలు,P.సుశీల
తారాగణం::కృష్ణంరాజు,జయప్రద. 

పల్లవి::

జీవితం ఓ ప్రయాణం తోడుగా సాగనీ
గుండెలో ప్రేమగీతం నిండుగా మ్రోగనీ
దారిలో మమతలే పూవులై కురియనీ
ఇలానే...ఇలానే
జీవితం ఓ ప్రయాణం తోడుగా సాగనీ
గుండెలో ప్రేమగీతం నిండుగా మ్రోగనీ

చరణం::1

జలతారు మేఘం పరదాలు దాటీ
నీలాల నింగీ నే చేరుకోనా
ఆ తారలన్నీ తళుకాడు వేళా
ఎన్నెన్నొ కలలూ కదలాడవా
ఆ కాంతినై ఇలా ఇలా నేనుండిపోనా
జీవితం ఓ ప్రయాణం తోడుగా సాగనీ
గుండెలో ప్రేమగీతం నిండుగా మ్రోగనీ

చరణ::2

దరిచేరు వేళా చిరుసిగ్గులో
మనసైన వానీ కనుచూపులో
సరికొత్త అందం చిగురించితే
పోగలవ రేఖా కనుగీటితే
ఆ రేఖనై ఇలా ఇలా నే ఒదిగిపోనా

జీవితం ఓ ప్రయాణం తోడుగా సాగనీ
గుండెలో ప్రేమగీతం నిండుగా మ్రోగనీ
దారిలో మమతలే పూవులై కురియనీ
ఇలానే...ఇలానే
జీవితం ఓ ప్రయాణం తోడుగా సాగనీ
గుండెలో ప్రేమగీతం నిండుగా మ్రోగనీ

చందన--1974




సంగీతం::రమేష్‌నాయుడు    
రచన::సినారె
గానం::రమేష్‌నాయుడు    
తారాగణం::జయంతి, సత్యనారాయణ,రాజబాబు,నిర్మల,రంగనాధ్,త్యాగరాజు ,శ్రీధర్   

పల్లవి::

ఓఓఓఓఓఓ..రామ చక్కని..బంగారు బొమ్మా
ఓ రామ చక్కని..బంగారు బొమ్మా..ఆఆ  
నీ రాత...రంపపుకోత ఆయెనా..ఆ         

చరణం::1

నీవారూ నావారూ..నెత్తిన నిప్పులు పోసారే..ఏఏఏ
నెత్తిన నిప్పులు...పోసారే
కత్తులు గుండెల్లో గుచ్చారే..నెత్తుటిలో ముంచెత్తారే
నెత్తుటిలో...ముంచెత్తారే
ముత్యాలబొమ్మా..రతనాలబొమ్మా
మురిపాల బొమ్మా..ఓ ముద్దు గుమ్మా  
ఓఓఓఓఓ..రామ చక్కని...బంగారు బొమ్మా
నీ రాత...రంపపుకోత ఆయెనా..ఆ        

చరణం::2

మాలచ్చిమి లేని ఊరూ..ఊఊఊ..దిక్కుమాలిన వల్లకాడు
దిక్కుమాలిన...వల్లకాడు
పాడుదేవుడు ఏడున్నాడో..ఓఓఓ..పాప మెందుకు మింగిపోడో..ఓఓఓ
పాప మెందుకు...మింగిపోడో
ముత్యాలబొమ్మా..రతనాలబొమ్మా
మురిపాల బొమ్మా..ఓ ముద్దు గుమ్మా  
ఓఓఓఓఓ..రామ చక్కని..బంగారు బొమ్మా
ఓ రామ చక్కని..బంగారు బొమ్మా..ఆఆ 
నీ రాత..రంపపుకోత ఆయెనా..ఆ   

చరణం::3

భూదేవికన్న బిడ్డ..భూమికే బరువాయెనా
భూమికే...బరువాయెనా 
నూరేళ్ళ నిండుబతుకే..భగ్గున మండి బూడిదాయెనా
భగ్గున మండి...బూడిదాయెనా
ముత్యాల బొమ్మా..రతనాలబొమ్మా
మురిపాల బొమ్మా..ఓ ముద్దు గుమ్మా  
ఓ రామ చక్కని..బంగారు బొమ్మా..ఆఆ 
నీ రాత..రంపపుకోత ఆయెనా..ఆ 

Chandana--1974
Music::Ramesh NaayuDu
Lyrics::D.C.Narayana Reddi
Singer's::RamEsh NaayuDu
Cast::Jayanti,Satyanarayana,Raajababu,Nirmala,Ranganaath,Tyagaraaju,Sreedhar

:::

OOOO.. raamachakkani bangaaru bommaa
OOOO.. raamachakkani bangaaru bommaa
nee raasa rampaku kOta AyEnaa

:::1

neevaaru naavaaruu..nettina nippulu pOsaarE
nettina nippulu pOsaarE
kattulu gunDello guchchaarE..nettuTilO munchettaarE
nettuTilO munchettaarE
mutyaala bommaa..ratanaala bommaa..muripaala bommaa..Ompugummaa 

OOOO..raamachakkani bangaaru bommaa 
nee raasa rampaku kOta AyEnaa

:::2

maa lachchimi lEni Uruu..dikkumaalina vallakaaDu
dikkumaalina vallakaaDu
paaDudEvuDu yaaDunnaaDO..paapamenduku mingipODO
paapamenduku mingipODO
mutyaala bommaa..ratanaala bommaa..muripaala bommaa..Ompugummaa

OOOO..raamachakkani bangaaru bommaa
OOOO..raamachakkani bangaaru bommaa
nee raasa rampaku kOta AyEnaa