Friday, November 14, 2014

కిరాతకుడు--1986
సంగీతం::ఇళయరాజ
రచన::వేటూరిసుందరరామ్మూర్తి
గానం::S.P.బాలు,S.జానకి 
Film Directed By::A.Kodandarami Reddy
నటీనటులు::చిరంజీవి,గుమ్మడి,అల్లురామలింగయ్య,నూతన్‌ప్రసాద్,కొంగారు జగ్గయ్య,టైగర్ ప్రభాకర్,తమ్మిరెడ్డి,S.V.కృష్ణ రెడ్డి,సుహాసిని,సిల్క్స్మిత,

పల్లవి::

సంపెంగ ముద్దు..నా చెంపకద్దు..హా..ఆఆఆ  
ఏ ముద్దులో ఏమున్నదో..ఏ పొద్దులో ఏమవుతదో
ఏమో..ఏమో..ఓఓఓఓఓఓఓ

అందాల బుగ్గ..మందార మొగ్గ..హా..ఆఆఆ  
ఏ ముద్దుకి ఏమిస్తవో..ఏ పొద్దులో ఏం చేస్తవో
ఏమో..ఏమో..ఓఓఓఓఓఓఓ 

సంపెంగ ముద్దు..నా చెంపకద్దు..హా..ఆఆఆ 

చరణం::1

పెదవుల్లో నీ ప్రేమ తాకితే..ఝుమ్మంది వయ్యారం
ఎద మీద ఎద పెట్టి వాలితే..పొంగింది నీ అందం
పైర గాలి సోకితే..పైట కాస్త జారగా
నవ్వగానే తుమ్మెద..మోవి మీద వాలగా
ముద్దుల్లో ముప్పూట..తేలించి లాలించి
వద్దన్నా వలపుల్ల..వాకిళ్ళు తెరిపించే
శృంగారాల..సంధ్యారాగాలెన్నో పలికే

సంపెంగ ముద్దు..నా చెంపకద్దు..హా..ఆఆఆ 
ఏ ముద్దులో ఏమున్నదో..ఏ పొద్దులో ఏమవుతదో
ఏమో..ఏమో..ఓఓఓఓఓఓఓ
అందాల బుగ్గ..మందార మొగ్గ..హా..ఆఆఆ 

చరణం::2

రైకల్లో జాబిల్లి దాగితే..నవ్వింది కార్తీకం
కౌగిట్లో దోపిళ్ళు సాగితే..కవ్వించే సాయంత్రం
చూడలేని అందము..చూపు దొంగిలించగా
తేలి రాని వెన్నెల..తెల్లవారి కాయగా
పొదరిళ్ళ వాకిళ్ళ..సొగసంతా ముగ్గేసి
ముంగిళ్ళు ముద్దుల్తో..ఎంగిళ్ళు చేసేసి
సౌందర్యాల..దీపాలెన్నో నాలో నింపే

అందాల బుగ్గ..మందార మొగ్గ..హా..ఆఆఆ  
ఏ ముద్దుకి ఏమిస్తవో..ఏ పొద్దులో ఏం చేస్తవో
ఏమో..ఏమో..ఓఓఓఓఓఓఓ
లలలలాల లలలలాలా లా ఆ లా

Kiraatakudu--1986
Music::Ilayaraja
Lyics::Vetoorisundararaammoorti
Singer's::S.P.Baalu,S.Janaki
Film Directed By::A.Kodandarami Reddy
Cast::Chiranjeevi,Kongaru Jaggayya,Gummadi,Alluraamalingayya,NooranPrasaad,Tiger Prabhakar,TammaReddi,S.V.Krishna Reddi,Suhaasini,Silksmita.

