Friday, August 13, 2010

చీకటి వెలుగులు--1975





సంగీతం::చక్రవర్తి
రచన::C.నారాయణ రెడ్డి
గానం::SP.బాలు,P.సుశీల


ఆమే::- హే..చూసాను పొద్దంతా..
చూసాను పొద్దంతా..వేచాను రాత్రంతా..

అతడు::- కొడపైనచిగురాకు
కోనలోన..నీకోసం..ఓ..బేబి..బేబీ..
ఓ..బేబీ..బేబీ..ఓ..బేబీ..

ఆమే::- ఒక మబ్బు తునకా..నాకురుల వెనుకా
ఊగిందీ..చెవిలో..ఊదిందీ..

అతడు::- ఏమనీ..బేబీ..బేబీ..ఏమనీ..

ఆమే::- నాలాగే కమ్ముకొనే..నీవాడు ఏడనీ
అడిగింది..ఆ మబ్బు తునకా..

అతడు::- ఒక పూలరెమ్మా..అపరంజిబొమ్మా
అడిగిందీ..తానే..అడిగిందీ..

ఆమే::- ఏమనీ..మామ్మజీ..ఏమనీ..
అహా..ఏమనీ..మామ్మజీ..ఏమనీ..

అతడు::- నా చిగురు చెంపలున్న..
నీచెలియ..ఏదనీ..అడిగింది ఆపూలరెమ్మా

అతడు::-హే..చూసాను పొద్దంతా..
వేచాను రాత్రంతా....

ఆమె::- కొండపైన చిగురాకు కోనలోన నీకోసం
మామ్మాజీ హజీ మామ్మాజీ

ఆమె::- ఆకొండశిఖరం..నీలాలగఘనం
అందుకొందీ..నాతో అంటుందీ..

అతడు::- ఆకొండశిఖరం..నీలాలగఘనం
అందుకొందీ..నాతో అంటుందీ...

ఆమే::- హా..ఏమనీ మామ్మాజీ ఏమనీ..

అతడు::- ఏమనీ..బేబీ..బేబీ..ఏమనీ..

ఇద్దరు::- తనలాగే మనవలపే..ఎదిగెదిగీ
పోవాలనీ..అంటుంది ఆకొండశిఖరం

ఆమే::- హే..చూసాను పొద్దంతా..
వేచాను రాత్రంతా..

అతడు::- కొడపైనచిగురాకు
కోనలోన..నీకోసం..ఓ..బేబి..బేబీ..
ఓ..బేబీ..ఏ..హే..ఓ..బేబీ.
.

అమర ప్రేమ--1978













సంగీతం::చక్రవర్తి
రచన::వీటూరి
గానం::S.P.బాలు,
తారాగణం::కమల హాసన్,జరీనా,సత్యనారాయణ,నాగభూషణం, రాజబాబు,రమాప్రభ

పల్లవి::

బాల పావురం..ఆ..ఒక గూడు కడదామా
బాల పావురం..ఆ..ఒక గూడు కడదామా
నింగిలాగే నాతో రారాదా..రారాదా..ప్రేమించుకొందామా

బాల పావురం..ఆ..ఒక గూడు కడదామా
నింగిలాగే నాతో రారాదా..రారాదా..ప్రేమించుకొందామా
బాల పావురం..ఆ..ఒక గూడు కడదామా

చరణం::1

బాధలే వచ్చినా..ఓర్చుకొందామూ
బ్రతుకులో ఆనందం..పంచుకొందామూ..నవ్వుకొంటునే

బాధలే వచ్చినా..ఓర్చుకొందామూ
బ్రతుకులో ఆనందం..పంచుకొందామూ..నవ్వుకొంటునే
ఇద్దరమొకటై ఉందామూ

బాల పావురం..ఆ..ఒక గూడు కడదామా
ఈ వసంతకాలం ఈ పరువం నీ ప్రణయం
పులకించే నా హృదయం..
బాల పావురం..ఆ..ఒక గూడు కడదామా

చరణం::2

జీవితం పున్నమిగ..చేసుకొందామూ
నవ్వుతూ ఇలాగే..ఏకమౌదామూ..ఊ..ఆడుకొందామూ

రమ్మనీ మృత్యువూ..చేరువైతేనూ
నవ్వుతూ ఇలాగే..కలసిపోదామూ..ఊ..కరిగిపోదామూ
అమరము కాదా మన ప్రేమా..

