Saturday, November 12, 2011

కాలమారింది--1972


సంగీతం::S.రాజేశ్వరరావు
రచన::దేవులపల్లి కృష్ణశాస్త్రి
గానం::P.సుశీల
తారాగణం::శోభన్‌బాబు,శారద,గుమ్మడి,అంజలీదేవి,చంద్రమోహన్,సూర్యకాంతం,గీతాంజలి,అల్లురామలింగయ్య.

పల్లవి::

ఓం..నమో నారాయణాయ
ఓం..నమో నారాయణాయ
ఓం..నమో నారాయణాయ
ఆ..శతసహస్ర ఘంటాహ్వానము నా కొరకేనా 
ఆ..శతసహస్ర వీణాగానము నా కొరకేనా
ఆ..శతశత సహస్ర శంపాప్రభా దివ్యమూర్తి నాకొరకేనా
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ   
మందహాస మధుర వదనా శ్రీ సదనా
ఇందు రవి నయన ఫణిశయన..గోవిందా
అరవింద భవ పండిత పదనళిన..గోవిందా 
వందారు మునియోగి బృందా..ముకుందా
బృందార కార్చిత ఇందీవర శ్యామ సుందరా
భక్త ప్రసన్న మందార..భువనాధారా 


ఏదీ..ఏదీ..గంగ కలిగిన పాదకంజాతమేదీ
మెత్తని రమా కరములొత్తిన చరణమేదీ
నలువపుట్టిన నాభి నళినమేదీ ఏదీ 
శ్రీవత్స కౌస్తుభ శ్రీనివాసమ్మేదీ..ఔనుగానీ
కృపాధానీ నీ ఉరమునందేది కలువలరాణీ..ఏది జననీ 
మందహాస మధుర వదనా..శ్రీ సదనా విన్నానుగానీ
కనుగొన్నాను నేడు నను కన్నయ్యవని తెలుసుకున్నాను..నేడు  
నీ సన్నిధినివీడి యింక కదలను..నీ పాదముల క్షణమేని..వదలను 
నీ మూర్తి నా చిత్తమందుండి..పోనీయను..పొనీయను 

ఇంద్రుడు-చంద్రుడు--1989




సంగీతం::ఇళయరాజ
రచన::వేటూరి
గానం::బాలు,జానకి

ఒచ్చంటావో..గిచ్చింటివో..తీసేయ్ నీయమ్మా
నచ్చిన సినిమా చూసేయంగా వోసి నీయమ్మా

నచ్చిన ఫుడ్డు వెచ్చని బెడ్డు సిద్దం రా ఫ్రెండు
తక్కినవన్ని పక్కన పెట్టి పట్టర ఓ పట్టు
వెయ్యర సై అంటు నడుం చుట్టూ ఉడుం పట్టు
చిందెయ్యర రై అంటూ పదం వింటు పదా అంటు
నచ్చిన ఫుడ్డు వెచ్చని బెడ్డు సిద్దం రా ఫ్రెండు
తక్కినవన్ని పక్కన పెట్టి పట్టర ఓ పట్టు

వినరో పిట పిట లాడే పిట్టల కొక్కొరకో
పదరో చిట పట లాడే ఈడుకు దిక్కిదిగో
కసిగా కుత కుత ఉడికే కళ్ళకు విందిదిగో
ఎదలో కిత కిత పెట్టే కన్నెల చిందిదిగో
చెక్కిలి నొక్కుల చిక్కులలో చిక్కని మక్కువ చిక్కులురో
చక్కిలిగింతల తొక్కిడిలో ఉక్కిరి బిక్కిరి తప్పదురో
అక్కర తీర్చే అంగడిరో అందాల అనదాలు అందాలె పదరా

నచ్చిన ఫుడ్డు వెచ్చని బెడ్డు సిద్దం రా ఫ్రెండు
తక్కినవన్ని పక్కన పెట్టి పట్టర ఓ పట్టు
వెయ్యర సై అంటు నడుం చుట్టూ ఉడుం పట్టు
చిందెయ్యర రై అంటూ పదం వింటు పదా అంటు
నచ్చిన ఫుడ్డు వెచ్చని బెడ్డు సిద్దం రా ఫ్రెండు
తక్కినవన్ని

సరిగా వెతికితే సరదా దొరకక తప్పదురో
జతలో అతికితే జరిగే చొరవిక చెప్పకురో
త్వరగా కలబడి ఖానా పీనా కానీరో
మరిగే కలతకు జాణల దాణా కానుకరో
తుళ్ళెను అందం కళ్ళెదురా
ఒల్లని పందెం చెల్లదురా
మల్లెల గంధం చల్లునురా
అల్లరిబంధం అల్లునురా
అత్తరు సోకు కత్తెరలా మొత్తంగా మెత్తంగా కోస్తుంది కదరా