::::::::::::::::::::::::::::::::::

sampenga muddu..naa chempakaddu..haa..aaaaaaaaa  
E muddulO EmunnadO..E poddulO EmavutadO
EmO..EmO..OOOOOOO

andaala bugga..mandaara mogga..haa..aaaaaaaaa  
E mudduki EmistavO..E poddulO Em chEstavO
EmO..EmO..OOOOOOO 

sampenga muddu..naa chempakaddu..haa..aaaaaaaaa 

::::1

pedavullO nee prEma taakitE..jhummandi vayyaaram
eda meeda eda peTTi vaalitE..pongindi nee andam
paira gaali sOkitE..paiTa kaasta jaaragaa
navvagaanE tummeda..mOvi meeda vaalagaa
muddullO muppooTa..tElinchi laalinchi
vaddannaa valapulla..vaakiLLu teripinchE
SRngaaraala..sandhyaaraagaalennO palikE

sampenga muddu..naa chempakaddu..haa..aaaaaaaaa 
E muddulO EmunnadO..E poddulO EmavutadO
EmO..EmO..OOOOOOO
andaala bugga..mandaara mogga..haa..aaaaaaaaa 

::::2

raikallO jaabilli daagitE..navvindi kaarteekam
kaugiTlO dOpiLLu saagitE..kavvinchE saayantram
chooDalEni andamu..choopu dongilinchagaa
tEli raani vennela..tellavaari kaayagaa
podariLLa vaakiLLa..sogasantaa muggEsi
mungiLLu muddultO..engiLLu chEsEsi
soundaryaala..deepaalennO naalO nimpE

andaala bugga..mandaara mogga..haa..aaaaaaaaa  
E mudduki EmistavO..E poddulO Em chEstavO
EmO..EmO..OOOOOOO
lalalalaala lalalalaalaa laa aa laa

కిరాతకుడు--1986
సంగీతం::ఇళయరాజ
రచన::వేటూరిసుందరరామ్మూర్తి
గానం::S.P.బాలు,S.జానకి 
Film Directed By::A.Kodandarami Reddy
నటీనటులు::చిరంజీవి,గుమ్మడి,అల్లురామలింగయ్య,నూతన్‌ప్రసాద్,కొంగారు జగ్గయ్య,టైగర్ ప్రభాకర్,తమ్మిరెడ్డి,S.V.కృష్ణ రెడ్డి,సుహాసిని,సిల్క్స్మిత,

పల్లవి::

ఒక ముద్దు చాలు..ఒక పొద్దు చాలు నాకు
ఆ ముద్దు లేక..పొద్దెక్కదమ్మ నీకు
చూపే దాహం..మాటే మైకం
నీలో తాపం..నాకే సొంతం

తీయని..నీ నోటి పలుకు
ఓ స్వాతి చినుకు..కానీ
నీ వేడి పిలుపు..నా మేలుకొలుపు కానీ
చూపే దాహం..మాటే మైకం
నీలో తాపం..నాకే సొంతం

తీయని ఒక..ముద్దు చాలు
ఒక పొద్దు చాలు...నాకు

చరణం::1

ఈడే ఈనాడు..కోడై కూసె
నేనే నీ తీపి..తోడే కోరే
తడి చూపు ఇచ్చింది..తాంబూలము
నా పెదవింటి గడపల్లో..పేరంటము
ముత్యాల వానల్లే..వచ్చావులే
ఒక పగడాల హరివిల్లు..తెచ్చావులే
వాగల్లె నీ జోరు రేగాలి..ఈ చోట
తీరాలి నీతోనే..నా ముచ్చట నేడే..లలలలలా 

ఒక ముద్దు చాలు..ఒక పొద్దు చాలు నాకు
ఆ ముద్దు లేక..పొద్దెక్కదమ్మ నాకు

చరణం::2

పువ్వై పూసింది..నువ్వే నాలో
రవ్వై ఎగిసింది ..నవ్వే నీలో
పరువాలు నా పేర..రాయించుకో
తొలి పన్నీటి స్నానాలు..చేయించుకో
మురిపాలు సగపాలు..పంచేసుకో
నీ పొదరింట సరదాలు..పండించుకో
సందేళలో వచ్చి..అందాలు నాకిచ్చి
ఎద తట్టి నను నీవు..ఆకట్టుకో నేడే..ఏఏఏఏ

తీయని..నీ నోటి పలుకు
ఓ స్వాతి చినుకు..కానీ
నీ వేడి పిలుపు..నా మేలుకొలుపు కానీ
చూపే దాహం..మాటే మైకం
నీలో తాపం..నాకే సొంతం
తీయని ఒక..ముద్దు చాలు
ఒక పొద్దు చాలు...నాకు

Kiraatakudu--1986
Music::Ilayaraja
Lyics::Vetoorisundararaammoorti
Singer's::S.P.Baalu,S.Janaki
Film Directed By::A.Kodandarami Reddy
Cast::Chiranjeevi,Kongaru Jaggayya,Gummadi,Alluraamalingayya,NooranPrasaad,Tiger Prabhakar,TammaReddi,S.V.Krishna Reddi,Suhaasini,Silksmita.

