సంగీతం::S.రాజేశ్వరరావ్
రచన::కోసరాజురాఘవయ్య
గానం::P.సుశీల,స్వర్ణలత
తారాగణం::అక్కినేని,వాణిశ్రీ,కాంచన, కృష్ణంరాజు, పద్మనాభం,నాగయ్య.
పల్లవి::
ఘల ఘల ఘల ఘల గజ్జెల బండి
గణ గణ గణ గణ గంటల బండి
పల్లెటూరి యీ పడుచుల బండి
సవాలు చేస్తూ...పోతుంది
అహ జోరు జోరుగ పోతుంది
ఘల ఘల ఘల ఘల గజ్జెల బండి
గణ గణ గణ గణ గంటల బండి
పల్లెటూరి యీ పడుచుల బండి
సవాలు చేస్తూ...పోతుంది
అహ జోరు జోరుగ..పోతుంది
చరణం::1
బుర్రి పిట్టవలె సైకిలు మీద తుర్రున బోయెర
సోగ్గాడు అహ పట్నం పోయెర సోగ్గాడు
డాబుకు పోయి జేబు దులుపుకొని
దేబె మొకముతో వస్తాడు..అహ వస్తాడు
ప్రజలకు పుష్టిగ తిండి పెట్టుటకు కష్టించును
ఆ కుర్రోడు అతడే నిజమగు రైతు..బిడ్డడు
అడుగో..అడుగో..అటు..చూడు
ఘల ఘల ఘల ఘల గజ్జెల బండి
గణ గణ గణ గణ గంటల బండి
చరణం::2
కడుపు కట్టుకొని పాలూ..పెరుగూ
అమ్మబోతది..అచ్చమ్మా ఈ అచ్చమ్మా
డబ్బు కాశపడి..దొడ్లో కూరలు
టౌనుకేస్తది..బుచ్చమ్మా ఈ బుచ్చమ్మా
పాడీ పంటా పట్నంపాలు..పచ్చడి మెతుకులు మనపాలు
పల్లెటూళ్ళ కథ యింతేను..ఎన్నాళ్ళిలాగ జరిగేను
ఘల ఘల ఘల ఘల గజ్జెల బండి
గణ గణ గణ గణ గంటల బండి
పల్లెటూరి యీ పడుచుల బండి
సవాలు చేస్తూ..పోతుంది
అహ జోరు జోరుగ..పోతుంది