బాల పావురం..ఆ..ఒక గూడు కడదామా
నింగిలాగే నాతో రారాదా..రారాదా..ప్రేమించుకొందామా
బాల పావురం..ఆ..ఒక గూడు కడదామా

AmaraPrema--1978 
Music::Chakravarti
Lyrics::Veeturi
Singer::S.P.Baalu
Cast::Kamal,Jariina,Satyanarayana,Nagabhushanam,Rajababu,Ramaprabha.

:::

baala paavuram..aa..oka gooDu kaDadaamaa
baala paavuram..aa..oka gooDu kaDadaamaa
ningilaagE naatO raaraadaa..raaraadaa..prEminchukondaamA

baala paavuram..aa..oka gooDu kaDadaamaa
ningilaagE naatO raaraadaa..raaraadaa..prEminchukondaamA
baala paavuram..aa..oka gooDu kaDadaamaa

:::1

baadhalE vachchinaa..OrchukondaamU
bratukulO aanandam..panchukondaamU..navvukonTunE

baadhalE vachchinaa..OrchukondaamU
bratukulO aanandam..panchukondaamU..navvukonTunE
iddaramokaTai undaamU

baala paavuram..aa..oka gooDu kaDadaamaa
ii vasantakaalam ii paruvam nee praNayam
pulakinchE naa hRdayam..
baala paavuram..aa..oka gooDu kaDadaamaa
:::2

jeevitam punnamiga..chEsukondaamU
navvutU ilaagE..EkamoudaamU..U..ADukondaamU

rammanii mRtyuvU..chEruvaitEnU
navvutU ilaagE..kalasipOdaamU..U..karigipOdaamU
amaramu kaadaa mana prEmaa..

baala paavuram..aa..oka gooDu kaDadaamaa
ningilaagE naatO raaraadaa..raaraadaa..prEminchukondaamA
baala paavuram..aa..oka gooDu kaDadaamaa

అమరప్రేమ--1978



















సంగీతం::చక్రవర్తి
రచన::వీటూరి
గానం::S.P.బాలు,P.సుశీల
తారాగణం::కమల హాసన్,జరీనా,సత్యనారాయణ,నాగభూషణం, రాజబాబు,రమాప్రభ

పల్లవి::

బుజ్జిబాబు కావాలా..బుల్లిపాప కావాలా 
వలపు పంట పండాల..ఇంట వెలుగు నిండాలా
చిన్నారి పాపాయి దోగాడుతుంటే 
కిలకిల నవ్వుల పూవుల వానా
గలగల సందడి జీవితానా

బుజ్జిబాబు కావాలా..బుల్లిపాప కావాలా 
వలపు పంట పండాల..ఇంట వెలుగు నిండాలా
చిన్నారి పాపాయి దోగాడుతుంటే 
కిలకిల నవ్వుల పూవుల వానా
గలగల సందడి జీవితానా 

చరణం::1

అమ్మాయిగారికి త్వరలోనే అవుతాయి వేవిళ్ళు
అవుతాయి వేవిళ్ళు..చింతకాయలు..హాహాహా
మావిడికాయలూ..హాహాహా..
చింతకాయలు మావిడికాయలు..తింటారు చిరుతిళ్ళు
తింటారు చిరుతిళ్ళు

అబ్బాయి పాట్లింక..చూడాలి రాత్రిళ్ళు
అబ్బాయి పాట్లింక..చూడాలి రాత్రిళ్ళు
పక్కపైనే పరవళ్ళు..దిళ్ళతోనే కౌగిళ్ళు
రుసరుస లాడుతు ఆ విరహాలు
రుసరుస చూపుల చిరుకోపాలు
అమ్మమ్మా..ఆ..ఊలులులు..అమ్మమ్మా..ఆ ఆ ఆ
అమ్మమ్మా..ఓలోలే..అమ్మమ్మా..హ్హ హ్హ హ్హ 

