VIDEO
సంగీతం::S. P. కోదండపాణి రచన::వీటూరిసుందరరామమూర్తి గానం::ఘంటసాల
Film Directed By::K.HemaambharadhgaraRao
తారాగణం:: N.T.రామారావు,సావిత్రి,పద్మనాభం,గీతాంజలి,చిత్తూరు నాగయ్య,హేమలత,నిర్మలమ్మ,రాజనాల,S.V.రంగారావు.అంజలిదేవి,రాజబాబు,గుమ్మడి,కృష్ణకుమారి.
పల్లవి::
ఆలయాన వెలసిన ఆ దేవుని రీతిఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి చరణం::1
పతిదేవుని మురిపించే వలపుల వీణాజీవితమే పండించే నవ్వుల వానా కష్ట సుఖాలలో తోడూ నీడగా తల్లిని మరిపించే ఇల్లాలి ఆదరణ కష్ట సుఖాలలో తోడూ నీడగా తల్లిని మరిపించే ఇల్లాలి ఆదరణ మగువేగా మగవానికి మధురభావనా ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి చరణం::2
సేవలతో అత్తమామ సంతసించగా పదిమందిని ఆదరించు కల్పవల్లిగా సేవలతో అత్తమామ సంతసించగా పదిమందిని ఆదరించు కల్పవల్లిగా తనయుని వీరునిగా పెంచే తల్లిగా సతియే గృహసీమను గాచే దేవతగా తనయుని వీరునిగా పెంచే తల్లిగా సతియే గృహసీమను గాచే దేవతగా సృష్టించెను ఆ దేవుడు తనకు మారుగా ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి
VIDEO సంగీతం::S. P. కోదండపాణి రచన:: వీటూరిసుందరరామమూర్తి
గానం::ఘంటసాల,P.సుశీల
Film Directed By::K.HemaambharadhgaraRao
తారాగణం:: N.T.రామారావు,సావిత్రి,పద్మనాభం,గీతాంజలి,చిత్తూరు నాగయ్య,హేమలత,నిర్మలమ్మ,రాజనాల,S.V.రంగారావు.అంజలిదేవి,రాజబాబు,గుమ్మడి,కృష్ణకుమారి.
పల్లవి::
NTR::::కన్నుల్లో మిసమిసలు కనిపించనీ గుండెల్లో గుసగుసలు వినిపించనీ కన్నుల్లో మిసమిసలు కనిపించనీ సావిత్రీ::నీ చూపుతో నన్ను ముడివేయకు ఈ పూలు వింటాయి సడిచేయకు నీ చూపుతో నన్ను ముడివేయకుచరణం::1
సావిత్రీ::సెలయేరు నవ్వుతుంది చిరుగాలి చూస్తుంది నాపైట చెంగులాగి కవ్వించకు సెలయేరు నవ్వుతుంది చిరుగాలి చూస్తుంది నాపైట చెంగులాగి కవ్వించకు NTR::అనువైనవేళ అందాలు దాచకు అనువైనవేళ అందాలు దాచకు అణువణువు నిన్నే కోరె మురిపించకు ఇకనైనా నిను సిగ్గు తెరవేయకూ సావిత్రీ::నీ చూపుతో నన్ను ముడివేయకు ఈ పూలు వింటాయి సడిచేయకు NTR::కన్నుల్లో మిసమిసలు కనిపించనీ..ఈ..చరణం::2
సావిత్రీ::ఎటుచూసినా నువ్వే వినిపించే నీ నవ్వే మొహాలతో నన్ను మంత్రించకు ఎటుచూసినా నువ్వే వినిపించే నీ నవ్వే మొహాలతో నన్ను మంత్రించకు NTR::మనలోని ప్రేమ మారాకు వేయనీ మనలోని ప్రేమ మారాకు వేయనీ మనసార ఒడిలో నన్ను నిదురించనీ నీ నీలి ముంగురులు సవరించనీ సావిత్రీ::నీ చూపుతో నన్ను ముడివేయకు ఈ పూలు వింటాయి సడిచేయకు NTR::కన్నుల్లో మిసమిసలు కనిపించనీ గుండెల్లో గుసగుసలు వినిపించనీ కన్నుల్లో మిసమిసలు కనిపించనీ..ii..