Thursday, September 16, 2010

ఒకరాధా-ఇద్దరుకృష్ణులు--1986





పాట ఇక్కడ వినండీ

సంగీతం::ఇళయరాజ
రచన::వేటూరి
గానం::S.P.బాలు,S.జానకి


ఆమె::ఆ ఆ ఆ ఆ హ్హా హ్హా హ్హా ఆ ఆ
లలలలల ఆహా..లలలలల
మధుర మురళి హృదయ రవళి
అధర సుధల యమున పొరలి పొంగె యద పొంగె
ఈ బృందా విహారాలలోనా నా అందాలు నీవే రా కన్నా
ఈ బృందా విహారాలలోనా నా అందాలు నీవే రా కన్నా

అతడు::మధుర మురళి హృదయ రవళి
యదలు కలుపు ప్రణయ కడలి సాగే సుడి రేగే
ఈ బృందా విహారాలలోనా ఎవరున్నారు రాధమ్మ కన్నా
ఈ బృందా విహారాలలోనా ఎవరున్నారు రాధమ్మ కన్నా


ఆమె::గోధూళి వేళల్లో గోపెమ్మ కౌగిట్లో
లేలేత వన్నే చిన్నే దోచే వేళల్లో

అతడు::పున్నాగ తోటల్లో సన్నాయి సందిట్లో
నాజూకులన్నీ నాకు దక్కేవేళల్లో

ఆమె::పగలో అవతారం రాత్రో శృంగారం
ఎదలో తారంగం శ్రీవారికీ

అతడు::రాగాలెన్నైనా వేణువు ఒకటేలే
రూపాలెన్నైనా హృదయం ఒకటేలే

ఆమె::నాదే నీ గీతము ఇక నీదే ఈ సరసాల సంగీతం

అతడుమధుర మురళి హృదయ రవళి
యదలు పలకు ప్రణయ కడలి సాగే సుడి రేగే

ఆమె::ఈ బృందా విహారాలలోనా నా అందాలు నీవే రా కన్నా
అతడు::ఈ బృందా విహారాలలోనా ఎవరున్నారు రాధమ్మ కన్నా


ఓ ఓ ఓ ఓ ఓ ..లలల్లలా..
అతడు::హేమంత వేళల్లో లే మంచు పందిట్లో
నా వీణ ఉయ్యాలూగే నీలో ఈనాడే

ఆమె::కార్తీక వెన్నెల్లో ఏకాంత సీమల్లో
ఆరాధనేదో సాగే అన్నీ నీవాయే

అతడు::ముద్దే మందారం మనసే మకరందం
సిగ్గే సింధూరం శ్రీదేవికీ

ఆమె::అందాలెన్నైనా అందేదొకటేలే
ఆరూ ఋతువుల్లో ఆమని మనదేలే

అతడు::పాటే అనురాగము మన బాటే
ఓ అందాల అనుబంధం

ఆమె::మధుర మురళి హృదయ రవళి
అధర సుధల యమున పొరలి పొంగె యద పొంగె

అతడు::ఈ బృందా విహారాలలోనా ఎవరున్నారు రాధమ్మ కన్నా
ఆమె::ఈ బృందా విహారాలలోనా నా అందాలు నీవే రా కన్నా


Oka Radha Iddaru Krishnulu--1985
Music::Ilayaraja
Lyricis::Veturi Sundara Ramamurthy
Singer's::S.P.Balu, S.Janaki

:::

aa aa aa aa hhaa hhaa hhaa aa aa
lalalalala aahaa..lalalalala

Madhura murali hrudaya ravali
Adhara sudhala yamuna porali ponge yadha ponge
Ee brundha viharalalona na andalu neevera kanna

Madhura murali hrudaya ravali
Yadalu kalupu pranaya kadali saage sudi rege
Ee brundha viharalalona evarunnaru radhammakanna

:::1

Godhooli velallo gopamma kaugitlo
Leletha vanne chinne doche velallo

Punnaga thotallo sannayi sandhitlo
Najukulanni naake dhakke vellalo

Pagalo avatharam rathro srungaram
Yadhalo tharangam sri variki

Ragalennaina venuvu okatele
Roopalennaina hrudayam okatele

Naadhe nee geethamu ika neede ee sarasala sangeetham..


Madhura murali hrudaya ravali
Yadalu kalupu pranaya kadali saage sudi rege

Ee brundha viharalalona na andalu neevera kanna

:::2
lalalalala aahaa..lalalalala
Hemantha velallo lemanchu panditlo
Na veena uyyalooge neelo eenade

Kartheeka vennello yekantha seemallo
Aaradhanedo sage anni neevaye

Mudhe mandaram manase makarandam
Sigge sindhooram sri deviki

Andhalennaina andhedokatele
Aaru ruthuvullo amani manadhele
Pate anuragamu mana baate o andala anubandham

Madhura murali hrudaya ravali
Adhara sudhala yamuna porali ponge yadha ponge

Ee brundha viharalalona evarunnaru radhammakanna

Ee brundha viharalalona na andalu neevera kanna

ఒకరాధా-ఇద్దరుకృష్ణులు--1986


పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

సంగీతం::ఇళయరాజ
రచన::వీటూరిసుందరరామమూర్తి 
గానం::కమల్‌హాసన్,బృందం
తారాగణం::కమల్‌హాసన్,శ్రీదేవి,రావ్‌గోపాల్‌రావ్,కైకాల.సత్యనారాయణ,అల్లురామలింగయ్య,నూతన్‌ప్రసాద్,
అన్నపూర్ణ,రాజేంద్రప్రసాద్,సుత్తివీరభద్రారావు.