బుజ్జిబాబు కావాలా..బుల్లిపాప కావాలా 
వలపు పంట పండాల..ఇంట వెలుగు నిండాలా
చిన్నారి పాపాయి దోగాడుతుంటే 
కిలకిల నవ్వుల పూవుల వానా
గలగల సందడి జీవితానా 

చరణం::2

నెలలే నిండి కలలే పండి..పాపాయే పుడతాడూ
పాపాయే పుడతాడూ
నీ వేడి ముద్దులూ..హాహాహా..తనవే నంటూ
ఆహా..వేడి ముద్దులు..తనవే అంటూ
నాతో పోటీకొస్తాడు..నాతో పోటీ కొస్తాడు

అర్ధరాతిరి వీలుచూసి..ఇద్దరమొకటై కలిసుంటే
అర్ధరాతిరి వీలుచూసి..ఇద్దరమొకటై కలిసుంటే
కారు కారుమని ఏడుస్తాడు..లేచి గలాట చేస్తాడు

సరసం గిరిసం గోవిందా..అబ్భాయ్ పొగరే అణిగిందా
అమ్మమ్మా..ఆ..ఓలోలే..అమ్మమ్మామ్మా..ఆ ఆ ఆ
అమ్మమ్మా..ఆ..అలెలెలెలె..అమ్మమ్మామ్మా..ఆ ఆ ఆ 

బుజ్జిబాబు కావాలా..బుల్లిపాప కావాలా 
వలపు పంట పండాల..ఇంట వెలుగు నిండాలా
చిన్నారి పాపాయి దోగాడుతుంటే 
కిలకిల నవ్వుల పూవుల వానా
గలగల సందడి జీవితానా 

AmaraPrema--1978
Music::Chakravarti
Lyrics::Veeturi
Singer's::S.P.Baalu,P.Suseela .
Cast::Kamalahaasan,Jarinaa,Satyanarayana,Naagabhushanam,Rajababu,Ramaprabha.

:::

bujjibaabu kaavaalaa..bullipaapa kaavaalaa 
valapu panTa panDaala..inTa velugu ninDaalaa
chinnaari paapaayi dOgaaDutunTE 
kilakila navvula poovula vaanaa
galagala sandaDi jeevitaanaa

bujjibaabu kaavaalaa..bullipaapa kaavaalaa 
valapu panTa panDaala..inTa velugu ninDaalaa
chinnaari paapaayi dOgaaDutunTE 
kilakila navvula poovula vaanaa
galagala sandaDi jeevitaanaa 

:::1

ammaayigaariki twaralOnE avutaayi vEviLLu
avutaayi vEviLLu..cintakaayalu..haahaahaa
maaviDikaayaluu..haahaahaa..
chintakaayalu maaviDikaayalu..tinTaaru chirutiLLu
tinTaaru chirutiLLu

abbaayi paaTlinka..chUDaali raatriLLu
abbaayi paaTlinka..chUDaali raatriLLu
pakkapainE paravaLLu..diLLatOnE kougiLLu
rusarusa laaDutu aa virahaalu
rusarusa chUpula chirukOpaalu
ammammaa..aa..Ulululu..ammammaa..aa aa aa
ammammaa..OlOlE..ammammaa..hha hha hha 

bujjibaabu kaavaalaa..bullipaapa kaavaalaa 
valapu panTa panDaala..inTa velugu ninDaalaa
chinnaari paapaayi dOgaaDutunTE 
kilakila navvula poovula vaanaa
galagala sandaDi jeevitaanaa 