నచ్చిన ఫుడ్డు వెచ్చని బెడ్డు సిద్దం రా ఫ్రెండు
తక్కినవన్ని పక్కన పెట్టి పట్టర ఓ పట్టు
వెయ్యర సై అంటు నడుం చుట్టూ ఉడుం పట్టు
చిందెయ్యర రై అంటూ పదం వింటు పదా అంటు
నచ్చిన ఫుడ్డు వెచ్చని బెడ్డు సిద్దం రా ఫ్రెండు
తక్కినవన్ని పక్కన పెట్టి పట్టర ఓ పట్టు

ఒచ్చంటావో..గిచ్చింటివో..తీసేయ్ నీయమ్మా
నచ్చిన సినిమా చూసేయంగా వోసి నీయమ్మా

ఇంద్రుడు-చంద్రుడు--1989




సంగీతం::ఇళయరాజ
రచన::వేటూరి
గానం::బాలు,P.సుశీల

సంధ్యా రాగపు సరిగమలో తొలి కలయికలో
సాయంకాలపు చలి చలి ఉహల పకపక లో
డో రే మీ రాగల జోరేమి
ద స ద నా ప్రేమ నీ మీద శృతి కలిసిన
సంధ్యా రాగపు సరిగమలో తొలి కలయికలో
సాయంకాలపు చలి చలి ఉహల పకపక లో

చినుకు చినుకు నడుములో చిలకలులికిపడునులే హోయ్
నల్ల కనుల నడుమ లో అలలసుడులు తిరిగేలే

పెదవి పెదవి తడుపులో వలపు మధువు తోలికేలే
తనువు తనువు కుదుపులో తమకమొక్కటి మెరిసేలే

సంధ్యలో తారలగా స్వప్నమైపోకుమా
కన్నెలో సోయగాలు కంటితోనే తాగుమా
హంసలా..ఆ..హాయిగా..ఆ..ఆమని రేయిలా వాలిపో ప్రియ

సంధ్యా రాగపు సరిగమలో తొలి కలయికలో
సాయంకాలపు చలి చలి ఉహల పకపక లో
డో రే మీ రాగల జోరేమి
ద స ద నా ప్రేమ నీ మీద శృతి కలిసిన
సంధ్యా రాగపు సరిగమలో తొలి కలయికలో
సాయంకాలపు చలి చలి ఉహల పకపక లో

ఎదుట పడిన బిడియమే..చమట నుదుట చిలికేలే
వణుకు తొణుకు పరువమే..ఒడికి వయసు కలిపేలే
వలపు పొడుపు కధలలో..చిలిపి ముడులు విడెనులే
మరుల విరుల పొదలలో..మరుడి పురుడు జరిగేలే
తేనెలే దోచుకేల్లె..తుమ్మెదై పోకుమా
గాలికే గంధమిచ్చె..కౌగిలింతే దూరమా
పాటల..ఆ..తోటలో..ఆ..పల్లవే ప్రేమగా పాడుకో ప్రియ

సంధ్యా రాగపు సరిగమలో తొలి కలయికలో
సాయంకాలపు చలి చలి ఉహల పకపక లో
డో రే మీ రాగల జోరేమి
ద స ద నా ప్రేమ నీ మీద శృతి కలిసిన
సంధ్యా రాగపు సరిగమలో తొలి కలయికలో
సాయంకాలపు చలి చలి ఉహల పకపక లో

ఇంద్రుడు-చంద్రుడు--1989




సంగీతం::ఇళయరాజ
రచన::వేటూరి
గానం::బాలు

మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్
మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్

లాలిజో లాలిజో ఊరుకో పాపాయి
పారిపోనీకుండా పట్టుకో నా చేయి
లాలిజో లాలిజో ఊరుకో పాపాయి
పారిపోనీకుండా పట్టుకో నా చేయి
తెలుసా ఈ ఊసు
చెబుతా కల ఊచు
కాపురం చేస్తున్న పావురం ఒకటుంది
ఆలినే కాదంది కాకినే కూడింది
అంతలో ఏమైంది అడగవే పాపాయి
పారిపోనీకుండా పట్టుకో నా చేయి

మాయనే నమ్మింది బోయతో పోయింది
దెయ్యమే పూనిందో రాయిలా మారింది
వెళ్ళే పెడదారిలో ముళ్ళే పొడిచాకనే
తప్పిదం తెలిసింది ముప్పునే చూసింది
కన్నులే విప్పింది గండమే తప్పింది
ఇంటిలో చోటుందా చెప్పవే పాపాయి
పారిపోనీకుండా పట్టుకో నా చేయి

పిల్లలు ఇల్లాలు ఎంతగా ఏడ్చారు
గుండెలో ఇన్నళ్ళు కొండలే మోసారు
నేరం నాదైనా భారం మీపైన
తండ్రినే నేనైనా దండమే పెడుతున్నా
తల్లిగా మన్నించు మెల్లగా దండించు
కాళిలా మారమ్మా కాలితో తన్నమ్మా
బుద్దిలో లోపాలే దిద్దుకో నీవమ్మా