::::::::::::::::::::::::::::::::::

oka muddu chaalu..oka poddu chaalu naaku
aa muddu lEka..poddekkadamma neeku
choopE daaham..maaTE maikam
neelO taapam..naakE sontam

teeyani..nee nOTi paluku
O swaati chinuku..kaanee
nee vEDi pilupu..naa mElukolupu kaanee
choopE daaham..maaTE maikam
neelO taapam..naakE sontam

teeyani oka..muddu chaalu
oka poddu chaalu...naaku

::::1

iiDE IInaaDu..kODai koose
nEnE nee teepi..tODE kOrE
taDi choopu ichchindi..taamboolamu
naa pedavinTi gaDapallO..pEranTamu
mutyaala vaanallE..vachchaavulE
oka pagaDaala harivillu..techchaavulE
vaagalle nee jOru rEgaali..ii chOTa
teeraali neetOnE.naa muchchaTa nEDE..lalalalalaa 

oka muddu chaalu..oka poddu chaalu naaku
aa muddu lEka..poddekkadamma naaku

::::2

puvvai poosindi..nuvvE naalO
ravvai egisindi ..navvE neelO
paruvaalu naa pEra..raayinchukO
toli panneeTi snaanaalu..chEyinchukO
muripaalu sagapaalu..panchEsukO
nee podarinTa saradaalu..panDinchukO
sandELalO vachchi..andaalu naakichchi
eda taTTi nanu neevu..aakaTTukO nEDE..EEEE

teeyani..nee nOTi paluku
O svaati chinuku..kaanee
nee vEDi pilupu..naa mElukolupu kaanee
choopE daaham..maaTE maikam
neelO taapam..naakE sontam
teeyani oka..muddu chaalu
oka poddu chaalu...naaku

కిరాతకుడు--1986సంగీతం::ఇళయరాజ
రచన::వేటూరిసుందరరామ్మూర్తి
గానం::S.P.బాలు,S.జానకి 
Film Directed By::A.Kodandarami Reddy
నటీనటులు::చిరంజీవి,గుమ్మడి,అల్లురామలింగయ్య,నూతన్‌ప్రసాద్,కొంగారు జగ్గయ్య,టైగర్ ప్రభాకర్,తమ్మిరెడ్డి,S.V.కృష్ణ రెడ్డి,సుహాసిని,సిల్క్స్మిత,

పల్లవి::

నీ పేరే ప్రణయమా..ప్రణయమా
నీ రూపే హృదయమా..హృదయమా

నీ ప్రేమ గీతిలో సుమించే..సుధా కుసుమమై
నీ చెంత చేరనా..వరించే తోలి ప్రణయమై
సాగే రాసలీల..సంధ్యా రాగ హేల..ఆ

నీ పేరే ప్రణయమా..ప్రణయమా
నీ రూపే హృదయమా..హృదయమా

చరణం::1

మనసున కురిసెను..సొగసుల మధువులు ప్రియా ప్రియా
పెదవులు కలిపెను..పరువపు ఋతులు ప్రియా ప్రియా

మనసున కురిసెను..సొగసుల మధువులు ప్రియా ప్రియా
పెదవులు కలిపెను..పరువపు ఋతులు ప్రియా ప్రియా

కౌగిలింత కావే..ప్రేమ దేవత..ఆ
కంటి చూపుతోనే..హారతివ్వనా..ఆ
నడుమును మరచిన..పుడమిని వెలిసిన పడతివి నీవేలే

నీ పేరే ప్రణయమా..ప్రణయమా
నీ రూపే హృదయమా..హృదయమా

చరణం::2

వలపుల వలలకు..వయసులు తగిలెను ప్రియా ప్రియా
మదనుని శరముల..సరిగమ తెలిసెను ప్రియా ప్రియా

