Friday, December 27, 2013

ఆడవాళ్ళూ మీకు జోహార్లు--1981

సంగీతం::K.V. మహదేవన్
రచన::ఆచార్య ఆత్రేయ
గానం::P.సుశీల

పల్లవి::

ఆహా..హా..ఆ..ఆహహా..ఆ హా
లలల..లలల్లలా 
మోజు ముదిరింది..రోజు కుదిరింది
మోజు ముదిరింది..రోజు కుదిరింది
రాజుకుంటూంది లోలోన
అది ఈ రాత్రితోనే చల్లారునా
మోజు ముదిరింది..రోజు కుదిరింది

చరణం::1

నీ కోడె వయసుకే గుమ్మయినా
నే కూడబెట్టినది ఇస్తున్నా
నీ కోడె వయసుకే గుమ్మయినా
నే కూడబెట్టినది ఇస్తున్నా

నన్నెవరేమీ అనుకున్నా..ఆడిపోసుకున్నా
నన్నెవరేమీ అనుకున్నా..ఆడిపోసుకున్నా
నా ఆశ తీర్చుకుంటున్నా..ఆ పైన ఏమైనా
మోజు ముదిరింది..రోజు కుదిరింది

చరణం::2

నీ తొడమీద శిరసెట్టి పడుకుంటే చాలు
నీ కడగంటి చూపులలో కాలినా మేలు
నువ్వు తోడుంటే నేనుంటా నిండుగ నూరేళ్ళు
నీ మాటింటే ఎక్కడికో పోతవి ప్రాణాలు

పాపాలు పుణ్యాలు ఎరుగను
ఈ వయసుతో పోరు పడలేను
పాపాలు పుణ్యాలు ఎరుగను
ఈ వయసుతో పోరు పడలేను

పున్నెమని అనుకుంటే నీకు చెందునంటా
ఇది పున్నెమని అనుకుంటే నీకు చెందునంటా
పాపంగా జమకడితే..నేను మోసుకెళ్తా

మోజు ముదిరింది..రోజు కుదిరింది
మోజు ముదిరింది..రోజు కుదిరింది
రాజుకుంటూంది లోలోన
అది ఈ రాత్రితోనే చల్లారునా
మోజు ముదిరింది..రోజు కుదిరింది
ఆహా హా..ఆ..హ హా హా
లలల..లలల్లలా