సంగీతం::ఘంటసాల
రచన::శ్రీ శ్రీ
గానం::ఘంటసాల,P.సుశీల
పల్లవి::
ఊయలలూగీ నా హృదయం తీయని పాట పాడేనే
ఊయలలూగీ నా హృదయం తీయని పాట పాడేనే
తీయని పాట పాడేనే ఊయలలూగీ నా హృదయం
ఊయలలూగీ నా హృదయం తీయని పాట పాడే
చరణం::1
తీవలతో సరాగాల తేలీ, పూవులతో సయ్యాటాడె గాలీ
తీవలతో సరాగాల తేలీ, పూవులతో సయ్యాటాడె గాలీ
ఎలమావి చేరీ చివురాకు మేసీ
ఎలమావి చేరీ చివురాకు మేసీ
కోయిల చనవుగ కూసేనే
ఊయలలూగీ నా హృదయం తీయని పాట పాడే
చరణం::2
రాగసుధాతరంగాల డోలా వేడుకలా విహారాల వేళా
రాగసుధాతరంగాల డోలా వేడుకలా విహారాల వేళా
చిన్నారి చెలియా విన్నాణమరయా
చిన్నారి చెలియా విన్నాణమరయా
నా మది పరవశమాయేనే
ఊయలలూగీ నా హృదయం తీయని పాట పాడే