పల్లవి::

అతడు::రాధా..ఎందుకింత బాధా..

వేయ్ వేయ్ తకధిమి చేయ్ చేయ్ కథకళి
టక్కుముక్కూ తాళమేయ్..హై హై..

ముయ్ ముయ్ తలుపులు వేయ్ వేయ్ దరువులు
లక్కుముక్కూ గొళ్ళమేయ్.. హై హై

వాట్టం చూస్తే ఘుమఘుమా..వర్ణం చూస్తే సరిగమా
వాట్టం చూస్తే ఘుమఘుమా..వర్ణం చూస్తే సరిగమా

వేయ్ వేయ్ తకధిమి చేయ్ చేయ్ కథకళి
టక్కుముక్కూ తాళమేయ్..హై హై..

ముయ్ ముయ్ తలుపులు వేయ్ వేయ్ దరువులు
లక్కుముక్కూ గొళ్ళమేయ్.. హై హై

అతడు::అహ్హా...

ఆమె::నోర్మూయ్..

కోరస్::హై హై

అతడు::ముయ్యమొహేయ్...

ఆమె::వంకాయ్::
కోరస్::హై హై

చరణం::1

అతడు:: కాలేజికొచ్చి కజ్జాలు పెడితే
మారేజి చేసి పంపించనా

కోరస్::నీ జోరుకాస్త తగ్గించనా

అతడు::ఒహోయ్..క్లాసులాగ పై పోజు కొడితే
రాగింగు చేసి కవ్వించనా

కోరస్::వడ్డించిదారి పట్టించనా

అతడు::మాట్నీ..మిడిసోడాబుడ్డి
బాక్సిలే చేప్పేయ్యనా
సెక్స్సీ లేడి నువ్వే జోడి నిన్ మిస్ చేసేయ్యనా

అతడు::చిలిపి ముద్దులా దస్కత్..
కోరస్:: హై హై

అతడు::వలపు ఓటులూ నాకే
కోరస్:: హై హై

అతడు::చిలిపి ముద్దులా దస్కత్..
కోరస్:: హై హై

అతడు::వలపు ఓటులూ నాకే
కోరస్:: హై హై
అతడు::చిలకల కొలికివి మదనుడి మొలకవి
రావే అమ్మడూ..

అతడు::వేయ్ వేయ్ తకధిమి చేయ్ చేయ్ కథకళి
టక్కుముక్కూ తాళమేయ్..హై హై..

అతడు::ముయ్ ముయ్ తలుపులు వేయ్ వేయ్ దరువులు
లక్కుముక్కూ గొళ్ళమేయ్.. హై హై

చరణం::2

అతడు::చాలించు నిగ్గు నా జన్మహక్కు
నీ బుగ్గ నొక్కితీరాలిలే

కోరస్:: ఆ మొగ్గలన్ని రాలాలిలే

అతడు::తగ్గించు టెక్కు నాకున్న మొక్కు
నీ ముక్కుతాడు వెయ్యాలిలే

కోరస్:: ఆ ముద్దు హద్దు దాటాలిలే

అతడు::స్వీటీ..బ్యూటీ..నాటీ..హాటీ..
మాట్నీకే తోడవ్వనా..
సెక్స్సీ..బుక్స్..లుక్స్..ట్రిక్కుసు..మాష్టర్‌లా నేర్పించనా

అతడు::కుక్కపిల్లలా..అనకే..
కోరస్::వౌ వౌ వౌ

అతడు::కుర్రపిల్లలా..అనవే..
కోరస్:: లవ్ లవ్

అతడు::కుక్కపిల్లలా..అనకే..
కోరస్::వౌ వౌ వౌ

అతడు::కుర్రపిల్లలా..అనవే..
కోరస్:: లవ్ లవ్

అతడు:: బోర్ బోర్ చదువులు..జోర్ జోర్ జంటలు
లైఫే జాలిలే..

అతడు::వేయ్ వేయ్ తకధిమి చేయ్ చేయ్ కథకళి
టక్కుముక్కూ తాళమేయ్..హై హై..

అతడు::ముయ్ ముయ్ తలుపులు వేయ్ వేయ్ దరువులు
లక్కుముక్కూ గొళ్ళమేయ్.. హై హై

అతడు::వాట్టం చూస్తే ఘుమఘుమా..వర్ణం చూస్తే సరిగమా
వాట్టం చూస్తే ఘుమఘుమా..వర్ణం చూస్తే సరిగమా

అతడు::వేయ్ వేయ్ తకధిమి చేయ్ చేయ్ కథకళి
టక్కుముక్కూ తాళమేయ్..హై హై..

అతడు::ముయ్ ముయ్ తలుపులు వేయ్ వేయ్ దరువులు
లక్కుముక్కూ గొళ్ళమేయ్.. హై హై

కోరస్:: రాధా..
ఆమె:: ఛీ
కోరస్:: ఎందుకింత బాధా..

అతడు::రాధా..
ఆమె:: ఛీ..పో..
కోరస్::ఎందుకింత బాధా..

అతడు::రాధా..
ఆమె::పో..పో..
కోరస్::ఎందుకింత బాధా..

అతడు::రాధా..
ఆమె:: ఛీ..పో..
అతడు::రాధా..