వలపుల వలలకు..వయసులు తగిలెను ప్రియా ప్రియా
మదనుని శరముల..సరిగమ తెలిసెను ప్రియా ప్రియా

చైత్ర వీణ..నాలో పూలు పూయగా..ఆ
కోకిలమ్మ..నాలో వేణువూదగా..ఆ
కలతల మరుగున..మమతలు పొదిగిన ప్రియుడవు నీవేలే

నీ పేరే ప్రణయమా..ప్రణయమా
నీ రూపే హృదయమా..హృదయమా

నీ ప్రేమ గీతిలో సుమించే..సుధా కుసుమమై
నీ చెంత చేరనా..వరించే తోలి ప్రణయమై
సాగే రాసలీల..సంధ్యా రాగ హేల..ఆ

ఆ హా..ఆ హ ఆ అహా
ఆ హా..ఆ హ ఆ అహా

Kiraatakudu--1986
Music::Ilayaraja
Lyics::Vetoorisundararaammoorti
Singer's::S.P.Baalu,S.Janaki
Film Directed By::A.Kodandarami Reddy
Cast::Chiranjeevi,Kongaru Jaggayya,Gummadi,Alluraamalingayya,NooranPrasaad,Tiger Prabhakar,TammaReddi,S.V.Krishna Reddi,Suhaasini,Silksmita.

::::::::::::::::::::::::::::::::::

nee pErE praNayamaa..praNayamaa
nee roopE hRdayamaa..hRdayamaa

nee prEma geetilO suminchE..sudhaa kusumamai
nee chenta chEranaa..varinchE tOli praNayamai
saagE raasaleela..sandhyaa raaga hEla..aa

nee pErE praNayamaa..praNayamaa
nee roopE hRdayamaa..hRdayamaa

::::1

manasuna kurisenu..sogasula madhuvulu priyaa priyaa
pedavulu kalipenu..paruvapu Rtulu priyaa priyaa

manasuna kurisenu..sogasula madhuvulu priyaa priyaa
pedavulu kalipenu..paruvapu Rtulu priyaa priyaa

kaugilinta kaavE..prEma dEvata..aa
kanTi chooputOnE..haarativvanaa..aa
naDumunu marachina..puDamini velisina paDativi neevElE

nee pErE praNayamaa..praNayamaa
nee roopE hRdayamaa..hRdayamaa

::::2

valapula valalaku..vayasulu tagilenu priyaa priyaa
madanuni Saramula..sarigama telisenu priyaa priyaa

valapula valalaku..vayasulu tagilenu priyaa priyaa
madanuni Saramula..sarigama telisenu priyaa priyaa

chaitra veeNa..naalO poolu pooyagaa..aa
kOkilamma..naalO vENuvoodagaa..aa
kalatala maruguna..mamatalu podigina priyuDavu neevElE

nee pErE praNayamaa..praNayamaa
nee roopE hRdayamaa..hRdayamaa

nee prEma geetilO suminchE..sudhaa kusumamai
nee chenta chEranaa..varinchE tOli praNayamai
saagE raasaleela..sandhyaa raaga hEla..aa

aa haa..aa ha aa ahaa
aa haa..aa ha aa ahaa

కిరాతకుడు--1986సంగీతం::ఇళయరాజ
రచన::వేటూరిసుందరరామ్మూర్తి
గానం::S.P.బాలు
Film Directed By::A.Kodandarami Reddy
నటీనటులు::చిరంజీవి,గుమ్మడి,అల్లురామలింగయ్య,నూతన్‌ప్రసాద్,కొంగారు జగ్గయ్య,టైగర్ ప్రభాకర్,తమ్మిరెడ్డి,S.V.కృష్ణ రెడ్డి,సుహాసిని,సిల్క్స్మిత,

పల్లవి::

హే..ఏఏఏఏ..లలలలలాల
హే..ఏఏఏఏ..లలలలలాల
పిపిపిపిపిపీ..పిపిపిపిపిపీ
పిపిపిపిపిపీ..పిపిపిపిపిపీ