:::2

nelalE ninDi kalalE panDi..paapaayE puDataaDuu
paapaayE puDataaDuu
nee vEDi muddulU..haahaahaa..tanavE nanTU
aahaa..vEDi muddulu..tanavE anTU
naatO pOTiikostaaDu..naatO pOTii kostaaDu

ardharaatiri veeluchUsi..iddaramokaTai kalisunTE
ardharaatiri veeluchUsi..iddaramokaTai kalisunTE
kaaru kaarumani EDustaaDu..lEchi galaaTa chEstaaDu

sarasam girisam gOvindaa..abbhaay pogarE aNigindaa
ammammaa..aa..OlOlE..ammammaammaa..aa aa aa
ammammaa..aa..alelelele..ammammaammaa..aa aa aa 

bujjibaabu kaavaalaa..bullipaapa kaavaalaa 
valapu panTa panDaala..inTa velugu ninDaalaa
chinnaari paapaayi dOgaaDutunTE 
kilakila navvula poovula vaanaa

galagala sandaDi jeevitaanaa 

మల్లెపువ్వు--1978




సంగీతం::చక్రవర్తి
రచన::ఆరుద్ర
గానం::చక్రవర్తి


పల్లవి::

మాలీష్..మాలీష్

అరె హా హా..మాలీష్
అరె హే హే హో హా మాలీష్
రాందాస్ మాలీష్..నిమ్నూన్ మాలీష్
చాలంజీ మాలీషు..చాన్నాళ్ళ సర్వీసు
హెయ్..చాలంజి మాలీషు..చాన్నాళ్ళ సర్వీసు
రాందాసు మాలీషండోయ్..మాలీష్
మాలీష్..మాలీష్..మాలీష్..మాలీష్. మా మా

చరణం::1

అరె హా అరె హో
మాలీషు చేస్తుంటె బాలీసు మీద నువ్వు తొంగున్న హాయుంటది
అరెహా తల మీద చెయ్యేసి జుంబాంబ దరువేస్తె డుం..డుం..డుం
తల మీద చెయ్యేసి జుంబాంబ దరువేస్తె రంబొచ్చి రమ్మంటదీ
అరె ఒళ్ళంత జిల్లంటదీ..హా..ఓహో..ఒ అనిపిస్తదీ
అరె ఒళ్ళంత జిల్లంటదీ..షమ్మ..ఓహో..ఒ అనిపిస్తదీ
అమ్మ తోడు..నిమ్మ నూనే..అంట గానే..తస్సదియ్యా
అమ్మ తోడు నిమ్మ నూనే..అంట గానే తస్సదియ్యా
అబ్బోసి తబ్బిబ్బులే..మాలీష్

మాలీష్..మాలీష్
రాందాస్ మాలీష్..నిమ్నూన్ మాలీష్

చరణం::2

అరె హో..తల బిరుసు బుఱ్ఱైన మన చేయి పడగానె మహ తేలికైపోతదీ
అరె హా..పొద్దంత పని చేసి ఒళ్ళంత బరువైతె మాలీషు మందౌతదీ
అరె సంపంగి నూనుంది రాజ్జా..అరె సమ్మ సమ్మ గుంటాది రాజా
అరె సంపంగి నూనుంది రాజా..మహ సమ్మ సమ్మ గుంటాది రాజా
హ చెవిలోన..చమురేసీ..చెయి మూసి..గిలకొడితే..హమ్మా
హబ్బ..చెవిలోన చమురేసి..చెయి మూసి గిలకొడితే సంగీతమినిపిస్తదీ
సా..సరి..గా..అ మా..పా..మద..పని..మసా
సరిగమపదనిని..సరిగమపదనిని..సా


అరె హో మాలీష్..అరె హో మాలీష్
హెయ్..చాలంజి మాలీషు..చాన్నాళ్ళ సర్వీసు
రాందాసు మాలీషండోయ్..మాలీష్..మాలీష్
రాందాస్ మాలీష్..నిమ్నూన్ మాలీష్

ఇల్లు-ఇల్లాలు--1972







సంగీతం::K.V.మహాదేవన్
రచన::ఆరుద్ర
గానం::P.సుశీల


పల్లవి::


