Friday, June 07, 2013

బంగారు కుటుంబం--1971


సంగీతం::సత్యం
రచన::ఆరుద్ర
గానం::S.జానకి,B.వసంత
తారాగణం::కృష్ణ,విజయనిర్మల,రాజశ్రీ,రామకృష్ణ,గుమ్మడి,అంజలీదేవి 

పల్లవి::

యవ్వనం చక్కని పువ్వురా
వయసంతా మజా చేయరా..ఆ
అదిపోతే..మరిరాదురా..ఆ                           
యవ్వనం చక్కని పువ్వురా..ఆ
వయసంతా మజా చేయరా..ఆ
అదిపోతే..మరిరాదురా..ఆ                           
యవ్వనం చక్కని పువ్వురా..ఆ

చరణం::1

ప్రతిపువ్వు గుబాళించినా
ప్రతినవ్వు నివాళించదోయ్
ఆ..ప్రతిపువ్వు గుబాళించినా
ప్రతినవ్వు నివాళించదోయ్
నా సొగసే..ఏ..నా సొగసే 
గులాబి అది నీకై వేచెరా..ఆ
యవ్వనం చక్కని పువ్వురా..ఆ                           

చరణం::2

భువిలోనె సుఖం వుందిరా..ఆ 
జవరాలే పసందౌనురా..ఆ
భువిలోనె సుఖం వుందిరా..ఆ 
జవరాలే పసందౌనురా..ఆ
చవిచూస్తే..ఏ,,ఆఆ..చవిచూస్తే 
నిజంగా నను వీడలేవురా..ఆ
యవ్వనం చక్కని పువ్వురా..ఆ                         

చరణం::3

మధువందే నిషా వున్ననూ..ఆ
మనముందు బలాదూరురా..ఆ 
మధువందే నిషా వున్ననూ..ఆ
మనముందు బలాదూరురా..ఆ 
మనసైతే మనసైతే దిగిపోని..ఆ 
బల్ మైకం..మ్మ్..యిస్తారా..ఆ       
యవ్వనం చక్కని పువ్వురా..ఆ
వయసంతా మజా చేయరా..ఆ

కోటలో పాగ--1976



సంగీతం::J.V.రాఘవులు
రచన::G.K.కృష్ణమూర్తి  
గానం::P.సుశీల
తారాగణం::రామకృష్ణ,రాజబాబు,రాజనాల,జయసుధ,కల్పన,శాంతకుమారి,ముక్కామల

పల్లవి::
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
నీవు రావు నిదుర రాదు..నిలవలేనురా
నీవు లేని రేయిలోన..హాయి లేదురా..ఆ
నీవు రావు నిదుర రాదు..నిలవలేనురా
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ..నీవు రావు 

చరణం::1

ఝం తఢాకా..లబ్జలకడి జంజనకడి నకడి నకడి జణకుజణ
ఝం తఢాకా చూడు మల్లా..జంభాలే వేడి ఝల్లా 
ఓరోరి మావయ్యా వగలమారి మావయ్యో..వదిలివెళ్ళ లేవు రేయల్లా
ఝం తఢాకా చూడు మల్లా..జంభాలే వేడి ఝల్లా
ఓరోరి మావయ్యా వగలమారి..మావయ్య వదిలివెళ్ళ లేవు రేయల్లా

చరణం::2

చంగావి కోకా కట్టి చంకలోన బుట్టా పెట్టి
సంతకు వెళతావుంటే చింతతోపు గుంటకాడా
డొంకలోనా నక్కి చూసినావయ్యో..ఓఓఓ
నా చంకలోన బుట్టా..గుంజినావయ్యో
ఝం తఢాకా చూడు మల్లా..జంభాలే వేడి ఝల్లా
ఓరోరి మావయ్యా వగలమారి మావయ్య..వదిలివెళ్ళ లేవు రేయల్లా
లబ్జలకడి జంజనకడి నకడి నకడి జణకుజణ