నన్నీ లోకం..రమ్మనలేదు
నేనీ జన్మను..ఇమ్మనలేదు
సరదాగా..ఆ..నే వచ్చేసాను..ఊ
జత కోసం..ఊ..గాలించేసాను..ఊ
అయ్యాను..ఖయ్యాం నేను

నన్నీ లోకం..రమ్మనలేదు
నేనీ జన్మను..ఇమ్మనలేదు

చరణం::1

మనిషి మనుగడే..పరమ బోరు
మనసుతో..ఒకే తగవులు
ఎవడు కోరును..పరుల మేలు
ఎదటి వాడికే..నీతులు
ఎవడికానందముంది..హ్హ..ఎక్కడుంది..ఈ
ఎవడికనుబంధముంది..అహ్హా..ఎంత ఉంది..ఈ
బ్రతుకులోనే..పగులు ఉంది
పగులుకేదో..అతుకు ఉంది
విశ్రాంతి..ఉందే ఉంది

నన్నీ లోకం..రమ్మనలేదు
నేనీ జన్మను..ఇమ్మనలేదు

చరణం::2

కళలు లేనిదే..కనులు లేవు
కరిగి చెదిరినా..మరువవు
మరువలేనిదే..బ్రతుకలేవు
గురుతులెన్నడూ..మిగలవు
మమతలన్నారు..ఏవి..అహ్హా..మచ్చుకేవి..ఈ
మనిషి ఏకాకి జీవి..మధుర జీవి..ఈ
సుఖము నిన్నే..వెతికి రాదు
వెతుకులాట..ముగిసిపోదు
విశ్రాంతి..లేనే లేదు

నన్నీ లోకం..రమ్మనలేదు
నేనీ జన్మను..ఇమ్మనలేదు
సరదాగా..ఆ..నే వచ్చేసాను..ఊ
జత కోసం..ఊ..గాలించేసాను..ఊ
అయ్యాను..ఖయ్యాం నేను

నన్నీ లోకం..రమ్మనలేదు
నేనీ జన్మను..ఇమ్మనలేదు

Kiraatakudu--1986
Music::Ilayaraja
Lyics::Vetoorisundararaammoorti
Singer's::S.P.Baalu
Film Directed By::A.Kodandarami Reddy
Cast::Chiranjeevi,Kongaru Jaggayya,Gummadi,Alluraamalingayya,NooranPrasaad,Tiger Prabhakar,TammaReddi,S.V.Krishna Reddi,Suhaasini,Silksmita.

::::::::::::::::::::::::::::::::::

hE..EEEE..lalalalalaala
hE..EEEE..lalalalalaala
pipipipipipii..pipipipipipii
pipipipipipii..pipipipipipii

nannee lOkam..rammanalEdu
nEnee janmanu..immanalEdu
saradaagaa..aa..nE vachchEsaanu..uu
jata kOsam..uu..gaalinchEsaanu..uu
ayyaanu..khayyaam nEnu

nannee lOkam..rammanalEdu
nEnee janmanu..immanalEdu

::::1

manishi manugaDE..parama bOru
manasutO..okE tagavulu
evaDu kOrunu..parula mElu
edaTi vaaDikE..neetulu
evaDikaanandamundi..hha..ekkaDundi..ii
evaDikanubandhamundi..ahhaa..enta undi..ii
bratukulOnE..pagulu undi
pagulukEdO..atuku undi
viSraanti..undE undi

nannee lOkam..rammanalEdu
nEnee janmanu..immanalEdu

::::2

kaLalu lEnidE..kanulu lEvu
karigi chedirinaa..maruvavu
maruvalEnidE..bratukalEvu
gurutulennaDoo..migalavu
mamatalannaaru..Evi..ahhaa..machchukEvi..ii
manishi Ekaaki jeevi..madhura jeevi..ii
sukhamu ninnE..vetiki raadu
vetukulaaTa..mugisipOdu
viSraanti..lEnE lEdu

nannee lOkam..rammanalEdu
nEnee janmanu..immanalEdu
saradaagaa..aa..nE vachchEsaanu..uu
jata kOsam..uu..gaalinchEsaanu..uu
ayyaanu..khayyaam nEnu

nannee lOkam..rammanalEdu
nEnee janmanu..immanalEdu