ఓ..హో..ఓ..హో..ఓ..హో...ఆ..హా..ఆహా
ఆకు పచ్చని చేలు అల్లోనేరెల్లో
ఆపైన పైరగాలి అల్లోనేరెల్లో
అందాల మాపల్లె అల్లోనేరెల్లో
ఆనాటి రెపల్లె అల్లోనేరెల్లో
ఆకు పచ్చని చేలు అల్లోనేరెల్లో
ఆపైన పైరగాలి అల్లోనేరెల్లో

చరణం::1


నీలిమబ్బుల్లోన కనిపించేవి
బాలకృష్ణుని మేని నిగనిగలే

నీలిమబ్బుల్లోన కనిపించేవి
బాలకృష్ణుని మేని నిగనిగలే
అల్లరిగాలిలో..వినిపించేవి

అల్లరిగాలిలో..వినిపించేవి
పిల్లనగ్రోవి..నవ్వడులే
పాల పొదుగులా..ఆలమందలే

పాల పొదుగులా..ఆలమందలే
ఊరించే తీయని కోరికలే

ఆకు పచ్చని చేలు అల్లోనేరెల్లో
ఆపైన పైరగాలి అల్లోనేరెల్లో

చరణం::2


తీయమావిళ్ళ తొలకరిపూతలూ
తెలుగు కన్నియల తొలిసిగ్గులే

తీయమావిళ్ళ తొలకరిపూతలూ
తెలుగు కన్నియల తొలిసిగ్గులే
చిలిపిగపాడే..కలికి కోయిలలూ

చిలిపిగపాడే..కలికి కోయిలలూ
పలికేది నెరజాణ భావాలే
ఏటితరగలా..నీటినురగలా

ఏటితరగలా..నీటినురగలా
మెరిసేవి..పరువాల..చిరునవ్వులే

ఆకు పచ్చని చేలు అల్లోనేరెల్లో
ఆపైన పైరగాలి అల్లోనేరెల్లో
అందాల మాపల్లె అల్లోనేరెల్లో
ఆనాటి రెపల్లె అల్లోనేరెల్లో
ఓహో..ఓ..ఓ...ఓ..ఓహో..ఓ..ఓహో
ఓహో..ఓ..ఓ...ఓ..ఓహో..ఓ..ఓహో

ఇల్లు-ఇల్లాలు--1972























సంగీతం::KV.మహాదేవన్
రచన:;ఆరుద్ర
గానం::P.సుశీల


ఆలుమగల అన్యోన్యం..అంతులేని ఆనందం
పండిన వలపులా దాపత్యం..పాలూ తేనెల మాధుర్యం..2

మగని మనసు తెలిసీ..మసిలే మగువే గౄహలక్ష్మీ
మగువమాట తీర్చగలిగే..మగడె ఇలవేల్పూ
మమతలోన లేని మైకం..మధువులో లేదూ..
కోరుకొన్న మమతలుంటే..కొరతలే రావూ..
ఆలుమగల అన్యోన్యం..అంతులేని ఆనందం
పండిన వలపులా దాపత్యం..పాలూ తేనెల మాధుర్యం

సేవలందున దాసిగా..భావమెరిగిన మంత్రిగా..
వలపులందున రంభగా..వనిత మెలగాలీ..
జీవితమ్మున చెలిడుగా..చేయివీడని సఖుడుగా..
మరులుగొలిపే మరుడుగా..మగడు మెలగాలీ..

మల్లెకన్న తెల్లనైనది..మగని దరహాసం..
మంచుకన్న చల్లనైనదీ..మగువ సంతోషం..
నవ్వులుపూచే నందనవనమే..చక్కని సంసారం..
నందనంలో కల్పతరువే..నాతి సౌభాగ్యం...
ఆలుమగల అన్యోన్యం..అంతులేని ఆనందం
ఆలుమగల అన్యోన్యం..అంతులేని ఆనందం
పండిన వలపులా దాపత్యం..పాలూ తేనెల మాధుర్యం

ఆలుమగలా..అన్యోన్యం.....